వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ ట్వీట్ పై చంద్రబాబు ఆరా.. జాగ్రత్తగా మాట్లాడాలని పార్టీ నేతలకు హితవు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ పై ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు శుక్రవారం ఆరా తీశారు. అధిష్ఠానం అనుమ‌తి లేనిదే ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ంటూ పార్టీ నాయకులను ఆదేశించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ మంత్రి పితాని సత్యనారాయణలపై వ్యంగ్యంగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదనేశారు. ఇటీవల మంత్రి పితాని కూడా జనసేన అధినేత గురించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

pawan-chandrababu

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీరిద్దరిపై వ్యాఖ్యానించారు. 'అశోక్ గజపతి రాజుకి నేనెవరో తెలియదు.. మంత్రి పితాని సత్యనారాయణకు పవన్ కళ్యాణ్ ఏంటో తెలియదు.. సంతోషం..' అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్న జనసేనాని ఇలా ట్వీట్ చేయగానే.. ఆయన అభిమానులు, జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు ఆయనకు అండగా రీట్వీట్ చేయసాగారు. కాసేపట్లోని ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

'వాళ్లే మీ దగ్గరికి వచ్చి తమను తాము పరిచయం చేసుకునే రోజు త్వరలో వస్తుంది అన్నా..' అంటూ కొంతమంది స్పందిస్తే... 'నువ్వేంటో చూపించే టైమ్ వచ్చింది అన్నా..' అంటూ మరికొందరు రీట్వీట్ చేశారు.

మరికొందరు.. 'తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ హీరో, గత ఎన్నికల్లో ఆ పార్టీకి అధికారం అందించిన వ్యక్తిని... మోడీ, చంద్రబాబులు ఉన్న వేదికలపై ఎవరి ప్రసంగానికి తమ కరతాళధ్వనులతో జనం హర్షం వ్యక్తం చేశారో.. అలాంటి వ్యక్తి ఎవరో తెలియదని అంటే.. ఇక సాధారణ ప్రజలను, నియోజకవర్గం ఓటర్లను కూడా వారు గుర్తుపట్టే స్థితిలో లేనట్లే..' అంటూ కామెంట్స్ చేశారు.

ఈ ట్వీట్ల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆరా తీశారు. త‌మ పార్టీ నేత‌లు ప‌వ‌న్‌ కళ్యాణ్ పై చేస్తోన్న వ్యాఖ్య‌ల గురించి కూడా తెలుసుకున్నారు.

సున్నితమైన అంశాలు, విధానపరమైన నిర్ణయాలపై పార్టీ అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడొద్దని, ఇలాంటి అంశాలను పార్టీ అగ్రనాయకత్వం చూసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అధిష్ఠానం అనుమ‌తి లేనిదే ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ంటూ నాయకులను ఆదేశించారు.

English summary
AP CM Nara Chandrababu Naidu on Friday enquired about Jena Sena Chief Pawan Kalyan's Tweet about Union Minister Ashok Gajapathi Raju and AP State Minister Pitani Satyanarayana. He came to know about the tweets of these two leaders about Pawan Kalyan. Then Chandrababu strictly passed orders to his party leaders, not to speak like this without his permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X