• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆపరేషన్ గరుడలో చెప్పినట్లే, ప్రభుత్వాన్ని కూల్చాలనే: గవర్నర్‌పై బాబు తీవ్ర విమర్శలు

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు. మంత్రులు, ఉన్నతాధికారులతో శాంతిభద్రతలు, మావోయిస్టుల కదలికలు, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ, కేంద్రంపై నిప్పులు చెరిగారు. జగన్‌పై దాడి, తదనంతర పరిణామాలు చర్చించారు. కేంద్రం తప్పు చేస్తోందని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

  శివాజీ చెప్పిందే జరిగిందా.. జగన్‌పై దాడి ‘గరుడ’ పనేనా ?

  నేరాలు చేసిన వ్యక్తులు రాజకీయం ముసుగులో ఉన్నారని ఆరోపించారు. రాజకీయం పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పారు. గవర్నర్ నరసింహన్ తీరుపై చంద్రబాబు మరోసారి అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్లు కేంద్రానికి సీక్రెట్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని చెప్పారు. గవర్నర్ నేరుగా ఫోన్ చేయవచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదన్నారు. ప్రజల్లో టెన్షన్ సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దారణం అన్నారు. గవర్నరే నేరుగా అధికారులతో మాట్లాడితే మేం ఎందుకన్నారు. మంత్రులు, సీఎం ఎందుకన్నారు.

  కత్తికి విషం పూశారా? హత్యయత్నమే.. జగన్‌కు ఆ క్షణంలో తప్పిన ముప్పు: నిందితుడు ఏం చెప్పాడంటే?

  జగన్ పైన దాడి జరగ్గానే గవర్నర్ ఫోన్

  జగన్ పైన దాడి జరగ్గానే గవర్నర్ ఫోన్

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో కేంద్రం పడిందని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రానికి నేను లొంగకపోతే కేసీఆర్ కంటే పరిపక్వత లేనట్లా అని ప్రశ్నించారు. తనకు మెచ్యూరిటీ లేదంటారా అన్నారు. జగన్‌ను అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్లు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. దాడి జరిగిన గంటలోనే డీజీపీకి గవర్నర్ ఫోన్ చేశారని చెప్పారు. వైసీపీకార్యకర్తలు రోడ్ల పైకి వచ్చారని తెలిపారు. పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు తగులబెట్టారన్నారు. నేరాలు చేసే వాళ్లు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమన్నారు.

  ఆపరేషన్ గరుడను సీరియస్‌గా తీసుకోలేదు

  ఆపరేషన్ గరుడను సీరియస్‌గా తీసుకోలేదు

  ఆపరేషన్ గరుడను తాను సీరియస్‌గా తీసుకోలేదని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత నటుడు శివాజీ ప్రెస్ మీట్లో చెప్పారని అన్నారు. అన్నీ వరుసగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతిపక్ష నేతపై ప్రాణాపాయం లేని దాడులు జరుగుతాయని, తద్వారా రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తారని ముందే చెప్పారని, ఇది ఆపరేషన్ గరుడలో భాగమన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకే దొంగదాడి చేయించుకున్నారని ఆరోపించారు.

   ఇలాంటి సంక్షోభాలు చాలా చూశాను, అల్లర్లతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని

  ఇలాంటి సంక్షోభాలు చాలా చూశాను, అల్లర్లతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని

  తాను ఇలాంటి సంక్షోభాలను చాలా చూశానని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నానని చెప్పారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే దేశంలో ఈడీ, సీబీఐ, ఈడీలను నిర్వీర్యం చేశారని, కేవలం కోర్టుల ద్వారా ఇప్పుడు న్యాయం జరుగుతోందని చెప్పారు.

  ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను తెప్పిస్తున్నారు

  ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను తెప్పిస్తున్నారు

  బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి రౌడీలను రప్పిస్తున్నారని, ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్య తేవడానికి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. కేంద్రం బెదిరింపు ప్రయత్నాలు చేస్తోందని, సీఎంను అయిన నేను భయపడితే అధికారులు భయపడే పరిస్థితి వస్తుందని, కానీ భయపడేది లేదని చెప్పారు. కేసులతో కట్టడి చేయాలని చూస్తున్నారని అన్నారు. అంతిమంగా ధర్మమే గెలుస్తుందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఇన్నేళ్లు రాజకీయం చేశానని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

   భవిష్యత్తులో దేవాలయాల వద్ద కుట్ర

  భవిష్యత్తులో దేవాలయాల వద్ద కుట్ర

  భవిష్యత్తులో దేవాలయాల వద్ద కుట్రలు చేస్తారని చంద్రబాబు అన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి గూండాలను రప్పిస్తారని అన్నారు. కేంద్రంతో మనం విబేధించగానే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులుగా కనిపించారా అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాల్లో అధికారులు గందరగోళపడతారన్నారు. మనకెందుకు వచ్చిందని అధికారులు సైలెంట్ అవుతారని, కానీ ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు.

   కేసీఆర్, కేటీఆర్, కవితలూ స్పందిస్తారా?

  కేసీఆర్, కేటీఆర్, కవితలూ స్పందిస్తారా?

  జగన్‌కు చిన్న గాయమైందని తెలియగానే కేసీఆర్, గవర్నర్, పవన్, కేంద్రమంత్రి అందరూ స్పందించారని చంద్రబాబు అన్నారు. గవర్నర్ నేరుగా అధికారులతో మాట్లాడితే మేం ఎందుకన్నారు. గవర్నర్ కేంద్రానికి సీక్రెట్ ఏజెంటుగా ఉండటం తప్ప ఉపయోగం లేదన్నారు. ఇది కరెక్టా.. ప్రజాస్వామ్యం లేదా అన్నారు. దాడి ఘటనను కేటీఆర్, కవిత, కేసీఆర్ ఖండిస్తారు కానీ టిట్లీ తుఫాను పట్ల సానుభూతి చూపరా అన్నారు. విపక్షాలు రాజకీయం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు. విభజన చట్టం అమలు చేయమంటే కేంద్రం కక్ష సాధించినట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంతో విబేధించగానే రాష్ట్రంలో ఐటీ దాడులు మొదలయ్యాయని చెప్పారు. ఆపరేషన్ గరుడను తాను సీరియస్‌గా తీసుకోలేదని, అల్లర్లు సృష్టించేందుకు దొంగదాడి అని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం అణిచివేసే ధోరణి అవలంభిస్తోందన్నారు. కేంద్రం సాయం చేయదు, చేయనివ్వదన్నారు.

  English summary
  TDP Chief and Andhra Pradesh chief minister Chandrababu Naidu is gearing up to play a key role in Telangana politics again and defeat the current chief minister K Chandrashekar Rao. Sources say his intent of defeating KCR (as Rao is popularly known) is so strong that he's willing to even let the grand alliance of Congress, TDP, CPI and TJS come into power.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more