• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఐసీయూ ఆన్ వీల్స్: రోడ్డెక్కనున్న కొత్త అంబులెన్సులు: బెంజ్ సర్కిల్ వద్ద

|

విజయవాడ: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మరో ప్రాజెక్టు.. 108, 104 అంబులెన్సులు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రికగా భావించే ఈ ప్రాజెక్టును ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించబోతున్నారు. అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో 108, 104 సర్వీసులను తీర్చిదిద్దారు. మారుతున్న కాలానికి, అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య ప్రమాణాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దారు.

గ్యాస్ లీక్..డెడ్లీ బ్లాస్ట్: ఆసుపత్రిలో భారీ పేలుడు: 19 మంది దుర్మరణం: ఎన్నో అనుమానాలు

ఒకేసారి 1068 అంబులెన్స్ వాహనాలు..

ఒకేసారి 1068 అంబులెన్స్ వాహనాలు..

ఒకేసారి 1068 అంబులెన్స్ వాహనాలను వైఎస్ జగన్ కాస్సేపట్లో ప్రారంభించబోతున్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ దీనికి వేదికగా మారింది. ఈ ఉదయం 9:35 నిమిషాలకు అంబులెన్స్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం ఆయా వాహనాలన్నీ నిర్దేశిత పట్టణాలు, గ్రామాలకు తరలి వెళ్తాయి. దీనితో అత్యవసర వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టయింది. వైద్య సదుపాయాలు పెద్దగా అందుబాటులో లేని గ్రామాలను లక్ష్యంగా పెట్టుకుని ఈ అంబులెన్స్‌లను తీర్చిదిద్దింది ప్రభుత్వం.

ప్రతి మండలంలో 108, 104 అందుబాటులో..

ప్రతి మండలంలో 108, 104 అందుబాటులో..

రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ 108, 104 అంబులెన్స్ వాహనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పట్టణాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అరగంట వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లను చేసింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించే సమయంలోనే అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్సను అందిస్తారు. దీనికి అవసరమైన సదుపాయాలన్నింటినీ ఇందులో కల్పించారు. వెంటిలేటర్లు, ఇన్‌ఫ్యూజన్, సిరంజి పంప్స్‌ వంటి పరికరాలను అమర్చారు. ఇదివరకు ఈ సౌకర్యం అంబులెన్స్‌ల్లో ఉండేది కాదు.

  AP CM YS Jagan Review Meeting On Coronavirus Pandemic @ Tadepalli
  బీఎల్ఎస్, ఏఎల్ఎస్, నియో నాటల్

  బీఎల్ఎస్, ఏఎల్ఎస్, నియో నాటల్

  కొత్తగా అందుబాటులోకి తీసుకుని రాబోతోన్న అంబులెన్సులను బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌), అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చిదిద్దారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా మరో 26 అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. బీఎల్‌ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. ఏఎల్‌ఎస్‌ అంబులెన్సుల్లో రోగిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. నియో నాటల్‌ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లు, వెంటిలేటర్లను అమర్చారు.

  104 అంబులెన్సులను మొబైల్ మెడికల్ యూనిట్‌గా

  గ్రామాల్లో సేవలను అందించడానికి ఉద్దేశించిన 104 అంబులెన్సులను మొబైల్ మెడికల్ యూనిట్‌గా తీర్చిదిద్దారు. ఇందులో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో అనుసంధానమై అవి పని చేస్తాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. ప్రతి అంబులెన్స్‌లో ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌, జీపీఎస్‌‌తో అనుసంధానించి ఉంటాయి.

  English summary
  Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy will inaugurate 1,068 ambulances along with 676 mobile medical health care (104) units at 9.35 am at Vijayawada Benz Circle on Wednesday, July 1. The government has spent Rs 200.15 crores for the purpose. These ambulances will reach the spot within 15 minutes after a call in urban areas, 20 minutes in villages and will reach agency and tribal areas within 30 minutes.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X