చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ చెట్టు కొడితే అంతే!...కాపలా కోసమే ఒక రెవిన్యూ ఉద్యోగి

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లాలో ఓ చెట్టు కోసమే ఏకంగా రెవిన్యూ ఉద్యోగిని కాపలా పెట్టారు. అతడి పనల్లా ఆ చెట్టును ఎవరూ కొట్టకుండా 24 గంటలూ కాపలా కాయడమే...
ఇంతకీ ఏంటి ఆ చెట్టు స్పెషల్...ఎందుకు ఆ చెట్టు కాపలా కోసం ప్రత్యేకించి ఒక ఉద్యోగిని కాపలా పెట్టారంటే...

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం నడుంపల్లి గ్రామంలో ఉన్న ఈ మర్రి చెట్టు వయస్సు 80 ఏళ్లు. దశాబ్దాలుగా పెరిగి ఊడలు దిగుతూ విస్తరించిన ఈ మర్రి చెట్టు గ్రామస్థులకు ఏళ్ల తరబడి చల్లని నీడనిస్తూనే ఉంది. అయితే చల్లటి తల్లి లాంటి ఈ చెట్టు విస్తరించిన ప్రదేశం మీద కొందరు అక్రమార్కుల కన్నుబడింది. దీంతో ఈ గ్రామంలోని ఓ వర్గం వారు ఈ చెట్టును నరికేసి అక్కడ ఓ గుడి కట్టాలని నిర్ణయించారు. ఇటీవలికాలంలో ఆ ప్రయత్నాలు ఆరంభించారు.

ap chittoor ancient tree hit temple group clashes court order vra kept gaurd

అయితే ఆ ఊరులోని ఎక్కువమంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కావాలంటే ఈ చెట్టు కింద గుడి కట్టుకోమని, అంతేకాని చెట్టు తీసేసి గుడి కట్టేందుకు ఒప్పుకునేది లేదని...ఈ విషయమై చెట్టును కాపాడాలంటూ అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అయితే ఈ విషయమై అధికారుల నుంచి స్పందన లేకపోవడం, చెట్టు కొట్టే ప్రయత్నాలు కొనసాగుతుండటంతో ఈసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

దీంతో ఈ చెట్టును కొట్టేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ చెట్టును ఎవరైనా కొట్టేస్తే నాన్ బెయిలబుల్ కేసు అవుతుందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో జిల్లా న్యాయవాదులు గ్రామ పరిస్థితి, గ్రామంలో ఈ చెట్టు పరిస్థితిని పరిశీలించి ప్రత్యేకించి ఈ చెట్టు కాపలా కోసమే దీని వద్ద ఒక వీఆర్‌ఏను కాపలాగా పెట్టారు. ఆయన పనల్లా ఈ చెట్టును కొట్టేందుకు ఎవరూ రాకుండా చూడటమే!...

English summary
A tree creating sensation in Chittoor district. This village split into two groups about this ancient tree. One group has approached the court to protect this tree from being hit. As a court order, a VRA has been kept as a guard to prevent this tree from being hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X