• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖలో మంత్రుల నిద్ర వెనుక అసలు ప్లాన్ ఇదేనా?: ఇక జగన్ కూడా: త్వరలో క్యాంపు కార్యాలయం షిఫ్ట్?

|

విశాఖపట్నం: రాష్ట్ర ప్రయోజనాల కోసం సంక్షోభంలో అవకాశాన్ని వెదుక్కుంటాననేది తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్పేమాట. తన చివరి అయిదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు ఈ పద ప్రయోగాన్ని చాలాాసార్లు..చాలా సందర్భాల్లో వినియోగించారు. రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలతో మిగిలిపోయి సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటానని చంద్రబాబు ఎపుడూ చెబుతుండేవారు.

మొన్న మద్యం..నిన్న ఎల్జీ పాలిమర్స్: జగన్ సర్కార్‌పై టీడీపీ లేటెస్ట్ వెపన్ ఇదే: ముప్పేటదాడి

మంత్రులతో పాటు..

మంత్రులతో పాటు..

ఇప్పుడు అదే సంక్షోభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశంగా మార్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్‌లో విష వాయువులు వెలువడిన అనంతరం విశాఖపట్నంలో సాధారణ పరిస్థితులను తీసుకుని రావడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి స్వయంగా మంత్రులు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో నిద్రించారు. ప్రజలకు అండగా తాము ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చారు. గ్యాస్ ప్రభావం లేదనే ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.

ఇక జగన్ కూడా అదే బాట..

ఇక జగన్ కూడా అదే బాట..

మంత్రులతో పాటు ఇక వైఎస్ జగన్ కూడా విశాఖపట్నం బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖపట్నానికి తరలించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ప్రజలకు భరోసా కల్పిస్తున్నామనే కారణంతో.. జగన్ కొన్ని రోజుల పాటు విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది తాత్కాలికమేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ.. విశాఖ నుంచి పరిపాలనను పూర్తి స్థాయిలో చేపట్టడానికి బాటలు వేసినట్టే అవుతుందని అంటున్నారు.

అందుబాటులో ఉన్న భవనాల్లోనే

అందుబాటులో ఉన్న భవనాల్లోనే

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాత్కాలిక ప్రాతిపదికన తరలించే అవకాశం ఉన్నందున.. పరిపాలనకు కాస్త అనువుగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవన సముదాయాలను దీనికి ప్రాథమికంగా వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మే 28వ తేదీ నాటికల్లా అందుబాటులో ఉన్న ఏదో ఒక భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని చెబుతున్నారు. కాపులుప్పాడ ప్రాంతంలో గల గ్రేహౌండ్స్ భవనాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పస్టత రాలేదు.

  AP 10th Class Exams in July: Education Minister Adimulapu Suresh
  హైకోర్టు అడ్డు చెప్పడం వల్లే..

  హైకోర్టు అడ్డు చెప్పడం వల్లే..

  మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో ఉంది. విచారణ పూర్తయ్యేంత వరకూ ఒక్క కార్యాలయాన్ని కూడా విశాఖకు తరలించకూడదంటూ ఆంక్షలను విధించింది. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను మాత్రం తాము అడ్డుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించడానికి చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన పరిపాలన సాగించడానికి అడ్డంకులు ఉండబోదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమౌతోంది.

  English summary
  Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy's camp office, now located at Thadealli in Guntur district is likely to move Visakhapatnam by the end of this month, source said. After LG Polymers gas leakage tragedy ministers and MPs, MLAs from ruling YSRCP was focussed on Vizag.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more