వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు తీరొక్క చందం: ఫిరాయింపుదారులపై విభిన్న వైఖరి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్టయిలే వేరని రాజకీయ విశ్లేషకులు.. అంత మాటెందుకు? ఆయన సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. 1994లో మూడోసారి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్టయిలే వేరని రాజకీయ విశ్లేషకులు.. అంత మాటెందుకు? ఆయన సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. 1994లో మూడోసారి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారానికి వచ్చేసరికి భిన్నమైన రాజకీయ చిత్రం ఆవిష్క్రుతమైంది.

లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్న అన్నగారు 'ఎన్టీఆర్'కు చెప్పేదొకటి... చంద్రబాబు చేసేదొకటిగా మారిందన్న నానుడి ఇటీవలే చర్చలోకి వచ్చింది. 1995లో నాడు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల నియామకంపై జిల్లాలకు సీల్డ్ కవర్లలో కొందరు నేతల పేర్లు సిఫారసు చేస్తూ నాటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ పంపితే కొన్ని జిల్లాల్లో అందుకు భిన్నంగా జరిగింది.

చెప్పిన మాట వినకపోతే ఎన్టీఆర్ ఆగ్రహం పట్టలేరు.. వాస్తవ పరిస్థితులు తెలిసినా, రాజకీయంగా పార్టీ పట్టు సాధించేందుకు అసమ్మతి ప్రదర్శించిన ఎమ్మెల్యేలకు దాదాపు 35 మందికి నోటీసులు జారీచేశారు. దీనిపై పార్టీలో కల్లోలం చెలరేగింది.

ఎన్టీఆర్‌పై తిరుగుబాటుకు ఇలా నేపథ్యం

ఎన్టీఆర్‌పై తిరుగుబాటుకు ఇలా నేపథ్యం

నాటి ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు ఎమ్మెల్యేలందరికీ విడివిడిగా ఫోన్ చేసి ‘మీపై పార్టీ అధినేత ఎన్టీఆర్ ఆగ్రహంగా ఉన్నారు' ఎప్పుడైనా చర్య తీసుకోవచ్చునని పదేపదే చెప్తూ సదరు ఎమ్మెల్యేలు తన పక్షాన చేరేలా వ్యూహం అమలు చేశారని ప్రతీతి. ఈ విషయాన్ని చంద్రబాబు తోడల్లుడు - మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావే స్వయంగా చెప్పిన సంగతి ఇది. 2004 - 2014 మధ్య పదేపదే నేను మారాను అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నమ్మేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉన్నది. కానీ 2014లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ సీఎంగా చంద్రబాబు అనుసరించిన, అనుసరిస్తున్న తీరు తెన్నుల గురించి గమనిస్తే ఆయన మారిపోలేదని తేలిపోయింది. అంతకుముందు 1983లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు నాయుడు.. నాటి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ప్రస్తుత ఎమ్మెల్యే కుతూహలమ్మను ఓడించిన ఘనత సంపాదించుకున్నారు.

Recommended Video

Chandrababu Naidu And His son Nara Lokesh Fight Real OR Fake ?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఇలా ఫిరాయింపులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఇలా ఫిరాయింపులు

వైరి పక్షం పట్ల చంద్రబాబు అనుసరించే తీరుకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో గెలుపొందిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అధికార పక్షం వైపు మళ్లించిన నేపథ్యం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. వైఎస్ఆర్ సొంత జిల్లా కడప నుంచి కర్నూల్ వరకు.. శ్రీకాకుళం నుంచి క్రుష్ణా జిల్లా వరకూ ఇదే వరస. అందులో చిన్న తేడా కూడా ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్.. కర్నూల్ జిల్లాలో భూమా తండ్రీ తనయలు, విజయనగరం జిల్లాలో సుజయ కృష్ణ రంగారావు, కడపలో ఆదినారాయణరెడ్డి, మరో మంత్రి కేఎస్ జవహార్ తదితరులను టీడీపీలో చేర్చుకున్నారు.

