వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కర్ణాటకపై చంద్రబాబు మాట్లాడుతున్నారా? ఎన్టీఆర్.. ఓటుకు నోటు.. వైసీపీ ఎమ్మెల్యేలను ఇంకా మరిచిపోలేదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: కర్ణాటక రాజకీయాలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ, కర్ణాటక గవర్నర్‌కు హితబోధ చేస్తున్నట్లుగా ఆ ట్వీట్ ఉంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. అంతేకాదు, శనివారం యడ్యూరప్ప రాజీనామా పైనా ట్వీట్ చేశారు. యెడ్డీ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని, ఆయన రాజీనామాతో అందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ ట్వీట్లపై నెటిజన్లు ఇలా స్పందించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా.. మీ పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడే ప్రజాస్వామ్యాన్ని చంపేశారని, సర్.. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకండని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. సార్, మీరు కర్ణాటక రాజకీయాలపై మాట్లాడి ఎన్టీఆర్‌ను గుర్తుకు వచ్చేలా చేస్తున్నారు. టీడీపీని ఆదీనంలోకి తీసుకునేందుకు మీరు ఏం చేశారని మరొకరు పేర్కొన్నారు.

AP CM Chandrababu Naidu trolled for tweets on Karnataka

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న చివరి వ్యక్తి మీరేనని ఒకరు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యక్తి మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలని మరొకరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'బ్రీఫ్డ్ మి' అంటూ ఓటుకు నోటు కేసును గుర్తు చేశారు. ఎమ్మెల్యేలను హోటల్లో బందించి, మామకు వెన్నుపోటు పొడిచారని, అదేనా ప్రజాస్వామ్య హక్కు అని ఇంకొకరు ట్వీట్ చేశారు. నాలుగేళ్ల పాటు మోడీతో కలిసి ఉండి, బాగా ఇచ్చారని చెప్పి, ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారని మరొకరు పేర్కొన్నారు.

ప్రధానంగా నెటిజన్లు 1995 ఎన్టీఆర్ ఇష్యూను, 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం, ఆ తర్వాత ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. వైస్రాయ్ విషయాన్ని మరిచిపోయేంత తక్కువ మెమోరీ మాకు లేదని ఎద్దేవా చేశారు.

English summary
Chief Minister N. Chandrababu Naidu might have not expected the backlash from Twitter users to his tweets welcoming the Supreme Court order on Friday on the Karnataka floor test and BJP leader B.S. Yedyurappa’s resignation on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X