వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ లేఖపై మరో సంచలనం-ఆధారాల ధ్వంసం..సీఐడీ దర్యాప్తు కలకలం..

|
Google Oneindia TeluguNews

ఏపీలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నా.. ఆయనపై సాగుతున్న దర్యాప్తు ఇంకా సంచలనాలు రేపుతూనే ఉంది. ముఖ్యంగా ఆయన కేంద్రానికి రాసిన లేఖ వివాదాస్పదం కావడంతో దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన సీఐడీకి పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా నిమ్మగడ్డను ఫిక్స్ చేసేందుకు సీఐడీ అధికారులు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్డినెన్స్ సక్రమమే, సంస్కరణల కోసమే నిమ్మగడ్డ తొలగింపు.. హైకోర్టులో జగన్ సర్కార్ కౌంటర్... ఆర్డినెన్స్ సక్రమమే, సంస్కరణల కోసమే నిమ్మగడ్డ తొలగింపు.. హైకోర్టులో జగన్ సర్కార్ కౌంటర్...

నిమ్మగడ్డపై సీఐడీ దర్యాప్తు....

నిమ్మగడ్డపై సీఐడీ దర్యాప్తు....

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు అదనపు భద్రత కావాలని కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ వ్యవహారంలో వివాదాస్పద అంశాల కారణంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కు అదనపు పీఎస్ గా వ్యవహరించిన సాంబమూర్తిని విచారించిన అధికారులు పలు కీలక అంశాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో ఇవే కీలకం కానున్నట్లు అర్ధమవుతోంది.

ఫైల్స్ డిలీట్.. ఆధారాల ధ్వంసం...

ఫైల్స్ డిలీట్.. ఆధారాల ధ్వంసం...


నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తి విచారణ సందర్భంగా వివాదాస్పద లేఖ ఎవరు రాశారు, ఎక్కడి నుంచి ఎవరెవరికి పంపారన్న అంశాలపై అధికారులు ప్రశ్నించారు. ఇందులో ఆయన.. ఇందుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసినట్టు అంగీకరించారు. ల్యాప్ టాప్‌లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్‌ ద్వారా లేఖను డెస్క్ టాప్‌లో వేసినట్టు సాంబ మూర్తి చెప్పారు. ఆ లేఖను తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్‌కు పంపారు. ఆ లేఖను మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రానికి పంపినట్టు సమాచారం. ల్యాప్ టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయడంతో పాటు, పెన్ డ్రైవ్ ధ్వంసం చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. అనంతరం డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేశారని చెప్పారు.

ఆధారాల ధ్వంసం వెనుక...

ఆధారాల ధ్వంసం వెనుక...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన అధికారిక లేఖ నిజమైనదే అయినప్పుడు దాన్ని రూపొందించిన కంప్యూటర్ తో పాటు ఇతర పరికరాలను ఎందుకు ధ్వంసం చేశారనే అంశాన్ని ఇప్పుడు సీఐడీ దర్యాప్తు చేస్తోంది. పీఎస్ సాంబమూర్తి విచారణ సందర్భంగా ఇదే ప్రశ్న అయన్ను అడిగినప్పుడు... ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారో తనకు తెలియదనే సమాధానం వచ్చింది. దీంతో దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు

Recommended Video

CM Jagan Launches Zero Interest Scheme Today
బయట నుంచే లేఖ వచ్చిందా...

బయట నుంచే లేఖ వచ్చిందా...

వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి గతంలో ఆరోపించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఈ లేఖ బయట నుండి వచ్చి ఉండే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.
ఆధారాలు ట్యాంపర్‌ చేసిన అంశంపై కేసు నమోదు చేశామని సీఐడీ డీజీ సునీల్‌ కుమార్‌ తెలిపారు. లేఖ నంబర్‌పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించామన్నారు. కేంద్రానికి రాసిన లేఖ 221 నంబరే, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు రాసిన రిఫరెన్స్ లెటర్‌కు కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత సంచలనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
andhra pradesh crime investigation department's inquiry over former sec nimmagadda ramesh kumar's letter to centre became sensational as some key issues revealed. cid found that some key evidences had destroyed in this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X