శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రానికి మనసు లేదు... పవన్‌కళ్యాణ్‌ది దొంగ ప్రేమ:సిఎం చంద్రబాబు;హెరిటేజ్ విరాళం

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రానికి తితలీ తుపాన్ బాధితులను ఆదుకునే బాధ్యత లేదా?... అని చంద్రబాబు ప్రశ్నించారు.

శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ సందర్భంగా కేంద్రంతో పాటు ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఉద్దానంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ కు ఉన్నది దొంగ ప్రేమని...తుపానుతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పవన్‌ ఎక్కడికి వెళ్లారని చంద్రబాబు నిలదీశారు.

పండుగ రోజు...సిఎం పర్యటన

పండుగ రోజు...సిఎం పర్యటన

పండుగ రోజు కూడా శ్రీకాకుళం జిల్లాలోని తుఫాన్ తాకిడి ప్రాంతాల్లో పర్యటన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా కేంద్రం, విపక్షాలపై మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు ఒక్కరు కూడా ఎందుకు రాలేదని చంద్రబాబు ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మీకు రాజకీయాలే ముఖ్యమా?...అని చంద్రబాబు నిలదీశారు.

మేమిక్కడ ఉంటే...దాడులా?

మేమిక్కడ ఉంటే...దాడులా?

తాము తుపాను సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే...మా పార్టీ ఎంపీల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తారా?...అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. బీజేపీ కార్యాలయ శంకుస్థాపనకు ఇది సమయమా?...అని తప్పుబట్టారు. గుంటూరు వచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్ శ్రీకాకుళం రాకుండానే వెళ్లిపోయారని చంద్రబాబు గుర్తుచేశారు.తనపై మోదీ, కేసీఆర్‌, జగన్‌, పవన్‌ కక్షగట్టారని...తానేం తప్పు చేశానని చంద్రబాబు ప్రశ్నించారు.

అందుకే...ఆ పొత్తు

అందుకే...ఆ పొత్తు

విభజన హామీలు అమలు చేస్తారనే ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయకపోగా... తెలుగుజాతిని చిన్నచూపు చూసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ, పవన్ పార్టీలను రాష్ట్రంపై బిజెపి నేతలే ఉసిగొల్పుతున్నారని బాబు ఆరోపించారు. తెలుగుజాతిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు.

Recommended Video

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు..!
జగన్ ఏడీ?...ఎక్కడ?

జగన్ ఏడీ?...ఎక్కడ?

ఉద్దానానికి ఇంత కష్టమొస్తే జగన్‌ ఎక్కడికి పోయారని చంద్రబాబు ప్రశ్నించారు. పక్క జిల్లాలో ఉన్న జగన్‌.. తితలీ బాధితులను పరామర్శించరా?...అని నిలదీశారు.
పక్క జిల్లాలో ఉన్న జగన్‌...తితలీ బాధితులను పరామర్శించరా?...అని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని...సహాయకచర్యలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఈ సందర్భంగా ఆరోపించారు.

పవన్ ది...దొంగ ప్రేమ

పవన్ ది...దొంగ ప్రేమ

ఉద్దానంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ది దొంగ ప్రేమని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. తుపానుతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పవన్‌ ఎక్కడికి వెళ్లారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఇక్కడ తితలీ తుఫాన్ బారిన పడి బాధితులు ఇబ్బందులు పడుతుంటే...పవన్‌ కవాతును కేటీఆర్‌ అభినందించడమేంటని చంద్రబాబు మండిపడ్డారు.

హెరిటేజ్ సంస్థ...విరాళం

హెరిటేజ్ సంస్థ...విరాళం

ఇదిలావుంటే తితలీ తుఫాను బాధితులకు హెరిటేజ్‌ సంస్థ రూ.66 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ డైరెక్టర్ నారా బ్రాహ్మణి చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ విరాళం అందరికి ఆదర్శమని అన్నారు. తూర్పు ఆర్గనైజేషన్ ద్వారా ఉద్దానంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. తుపాను బాధితులకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నెల జీతం విరాళంగా ప్రకటించారని ఆయన చెప్పారు.

English summary
Srikakulam: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, while going through the cyclone-hit areas in Srikakulam district on today, he questioned whether the Center doesn't has responsibility to help the cyclone victims?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X