వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండోసారి, ఓడినా అద్భుత ప్రతిభ: పీవీ సింధుపై చంద్రబాబు ప్రశంసలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2018లో పీవీ సింధు ఫైనల్లో ఓడిపోయినప్పటికీ అద్భుత ప్రతిభ కనబర్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచి భారత షట్లర్ల సత్తాను చాటిందన్నారు.

ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓడినా మంచి ప్రతిభ కనబర్చారని కితాబిచ్చారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు గెలిచి బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సువర్ణ అధ్యాయం సృష్టించిన వ్యక్తి పీవీ సింధు అన్నారు. వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుందని తెలిపారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ఫైనల్లో మారిన్ చేతిలో ఓడిన సింధు

AP CM Chandrababu Naidu hails PV Sindhu for winning silver at World Badminton Championship

కాగా, ఆదివారం జరిగిన ఫైనల్లో కరోలినా మారిన్‌ చేతిలో 21-19, 21-10 తేడాతో సింధు ఓడింది. దీంతో ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రెండోసారి కూడా రజతంతో సరిపెట్టుకుంది. తొలి సెట్‌లో మారిన్‌కు సింధు గట్టిపోటీ ఇచ్చింది. ఆరు పాయింట్ల వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆ తర్వాత మారిన్ ముందడుగు వేసింది.

ఆ తర్వాత కూడా పీవీ సింధు పోరాట పటిమ ప్రారంభించి చాలా వెనుకబడ్డప్పటికీ ఓ సమయంలో 17-18తో పైచేయి సాధించినట్లుగా కనిపించింది. కానీ కోలుకున్న మారిన్ 21-19తో తొలి గేమ్ కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో కూడా సింధు పైచేయి సాధించేలా కనిపించింది. కానీ మారిన్ వ్యూహం ముందు పీవీ సింధు చిత్తయింది. దీంతో 21-10తో పసిడితో సరిపెట్టుకుంది.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu hails PV Sindhu for winning silver at world badminton championship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X