అద్దంకిలో గొట్టిపాటికే ప్రాధాన్యం

అద్దంకిలో గొట్టిపాటికే ప్రాధాన్యం

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా చోటు కల్పించిన చంద్రబాబు నాయుడు.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)ను టీడీపీలోకి ఆహ్వానించారు. అంతే కాదు అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ నాయకత్వానిదే తుది నిర్ణయమని.. అక్కడ జోక్యం చేసుకోవద్దని కరణం బలరామ కృష్ణమూర్తిని చంద్రబాబు హెచ్చరించారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అనుచరుడిగా పేరొందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ రాజకీయాలు మారిపోవడంతో టీడీపీలో చేరిపోయారు. కానీ ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అంతర్మథనంలో పడ్డారా? అధికార టీడీపీపై అసంతృప్తితో రగిలిపోతున్నారా? జరుగుతున్న పరిణామాలను, టీడీడీ నేతల మధ్య జరుగుతున్న చర్చను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది.

సునీతపై పట్టు కోసం ఇలా ఆమంచి

సునీతపై పట్టు కోసం ఇలా ఆమంచి

పార్టీలో చేర్చుకునేటప్పుడు ‘అధికారాలన్నీ నీకే..' అంటూ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు ఏరు దాటాక బోడి మల్లన్న సామెతలా వ్యవహరించారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఆవేదనలో ఉన్నట్లు సొంతపార్టీ నేతలే పేర్కొనటం గమనార్హం. టీడీపీలో చేరి తొందరపడ్డానా? అని ఆత్మపరిశీలన చేసుకుంటున్న ఆమంచి ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో ఉన్నట్లు ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌.. తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో, ఆమంచిపై ఓడిపోయిన పోతుల సునీత అధిపత్యం చెలాయించే పరిస్థితి తలెత్తింది. ఆమెకు అడ్డుకట్ట వేసేందుకు ఆమంచి పావులు కదిపారు. ఇదే సమయంలో అధికార పార్టీ సైతం ఫిరాయింపులను ప్రోత్సహించటంతో ఇదే అదునుగా ఆమంచి టీడీపీలో చేరారు. అధికారంతోపాటు పాటు తన ప్రత్యర్థి సునీతకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన భావించారు.

ఇలా పోటీగా ఎమ్మెల్సీ సునీతకు ప్రోత్సాహం

ఇలా పోటీగా ఎమ్మెల్సీ సునీతకు ప్రోత్సాహం

చీరాల అసెంబ్లీ స్థానం పరిధిలో టీడీపీ పాత, కొత్త నేతల మధ్య ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఎమ్మెల్యేలకే నియోజకవర్గ అధికారాలంటూ సీఎం సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన అధిపత్యానికి ఎదురు ఉండదని ఎమ్మెల్యే ఆమంచి ఆమంచి కృష్ణమోహన్‌ భావించారు. ఇచ్చిన మాటపై నిలబడడన్న పేరున్న చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారు. రెండు గుర్రాల స్వారీకి దిగారు. ఆమంచిపై అనుమానంతో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన సునీతను సైతం ప్రోత్సహించారు. ఊహించని రీతిలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆమంచి దూకుడుకు అడ్డుకట్ట వేసే సంకేతాలు పంపారు. దీంతో ఎమ్మెల్సీ సునీత ఎమ్మెల్యే ఆమంచికి అడుగడుగునా అడ్డుపడ్డారు. అధిపత్యం చాటేందుకు అమీతుమీకి సిద్ధమయ్యారు.

