వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో అసమర్థ ప్రభుత్వం ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారు: ఆయన ఎలా గెలిచారో నాకు తెలుసు: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ జగన్ మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు. చీకటి ఒప్పందాలు త్వరలోనే బయటపడతాయని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులను తెలంగాణ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని, తాము దీన్ని ఉపేక్షించబోమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసమర్థ ప్రభుత్వం ఉండాలని కేసీఆర్‌ భావిస్తున్నారని ఆరోపించారు.

కప్పం కట్టిచ్చుకుంటారు..

కప్పం కట్టిచ్చుకుంటారు..

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైతే దారుణ పరిస్థితులు ఏర్పడుతాయని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ ద్వారా కేసీఆర్ కప్పం కట్టిచ్చుకుంటారని అన్నారు. ఏపీలో పుట్టడమే నేరమా అని..హైదరాబాద్‌లో ఉండేవాళ్లు భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ తుపాను కంటే పెద్ద సమస్యేనని చంద్రబాబు అన్నారు. తుపాను కొన్ని ప్రాంతాలపైనే ప్రభావం చూపుతుందని, జగన్‌ ప్రతి అభివృద్ధి పనికి అడ్డం పడతారని చెప్పారు. జగన్‌ ఉంటే ఆటలు సాగుతాయని టీఆర్ఎస్ నేతలు భ్రమపడుతున్నారని అన్నారు.

98 లక్షల మంది పసుపు-కుంకుమ

98 లక్షల మంది పసుపు-కుంకుమ

రాష్ట్రంలో 3 కోట్ల 91 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 98 లక్షల మందికి పసుపు-కుంకుమ ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. మహిళలంతా ఏకపక్షంగా టీడీపీకి ఓట్లు వేయాలని సూచించారు. అర్హులకు పింఛన్లు, నిరుద్యోగభృతి ఇస్తున్నామని చెప్పారు. 45 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమ హామీలను జగన్ కాపీ కొడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 2014లో టీడీపీ హామీలు సాధ్యం కావని జగన్ చెప్పారని, ఇప్పుడు అవే హామీలను కాపీ కొట్టి, ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు.

 జగన్-కేసీఆర్ డేటా దొంగలు

జగన్-కేసీఆర్ డేటా దొంగలు

తమ డేటాను దొంగిలించి తిరిగి తమ పైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. అరెస్టులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు అర్థిక ఉగ్రవాదులుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు చంద్రబాబు. జగన్ గెలిస్తే ఏపీ ప్రభుత్వం నుంచి కేసీఆర్ కప్పం వసూలు చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

కేసీఆర్ ఎలా గెలిచారో తెలుసా?

కేసీఆర్ ఎలా గెలిచారో తెలుసా?

టీడీపీ సమాచారాన్ని దొంగిలించడానికి దాడులు చేశారని అన్నారు. ఇది దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో ప్రజలకు భయభ్రాంతులకు గురిచేస్తారా అని ఆయన నిలదీశారు. 20 ఏళ్లుగా కార్యకర్తల సమాచారం సేకరిస్తున్నామని అన్నారు. 60 లక్షల మంది టీడీపీ కార్యక్తల వివరాలను కంపూట్యరీకరణ చేశామని చెప్పారు. తమ సమాచారాన్ని కొట్టేసి తమపైనే కేసులు పెడతున్నారని చెప్పారు. ఫారమ్ -7తో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణలో అలాగే గెలిచారని అన్నారు. అదే టెక్నాలజీని ఏపీలో వైసీపీకి ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేతిలో అధికారం ఉందని అహంభావం పనికి రాదని చెప్పారు. తన డేటాను దొంగిలించడానికి కేసీఆర్ ఎవ్వరని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో లేకున్నా ఇన్ని అరాచకాలు చేస్తున్నారని, గెలిస్తే ఇంకెన్ని చేస్తారోనని చంద్రబాబు చెప్పారు.

అడ్డంకులు సృష్టిస్తున్న జగన్..

అడ్డంకులు సృష్టిస్తున్న జగన్..


రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే..జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వానికి సహకరించకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. కరుడుగట్టిన నేరస్థులు చేసే పనులు ఇలానే ఉంటాయని మండిపడ్డారు. ఐటీ, సీబీఐ దాడులతో నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కేంద్రంపై ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు.

English summary
Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu gave strong counter to his Telangana Counterpart K Chandra Sekhar Rao. Data theft done by the KCR Government and YS Jagan, Naidu alleged. KCR wants weak Government to form in Andhra Pradesh through YS Jagan, He crictics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X