విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీదే బాధ్యత! వాళ్లైతే రాజీనామా చేసేవాళ్లు, ఇది కూడా చూసుకోలేరా: అఖిలపై బాబు సంచలనం

ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మంత్రి అఖిలప్రియకు గట్టి ఝలక్ ఇచ్చారు. తోటి మంత్రులు, అధికారుల ముందు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Akhila Priya Resignation on Boat mishap : బాబు రాజీనామా చెయ్యమన్నారా ?

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మంత్రి అఖిలప్రియకు గట్టి ఝలక్ ఇచ్చారు. తోటి మంత్రులు, అధికారుల ముందు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినేత ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అఖిల కంగు తిన్నారు.

చదవండి: పడవ ప్రమాదంపై వారెలా బాధ్యులు: అఖిల వైపు వేళ్లు! ఆ కీలక వ్యక్తిని కాపాడుతున్నారా?

చదవండి: బాబు 'రిజైన్' వ్యాఖ్యలతో అఖిల కలత! ఊహించని నిర్ణయం తీసుకుంటారా?

పది రోజుల క్రితం కృష్ణా నదిలో బోటు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 22 మంది మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా, చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

చదవండి: మీ వల్లే, బాధ్యత వహించాలి: బోటు ప్రమాదంపై చంద్రబాబు సీరియస్

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మంత్రులు, అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అందరి ఎదుట పడవ ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియకు, ఆ శాఖ అధికారులకు ఓ రకంగా హెచ్చరికలు జారీ చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలు ఇలా

చంద్రబాబు వ్యాఖ్యలు ఇలా

ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగా 22 మంది అమాయకుల ప్రాణాలు పోయాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అన్ని శాఖలు సరిగా పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అఖిలప్రియను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు

అఖిలప్రియను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు

ఆ సమయంలో మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి కూడా చంద్రబాబు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో శాఖాపరమైన బాధ్యతలకు మంత్రులు రాజీనామా చేసేవారని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బోటు ప్రమాదం జరిగితే ఆ శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా అని అఖిలను ఉద్దేశించి మాట్లాడారు.

సాధారణ శాఖను కూడా చూసుకోలేకపోతున్నారు

సాధారణ శాఖను కూడా చూసుకోలేకపోతున్నారు

అఖిలప్రియ పని తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణమైన పర్యాటక శాఖను కూడా చూసుకోలేకపోతున్నారని విమర్శించారు. ఫెర్రీ బోటు ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో ఉన్నారన్నారు. బాబు ఆగ్రహంతో అఖిలప్రియ పని తీరు మాత్రం బాగాలేదని అర్థమవుతోందని అంటున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలతో కంగుతిన్న అఖిలప్రియ

చంద్రబాబు వ్యాఖ్యలతో కంగుతిన్న అఖిలప్రియ

చంద్రబాబు సహచర మంత్రులు, అధికారుల ఎదుటే పై వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి అఖిలప్రియ కంగుతిన్నారు. అధినేత హఠాత్తుగా అలా అనడంతో ఆమెకు ఏమీ పాలుపోలేదని తెలుస్తోంది. దీంతో ఆమె మౌనంగా ఉండిపోయారని సమాచారం.

చంద్రబాబు వ్యాఖ్యల వెనుక రాజీనామా ఉద్దేశ్యం కాదు!

చంద్రబాబు వ్యాఖ్యల వెనుక రాజీనామా ఉద్దేశ్యం కాదు!

ఓ విధంగా అఖిలప్రియకు చంద్రబాబు ఊహించని షాకిచ్చారు. అంతేకాదు గతంలో ఇలాంటివి జరిగినప్పుడు మంత్రులు రాజీనామా చేసేవారని చెప్పారు. దీంతో పరోక్షంగా అఖిలప్రియను రాజీనామా చేయామని చెప్పారా అనే వాదనలు వినిపించాయి. అయితే రాజీనామా చేయమని కాదని, శాఖల పైన మరింత సీరియస్‌గా దృష్టి పెట్టాలని చంద్రబాబు ఉద్దేశ్యమని అంటున్నారు. అంతే తప్ప రాజీనామా చేయాలని చెప్పడం కాదన్నారు.

ఇదీ చంద్రబాబు ఉద్దేశ్యం, ఏమైనా జరగొచ్చా?

ఇదీ చంద్రబాబు ఉద్దేశ్యం, ఏమైనా జరగొచ్చా?

ఇలాంటివి జరిగినప్పుడు గతంలో ఎలా ఉంటారో చెప్పడమే ఆయన ఉద్దేశ్యమని, తద్వారా మరింత బాధ్యతగా ఉండాలని అఖిలకు హెచ్చరించారని అంటున్నారు. అయితే చంద్రబాబు ఆగ్రహం నేపథ్యంలో ఏమైనా జరగొచ్చా అనే చర్చ సాగుతోంది. కాగా, బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందడంతో విపక్షాలు ప్రభుత్వంపై మండిపడిన విషయం తెలిసిందే.

చంద్రబాబు ఆగ్రహం

చంద్రబాబు ఆగ్రహం

కాగా, చంద్రబాబు అంతకుముందు నంది అవార్డులపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. నంది అవార్డుల అంశం ఇలా వివాదం అవుతుందనుకోలేదని, ఇలా జరుగుతుందనుకుంటే ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయించి అవార్డులు ఇచ్చేవాళ్లమన్నారు. కులం రంగు పులమడం సరికాన్నారు. అలాగే పోలవరం గురించి మాట్లాడుతూ ట్రాన్స్‌ట్రాయ్‌కు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలన్నదే తమ తాపత్రయం అన్నారు. జగన్ గురించి ఎక్కువగా మాట్లాడవద్దని కూడా చంద్రబాబు నేతలకు సూచించారు.

English summary
AP Chief Minister Nara Chandrababu Naidu has warned Tourism Minister Akhila Priya over boat tragedy on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X