తలనొప్పిగా మారిన పాలేటి

తలనొప్పిగా మారిన పాలేటి

చీరాల నియోజకవర్గంలో జన్మభూమి - మా ఊరు, జన చైతన్యయాత్రలు, సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి ప్రకటించినా జిల్లాలోని అద్దంకితో పాటు చీరాలలోనూ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్రతి దాంట్లోనూ పోతుల సునీత వేలు పెట్టడం మొదలుపెట్టారు. ఏకంగా ముఖ్యమంత్రి వద్దే పనులు చక్కబెట్టుకోవడం ప్రారంభించారు. అంతెందుకు టీడీపీ మండల కమిటీలు సైతం ఆమంచితో పోటీ పడి సొంతంగా వేయడం సునీత ఎదురుదాడి అని చెప్పకనే చెప్పింది. ఇదే సమయంలో ఆమంచికి వ్యతిరేక వర్గంగా ఉన్న మాజీ మంత్రి పాలేటి రామారావు సైతం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల జరిగిన అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకం సాగునీటి అధ్యక్ష ఎన్నికల్లోనూ అటు పాలేటి రామారావు, ఆమంచి వర్గాలు పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో పాలేటి రామారావు అనుచరుడు పోటీలో నెగ్గారు. పాలేటి సైతం మూడో వర్గంగా మారి బూత్‌లెవల్‌ కమిటీ సమావేశాలు సైతం నిర్వహిస్తుండటం గమనార్హం. ఒక వైపు పోతుల సునీత, మరొక వైపు పాలేటి రామారావు సైతం తనతో పోటీ కార్యక్రమాలు నిర్వహించటం, అన్ని విషయాల్లో పోటీ పడుతుండటం ఆమంచికి తలనొప్పిగానే కాదు అవమానకరంగా మారింది. నిన్న, మొన్నటి వరకు ఏకచక్రాధిపత్యంగా వెలిగిన ఆమంచి ఇప్పుడు స్వపక్షంలోనే అడుగడుగునా పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. పైపెచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, అధిపత్యం చాటే పరిస్థితి లేదు. ఈ విషయం జిల్లా స్థాయిలోనూ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నమ్మించి నట్టేట ముంచారని టీడీపీలో చేరి అణిగిమణిగి ఉండాల్సి వస్తుందని ఆయన వేదన చెందుతున్నట్లు సమాచారం. ఇటీవల ఒంగోలులో జరిగిన మినీ మహానాడు సమావేశానికి హాజరైన ఆమంచి మొక్కుబడిగా కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు.

కరణం జోక్యానికి చంద్రబాబు నో

కరణం జోక్యానికి చంద్రబాబు నో

టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరామక్రుష్ణమూర్తి తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినప్పుడే అద్దంకి అసెంబ్లీ స్థానంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించినా వినిపించుకోవడం లేదని మండిపడినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం కనిగిరిలో జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కరణం బలరాం.. పార్టీ నాయకత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొత్త కుహానా నాయకులకు పెద్దపీట వేస్తున్నారని ఆక్రోశించారు. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచితే చూస్తూ ఊరుకోబోమని సెలవిచ్చారు. కానీ మంత్రులు పరిటాల సునీత, శిద్ధా రాఘవరావు సాక్షిగా మండిపడిన కరణం.. ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేశారు. సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని సర్దుబాటు చేసుకుందామని మంత్రులు నచ్చజెప్పారు. ఈ సంగతి తెలిసిన చంద్రబాబు.. కరణం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వార్తలొచ్చాయి.

నంద్యాల బై ఎలక్షన్ ఇలా ప్రతిష్ఠాత్మకం

నంద్యాల బై ఎలక్షన్ ఇలా ప్రతిష్ఠాత్మకం

టీడీపీ సీనియర్ నేత ఎన్ఎండీ ఫరూఖ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలోనూ, బాబు హాయాంలోనూ మంత్రిగానూ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గానూ పని చేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత తెర మరుగయ్యారు. కానీ ప్రస్తుతం భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పాలవ్వడంతో వచ్చేనెల 23వ తేదీన నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నిక అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

ఏపీ సీఎం చంద్రబాబు నెల రోజుల్లోనే రెండుసార్లు నంద్యాలలో పర్యటించడం పరిస్థితి తీవ్రతను, ఉప ఎన్నికల పట్ల ఆయన పట్టుదలను కూడా అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు అధికార టీడీపీ, అటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇరు పార్టీలకు చెందిన నేతలు బంధువులే. ముస్లింలు గణనీయ పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఎన్ఎండీ ఫరూఖ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం అవసరార్థం చంద్రబాబు తీసుకున్న మరో తాజా నిర్ణయాల్లో ఒకటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నికను చంద్రబాబు నాయుడు ఇంత సీరియస్ గా తీసుకోవడానికి ప్రధాన కారణం.. ప్రస్తుతం మంత్రి భూమా అఖిలప్రియ, మరణించిన ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు కావడం.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారు టీడీపీలో చేరడమేనని విశ్లేషకులు అంటున్నారు.

