వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Jagan: భారతితో కలిసి లక్నో వెళ్లొచ్చిన వైఎస్ జగన్: ప్రశాంత్ కిశోర్‌తో భేటీ..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఉత్తర ప్రదేశ్ రాజధానిలో కనిపించారు. ఓ వివాహానికి ఆయన భార్య భారతితో సహా హాజరయ్యారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఓ పెళ్లి వేడుకలో పాల్గొనడానికి లక్నో వరకూ వెళ్లాల్సిన అవసరం ఏముందనే అనుమానం కలగొచ్చు. ఆ పెళ్లి మరెవరదో కాదు.. ఐప్యాక్ సంస్థ డైరెక్టర్ రిషికుమార్‌ది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన సంస్థ అది.

గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి రాజకీయంగా సహకరించింది ఐప్యాక్. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ నిర్వహించిన పాదయాత్రకు వెల్లువెత్తిన ప్రజల ఆదరణను ఓట్ల రూపంలో మలచుకోవడానికి విలువైన సూచనలను అందించింది. అప్పటి నుంచీ ఆ సంస్థ, ఆ సంస్థ ప్రతినిధులతో వైఎస్ జగన్ సన్నిహితంగా ఉంటున్నారు. అందుకే- రిషికుమార్ వివాహానికి ఆయన లక్నో వెళ్లారు.

Recommended Video

Good Morning India : 3 Minutes 10 Headlines | #HappyBirthdayKCR | Maha Kaal Express
 AP Chief Minister YS Jagan visits lucknow for ipac director Rishi wedding

భార్య భారతితో కలిసి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన లక్నోకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో నిర్వహించిన రిసెప్షన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ దంపతులకు వారు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఇదే కార్యక్రమానికి హాజరైన ప్రశాంత్ కిశోర్‌ను జగన్ కలిశారు. అనంతరం రాత్రి 12:30 గంటల సమయంలో అమరావతికి చేరుకున్నారు. ఇది వ్యక్తిగత పర్యటన కావడం వల్ల ఎలాంటి రాజకీయ ప్రస్తావన చోటు చేసుకోలేదని తెలుస్తోంది.

KCR: కేంద్రంతో ఢీ: అసెంబ్లీలో తీర్మానానికి కేసీఆర్ సర్కార్ రెడీ: ఆ చట్టానికి తెలంగాణలో బ్రేక్..!KCR: కేంద్రంతో ఢీ: అసెంబ్లీలో తీర్మానానికి కేసీఆర్ సర్కార్ రెడీ: ఆ చట్టానికి తెలంగాణలో బ్రేక్..!

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy along with his wife YS Bharati visits Uttar Pradesh's Capital City Lucknow on Sunday. YS Jagan attend a wedding of Rishi Kumar, director of IPAC led by Prasanth Kishor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X