వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి కొడాలి నాని శాఖ‌లో సీఎం చెప్పినా అంతే: కిలో బియ్యం రూ5..సంచి రూ.9: ఇదేనా పొదుపు..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కొడాలి నాని ఇప్పుడు మంత్రి. నిత్యం ప్ర‌జ‌ల‌తో సంబంధాలుండే పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ను ముఖ్య‌మంత్రి ఏరి కోరి నానికి అప్ప‌గించారు. అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి నిత్యం పార‌ద‌ర్శ‌క‌త‌..పొదుపు జ‌పం చేస్తున్నారు. విధుల నిర్వ‌హ‌ణ‌లో సిన్సియ‌ర్ ఉండే మంత్రి నాని..తన శాఖ‌లో జ‌రుగుతున్న వ్య‌వ‌హరాలు మాత్రం త‌ల నొప్పులు తెచ్చి పెడుతున్నాయి. మంత్రి ఆమోదంతోనే చేసారా..లేక అధికారు స్థాయిలో తీసుకున్న నిర్ణ‌య‌మో కానీ..ఇప్పుడు ఆ శాఖ తాజా నిర్ణ‌యం వివాదానికి..విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. రూపాయికి కిలో బియ్యం చొప్పున అయి దు కిలోల బియ్యం స‌ర‌ఫ‌రాకు తొమ్మ‌ది రూపాయాలు విలువ చేసే సంచీల్లో పంపిణీ చేస్తున్నారు. సంచీల ఖ‌ర్చు ఏకంగా 750 కోట్లుగా ఫిక్స్ చేసారు. మ‌రి..ఇదేనా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో పొదుపు..

కోడెల విజయలక్ష్మికి హై కోర్టులో షాక్...ముందస్తు బెయిల్‌ నిరాకరణకోడెల విజయలక్ష్మికి హై కోర్టులో షాక్...ముందస్తు బెయిల్‌ నిరాకరణ

బియ్యం రూ.5...సంచి రూ.9

బియ్యం రూ.5...సంచి రూ.9

రాష్ట్రంలో ఒక వైపు ఆర్దిక క‌ష్టాలు..ముఖ్య‌మంత్రి పొదుపు సూచ‌న‌లు ఏ మాత్రం పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌కు ప‌ట్ట‌టం లేదు. రాష్ట్రంలో కిలో బియ్యం రూపాయికే పంపిణీ చేస్తున్నారు. ప్ర‌తీ కుటుంబ‌లోకి ఒక్కొక్క‌రికీ అయిదు కిలో ల చొప్పున బియ్యం పంపిణీ అవుతున్నాయి. అయిదు కిలోల బియ్యానికి ఇచ్చే సంచి కోసం మాత్రం ప్ర‌భుత్వం ఒక్కో దానికి తొమ్మ‌ది రూపాయాలు ఖ‌ర్చ చేస్తోంది. ఐదు కిలోల సంచికి రూ.9, 10 కిలోల సంచికి రూ.12, 20కిలోల సంచికి రూ.14 ధరగా నిర్ణయించారు. ఆ ధరకు సంచులు సరఫరా చేసేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీల్‌కమల్‌ పాలీమర్స్‌ అనే కంపెనీతో ఒప్పందం కుదిరింది.ఈ సంచుల్లో డోర్‌ డెలివరీ విధానాన్ని రాష్ట్రమంతా అమలుచేయనున్నారు. ఈ ఏడాది సంచుల తయారీ, ప్యాకింగ్‌ చేసే యంత్రాలు అన్నీ కలిపి రూ.750 కోట్లు దాకా అవుతుందని ప్రభుత్వం అంచ నా వేసింది. అయితే ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది. ఇది మంత్రి కొడాలి నాని దృష్టి లో ఉందా లేదా అనేది స్ప‌ష్ట‌త లేదు.

సంచుల ఖ‌ర్చుతో స‌న్న‌బియ్య‌మే ఇవ్వ‌చ్చు..

సంచుల ఖ‌ర్చుతో స‌న్న‌బియ్య‌మే ఇవ్వ‌చ్చు..

ఇక నిత్యావ‌సరాల‌ను డోర్ డెలివ‌రీ చేస్తామ‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఆ విధంగా చేయాలంటే నెలకు 2.07 కోట్ల సంచులు అవసరం కానున్నాయి. అందులో ఐదు కిలోల సంచులు 74 లక్షలు, 10 కిలోల సంచులు 73 లక్షలు, 20 కిలోల సంచులు 60 లక్షలు అవసరం అవుతున్నాయి. దాని ప్రకారం ఐదు కిలోల సంచులకు రూ.6.66కోట్లు, 10కిలోల సంచులకు రూ.8.76కోట్లు, 20కిలోల సంచులకు రూ.8.4కోట్లు అవుతున్నాయి. అంటే నెలకు రూ.23.82కోట్ల చొప్పున 12 నెలలకు రూ.286.32కోట్లు అవుతుంది. ఇవి కాకుండా బఫర్‌ గోదాములకు తరలించేందుకు 50కిలోల సంచులు కూడా తయారుచేయాల్సి ఉంది. వాటితోపాటు ప్యాకింగ్‌ యంత్రాలు కొనుగోలు చేయాలి. ఆ యంత్రాల నిర్వహణ, ఇతర వ్య యాలు మొత్తం కలిపితే రూ.750 కోట్లు అవుతుందని అంచనా. ఈ ధ‌ర‌తో ప్ర‌భుత్వం ఇప్పుడిస్తున్న బియ్యం స్థానం లో స‌న్న బియ్యం ఇవ్వ‌చ్చ‌నేది అధికారుల వాద‌న‌..దీని ద్వారా ల‌బ్దిదారుల‌కు మ‌రింత ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది

ముఖ్య‌మంత్రి..కొడాలి నానిదే బాధ్య‌త కాదా..

ముఖ్య‌మంత్రి..కొడాలి నానిదే బాధ్య‌త కాదా..

త‌న శాఖ‌లో త‌న‌కు తెలిసి జ‌రిగినా..తెలియ‌క జ‌రిగినా ఇంద పెద్ద మొత్తంలో కేవ‌లం సంచుల కోస‌మే 750 కోట్లు ఖ‌ర్చు చేయ‌టం పైన ఇప్పుడు మంత్రి కొడాలి నాని స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇన్ని వందల కోట్లు తిరిగి ఉపయోగపడని సంచుల కోసం పెట్టే బదులు సన్నబియ్యం ఇస్తే పేదలకు లబ్ధి జరుగుతుందని అంటున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే సంచులు తిరిగి ఉపయోగించుకోవడానికి కూడా పనికిరావని, వాటి వల్ల కాంట్రాక్టర్లు లాభపడ టమే తప్ప తమకు ఒరిగేదేమీ ఉండదని చెబుతున్నారు. కేవ‌లం ముఖ్య‌మంత్రి..మంత్రి ఉన్న ఫొటోల‌ను సంచుల మీద అచ్చు వేసి పంపిణీకి సిద్దం చేసారు. మ‌రి...ప్ర‌భుత్వం ఇప్పుడు ఈ నిర్ణ‌యం పైన పున‌రాలోచ‌న చేస్తుందా.. లేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ముందుకే వెళ్తుందా అనేది తేలాల్సి ఉంది.

English summary
AP Civil Supplies Department new decision became controversy. For supply of Rice govt using bags with cost of 750cr. For supply of one rupee kg rice using nine rupees bag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X