రామ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవితో సరి

రామ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవితో సరి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత జిల్లా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టేందుకు ఒకనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుంగు సహచరుడు ఆదినారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారు. అంతే కాదు మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. 1993లో మాజీ మంత్రి శివారెడ్డి హత్య తర్వాత జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు సారథ్యం వహిస్తున్న రామసుబ్బారెడ్డిని పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. 2014 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోవడంతో ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించడంతో పరిస్థితి మారిపోయింది. రామసుబ్బారెడ్డికి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇక క్యాబినెట్‌లో చోటు కల్పించిన తర్వాత ఆదినారాయణ రెడ్డి మాటే వేదంగా మారింది. దీనిపట్ల కినుక వహించిన రామసుబ్బారెడ్డి ఒకానొక దశలో పార్టీ మారతారన్న ప్రచారం కూడా సాగింది. అదే జరిగితే భవిష్యత్‌లో కడప జిల్లాతోపాటు రాష్ట్రస్థాయిలో రాజకీయ పరిణామాలే మారిపోతాయన్న భయంతోనే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని విశ్లేషకులు సందేహిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం ప్రాధాన్యం

నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం ప్రాధాన్యం

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ‘ఆనం' కుటుంబానికి పేరు ఉన్నది. మూడు తరాల నాయకులు జిల్లా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. 1985లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్టీఆర్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న ఆనం రామ నారాయణ రెడ్డి 1999 వరకు రాజకీయాల్లో కనిపించలేదు. 1999లో మళ్లీ గెలుపొందిన తర్వాత వెలుగులోకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రులుగా ముగ్గురు ఆనం కుటుంబ సభ్యులు పని చేసిన చరిత్ర ఉన్నది. 2004, 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. వైఎస్ క్యాబినెట్ లో, తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసిన ఆనం రామ నారాయణ రెడ్డి, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీతో ఆనం బ్రదర్స్ టీడీపీ ‘సైకిల్' ఎక్కారు. కానీ నాటి నుంచి ఇప్పటి వరకు పలు దఫాలు ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు తప్పిపోతూ రావడంతో పొరపాటు చేశామన్న భావన ఆనం బ్రదర్స్‌లో చోటు చేసుకున్నది.

జెడ్పీ చైర్మన్‌గా జ్యోతుల తనయుడు

జెడ్పీ చైర్మన్‌గా జ్యోతుల తనయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రాతినిధ్యం ఎక్కువే. కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవలే టీడీపీలో చేరారు. ఇప్పటివరకు తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న నేతను పక్కకు తప్పించి మంత్రి పదవి ఇవ్వడానికి బదులు ఆయన కొడుక్కు జెడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.

అశోక్ గజపతి రాజు ఆధిపత్యానికి బాబు ఇలా చెక్

అశోక్ గజపతి రాజు ఆధిపత్యానికి బాబు ఇలా చెక్

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక్కటైన విజయనగరం నుంచి ప్రాతినిధ్యం వహించిన సుజయ్ క్రుష్ణ రంగారావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవిపై ఆశతో టీడీపీలో చేరారు అంతటితో ఆగక ఆశించినట్లే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లాలో రాజ వంశీయులుగా భావించే పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక రాజకీయాలకు మారుపేరు. 1994 మినహా ఓటమెరుగని అశోక్ గజపతి రాజు 2014 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ చంద్రబాబు ఆలోచన మరోలా ఉంది. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు చరిష్మాకు తిరుగులేదు. టీడీపీ సంస్థాగత వ్యవహారాల్లో జిల్లా స్థాయిలో పార్టీ నాయకత్వం జోక్యం చేసుకోలేదు. కానీ ఇటీవల అశోక్ గజపతి రాజు అనుచరుడిని కాదని మరొకరిని టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు.

English summary
Andhra Pradesh CM, TDP President Nara Chandra Babu Naidu has name Chanakya in politics at the same time he prefered for choice diffections from opposition parties particularly YSR Congress party MLAs. He has behaviour with different with other MLAs and political leaders from Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X