వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదా మా హక్కు, ఎందుకివ్వరని నేను నిలదీస్తున్నా: అసెంబ్లీలో మోడీపై చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Budget Sessions : Chandrababu Naidu Revealed Everything

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా విభజన హామీలు, ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిపై ఆయన స్పందించారు.

కట్టుబట్టలతో వచ్చాం

కట్టుబట్టలతో వచ్చాం

విభజన సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని చెప్పారు. కట్టుబట్టలతో మనం హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పారు. 2022 నాటికి దేశంలోని టాప్ 3 రాష్ట్రాల్లో ఏపీ ఉండాలని కష్టపడుతున్నామని చెప్పారు. రైతులు రాజధాని కోసం 34 వేల ఎకరాలు ఇచ్చారని, వారికి ధన్యవాదాలు అని చెప్పారు. దేశంలో రెండో అత్యధిక వృద్ధి ఏపీదే అన్నారు.

విభజన సమస్యలపై శ్వేతపత్రాలు

విభజన సమస్యలపై శ్వేతపత్రాలు

విభజన సమస్యలపై 8 శ్వేత పత్రాలు విడుదల చేశామని చెప్పారు. ఏడాదికి 12 శాతం వృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు విభజన సమస్యలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నామని చెప్పారు. మనం ఒక విజన్ తయారు చేసుకొని ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో సాగుతున్నారు.

మన కష్టంతో మనం నిలదొక్కుకునే ప్రయత్నం

మన కష్టంతో మనం నిలదొక్కుకునే ప్రయత్నం

విభజన సమస్యలపై ఎలా బయటపడాలో అని ఆలోచిస్తున్నామన్నారు. తలసరి ఆదాయంలో ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడి ఉన్నామన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే నాలుగేళ్లలో తలసరి ఆదాయం తక్కువగా ఉందని చెప్పారు. కష్టాలు ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ముందుకు సాగుతున్నామని చెప్పారు. మన కష్టంతో మనం నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కేంద్రం విఫలమైంది

కేంద్రం విఫలమైంది

ఏపీకి బీజేపీ న్యాయం చేస్తుందని ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. మనకు గ్రోత్ రేటు ఎక్కువగా ఉందని రాయితీలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. విభజనలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. 58 శాతం జనాభా ఉండే ఏపీకి 47 శాతం ఆదాయం వచ్చిందని చెప్పారు. ఆస్తుల పంపకం మాత్రం తెలంగాణకు ఎక్కువగా వెళ్లిందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను చదివి వినిపించారు. హేతుబద్దత లేని విభజన జరిగిందని తాను మొదటి నుంచి చెబుతున్నానన్నారు. నాటి ప్రధాని రాజ్యసభల ఎన్నో హామీలు ఇచ్చారన్నారు.

వారికిచ్చింది మాకెందుకివ్వరని నేను నిలదీస్తున్నా

వారికిచ్చింది మాకెందుకివ్వరని నేను నిలదీస్తున్నా

ఏపీకి ప్రత్యేక హోదాపై నాటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పదేళ్లు హోదా ఇస్తామని ప్రకటించారన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన హోదాను ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని తాను ఈ సభ ద్వారా మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నానని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కున శాతం ఖర్చు కేంద్రం భరిస్తుందని మాకు ఎందుకివ్వరన్నారు. తాము ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిశామన్నారు. రూ.30వేల కోట్ల రూపాయల అప్పుకు రూ.10వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నను చంద్రబాబు చదివి వినిపించారు. విభజన సమస్యలు చాలా వరకు పరిష్కారం కాలేదన్నారు. ఏపీకి రాజధాని లేదు, విద్యాసంస్థలు లేవన్నారు.

నాడు తప్పనిసరి పరిస్థితుల్లో హామీ ఇచ్చారు, జన్మజన్మల హక్కు

నాడు తప్పనిసరి పరిస్థితుల్లో హామీ ఇచ్చారు, జన్మజన్మల హక్కు

విభజన నష్టాలను భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ఏపీ జన్మజన్మల హక్కు అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర విభజన చేశారన్నారు. నాడు విభజన చట్టం అమలు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో నాటి ప్రధాని ఏపీకి హామీలు ఇచ్చారని చెప్పారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. తాము ఏది కూడా అదనంగా అడగలేదన్నారు. హోదా మా హక్కు అన్నారు. బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందన్నారు. కాంగ్రెస్ అయిదేళ్లని చెబితే బీజేపీ రెండింతలు పెంచిందన్నారు.

ఎదురుదాడితో తప్పించుకోలేరు

ఎదురుదాడితో తప్పించుకోలేరు


మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాబట్టి తప్పించుకోలేరని చంద్రబాబు అన్నారు. తమకు ఎవరి పైనా వ్యతిరేకత లేదన్నారు. మోడీ చేసే పనులకు తాను దేశం కోసం సహకరించానని చెప్పారు. అదే సమయంలో ఏపీకి రావాల్సిన అంశాలపై అడిగానని చెప్పారు. తాను 29సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం కొందరు ఆత్మహత్యాయత్నం చేస్తే తాను కేంద్రంతో మాట్లాడానని చెప్పారు. బీజేపీ నేతలు ఎదురు దాడి చేసి తప్పించుకోలేరన్నారు.

English summary
AP Chief Minister Chandrababu Naidu Assembly announcement in Andhra Pradesh Assembly on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X