వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు కేరాఫ్ 10 జ‌న‌ప‌థ్‌: సోనియాతో ముగిసిన భేటీ: వైఎస్ జ‌గన్‌, కేసీఆర్ అంశం ప్ర‌స్తావ‌న‌?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ నెల 23వ తేదీన ఫ‌లితాలు వెలువ‌డిన అనంత‌రం చోటు చేసుకునే రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో.. కాంగ్రెస్ సార‌థ్యం వ‌హిస్తోన్న యూపీఏ మిత్ర‌ప‌క్షాల‌తో ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఇందులో భాగంగా- తాజాగా ఆయ‌న యూపీఏ ఛైర్‌ప‌ర్స‌న్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సోనియాగాంధీ నివాసం 10 జ‌న‌ప‌థ్‌లో సుమారు 40 నిమిషాల పాటు స‌మావేశం అయ్యారు. ముఖాముఖి భేటీ నిర్వ‌హించారు.

కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తాపార్టీల‌తో స‌మ‌దూరాన్ని పాటిస్తోన్న ప్రాంతీయ పార్టీల అంశం ఈ సంద‌ర్భంగా ప్రస్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి నేతృత్వంలోని టీఆర్ఎస్‌, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్య‌క్షుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వైఖ‌రి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వైఎస్ జ‌గ‌న్ గురించి సోనియాగాంధీ ప్ర‌స్తావించ‌గా.. దానిపై చ‌ర్చించ‌డానికి చంద్ర‌బాబు నాయుడు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేద‌ని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో- కేసీఆర్ విష‌యాన్ని సోనియా ప్ర‌స్తావించిన‌ట్లు చెబుతున్నారు. కేసీఆర్‌ను క‌లుపుకొనిపోవ‌డానికి త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం.

AP CM Chandrababu met UPA Chairperson Sonia Gandhi

ఈ నెల 23వ తేదీన ఫ‌లితాల అనంత‌రం- యూపీఏ నిర్వ‌హించ‌బోయే విప‌క్ష పార్టీల స‌మావేశానికి కేసీఆర్‌, వైఎస్ జ‌గ‌న్ స‌హా న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ల‌కు ఆహ్వానం పంపించిన‌ప్ప‌టికీ.. వారి నుంచి పెద్ద‌గా స్పంద‌న రాలేద‌ని, ఇది కూడా సోనియాగాంధీ-చంద్ర‌బాబు మ‌ధ్య ప్ర‌స్తావించిన‌ట్లు చెబుతున్నారు. కాగా- బ‌హుజ‌న్ స‌మాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి, స‌మాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో తాను నిర్వ‌హించిన స‌మావేశ వివ‌రాల‌ను సోనియాకు వివ‌రించారు.

AP CM Chandrababu met UPA Chairperson Sonia Gandhi
English summary
Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu met UPA Chairperson Sonia Gandhi at 10 Janpath in New Delhi. He explained about his efforts for bring together of all Regional Parties. After meeting he leaves 10 Janpath after a meeting with UPA Chairperson Sonia Gandhi. Chandrababu met Sam Pitroda also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X