శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళంలో జెండా ఆవిష్కరించిన చంద్రబాబు: ఆనందాంధ్రప్రదేశ్ అంటూ ప్రసంగం

|
Google Oneindia TeluguNews

Recommended Video

    శ్రీకాకుళంలో జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు

    శ్రీకాకుళం: జిల్లాలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

    అనంతరం సైనికుల గౌరవందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడకల్లో మంత్రులు, అధికారులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

    AP CM Chandrababu Naidu Unfurls The Tricolour at Srikakulam

    Newest First Oldest First
    11:23 AM, 15 Aug

    డ్వాక్రా సంఘాలకు రూ.10వేల కోట్ల ఆర్థిక సాయం అందించామని చంద్రబాబు చెప్పారు.
    11:01 AM, 15 Aug

    రాష్ట్రంలో అందరూ ఆనందంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆనంద ఆంధ్రప్రదేశ్‌ దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు.
    11:01 AM, 15 Aug

    వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టి వరి దిగుబడులు పెంచామని, రైతులకు రూ.24,500 కోట్ల రుణవిముక్తి చేశామని చంద్రబాబు తెలిపారు.
    11:00 AM, 15 Aug

    సంకల్ప బలం ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలమని సీఎం చంద్రబాబు తెలిపారు.
    11:00 AM, 15 Aug

    నాలుగేళ్లలో రెండంకెల అభివృద్ధి సాధించామని చంద్రబాబు చెప్పారు.
    11:00 AM, 15 Aug

    ఆర్ధిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, విభజనతో నష్టపోయినా అభివృద్ధి ఆగకుండా చూశామని సీఎం చెప్పారు.
    11:00 AM, 15 Aug

    ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యం దిశగా సాగుతున్నామని సీఎం చెప్పారు.
    10:59 AM, 15 Aug

    2029 నాటికి దేశంలోనే అగ్ర రాష్ట్రంగా ఏపీ నిలబడాలని చంద్రబాబు అన్నారు.
    10:56 AM, 15 Aug

    రూ.26కోట్ల జిల్లాకో కాపు భవనం నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు.
    10:51 AM, 15 Aug

    కాపుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000కోట్లు కేటాయించామని చంద్రబాబు తెలిపారు.
    10:51 AM, 15 Aug

    వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు.
    10:50 AM, 15 Aug

    రాష్ట్రంలో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సీఎం చెప్పారు.
    10:50 AM, 15 Aug

    రాష్ట్ర విభజనతో నష్టపోయామని, అయినా కేంద్రం సహకరించడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
    10:48 AM, 15 Aug

    పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని, ఇప్పటికే 4లక్షల మందికి ఇళ్లు అందించామని సీఎం చెప్పారు.
    10:48 AM, 15 Aug

    తమది పేద వారి ప్రభుత్వమని, వారి అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.
    10:47 AM, 15 Aug

    ఉత్తరాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
    10:47 AM, 15 Aug

    రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి సాధించాలనేది తమ లక్ష్యమని అన్నారు.
    10:46 AM, 15 Aug

    2020నాటికి దేశంలోని అత్యుత్తమ 3 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
    10:45 AM, 15 Aug

    ఐదో ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీకాకుళంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని సీఎం అన్నారు.
    10:44 AM, 15 Aug

    శ్రీకాకుళం జిల్లా ఎంతోమంది వీరులకు జన్మనిచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.

    English summary
    Andhra Pradesh CM Nara Chandrababu Naidu on Wednesday unfurled tricolor in Srikakulam district during Independence day.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X