వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల దీక్ష చేపడుతున్నాం: చంద్రబాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

ప్రకాశం: రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెంచేందుకు జలదీక్ష చేపట్టామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలు ఎంతో భక్తితో భవాని, అయ్యప్పదీక్షలు చేపడుతున్నారని, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో పెంచేందుకు తాను జలదీక్ష చేపట్టానన్నారు.

అందులోభాగంగానే అనంతపురం జిల్లాలో నీరు-చెట్టుకు శ్రీకారం చుట్టామన్నారు. అనంతపురంలో 24మీటర్ల లోతులోఉన్న నీటిమట్టాన్ని ఎనిమిది మీటర్లకు తేగలిగామన్నారు. మే 1నుంచి నీటి వనరులపై చర్చ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. నిరుడు 46 శాతం వర్షపాతం తక్కువగా నమోదుకావటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు.

చివరకు నీటిపారుదల శాఖను అవినీతిశాఖగా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేసినా కనీసం ఒక్క ఎకరాకు నీరివ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమిళనాడులో చెన్నై, కర్నాటకలో బెంగళూరు, తెలంగాణలో హైదరాబాదులాంటి నగరాలను నవ్యాంధ్రలో మూడు నుంచి నాలుగు వరకూ నిర్మిస్తామని ప్రకటించారు. కేంద్రం కూడా ఇతోధికంగా సాయం అందించాలని కోరారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెంచేందుకు జలదీక్ష చేపట్టామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

శనివారం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలు ఎంతో భక్తితో భవాని, అయ్యప్పదీక్షలు చేపడుతున్నారని, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో పెంచేందుకు తాను జలదీక్ష చేపట్టానన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అందులోభాగంగానే అనంతపురం జిల్లాలో నీరు-చెట్టుకు శ్రీకారం చుట్టామన్నారు. అనంతపురంలో 24మీటర్ల లోతులోఉన్న నీటిమట్టాన్ని ఎనిమిది మీటర్లకు తేగలిగామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

మే 1నుంచి నీటి వనరులపై చర్చ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. నిరుడు 46 శాతం వర్షపాతం తక్కువగా నమోదుకావటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదన్నారు. విభజన అనంతరం రాష్ట్రంలో పరిశ్రమలు, కాలేజీలు, రాజధాని కూడా లేదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీలను విభజన అనంతరం పూర్తిస్థాయిలో అమలుచేయటమే కాకుండా మరెన్నో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో అన్ని వ్యవస్థలు పూర్తిస్థాయిలో నిర్వీర్యమయ్యాయన్నారు.

మరో నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రంగా తయారు చేయటమే తనముందున్న లక్ష్యమన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారురాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం కనీసం రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని విషయంలో సహకరించాల్సిన ప్రతిపక్ష పార్టీలు రైతులను ఊసిగొల్పి భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. విజ్ఞత కలిగిన రైతులు ల్యాండ్ పూలింగ్‌కు సహకరించి భూములిచ్చారన్నారు.

రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభిస్తే, దీన్ని కూడా ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, కాల్వలు ఏర్పాటు చేయాలన్న భూసమీకరణ తప్పనిసరి అవుతుందన్నారు. భూములివ్వకుంటే అభివృద్ధి ఏవిధంగా సాధ్యమౌతుందని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. ఇప్పటికే రెండుదఫాలుగా రుణమాఫీ పూర్తి చేశామన్నారు. త్వరలో డ్వాక్రా సంఘాలకూ దశల వారీగా రుణమాఫీ చేస్తామని డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చారు.

నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని కృష్ణ, పెన్నా నదులకు మళ్ళించి నీరు వృథాకాకుండా అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 40వేల చెరువులను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి సాగర్ జలాలతోపాటు, వర్షపు నీటిని ఒడిసిపట్టి చెరువులు నింపి భూగర్భ జలమట్టాలను పెంచుతామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ముందుచూపు చర్యలు చేపట్టకపోవటం వల్ల రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటాయన్నారు.

అంతకుముందు పోలవరం గ్రామంలోని చెరువులో పూడికతీత పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఉపాధి హామీ పథకంలో వంద రోజులపాటు పనులు కల్పించారని, ఇకనుండి 150 రోజులపాటు పనులు కల్పిస్తామని కూలీలకు భరోసా ఇచ్చారు. పేదరికంలేని సమాజాన్ని ఆవిష్కరించటమే తన ధ్యేయమన్నారు.

English summary
AP CM Chandrababu Naidu is on a tour to Prakasam district and could inspect Kandula Obul Reddy Gundlakamma reservoir. He speaking in a meeting said that with lot of industries, jobs will be created there by increasing the land value near new Capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X