వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజేంద్రప్రసాద్‌కు షాక్: పార్టీ అనుమతి లేకుండా బిజెపిపై విమర్శలొద్దు: బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబూ నువ్వు కాంగ్రెస్‌తో కలిశావ్ : పవన్ కళ్యాణ్ వల్లే !

అమరావతి:గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఏపీలో టిడిపి, బిజెపి మధ్య మాటల యుద్దానికి తెరతీసింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. అయితే సోము వీర్రాజుపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, బిజెపి నేతల మధ్య కొంతకాలంగా సంబంధాలు చెడుతున్నట్టు కన్పిస్తోంది. కానీ, పైకి మాత్రం రెండు పార్టీల నేతలు మాత్రం తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెబుతున్నారు.

గుజరాత్ రాష్ట్ర ఎన్నికల పలితాలు బిజెపి నేతల్లో జోష్ నింపాయి.అయితే ఈ ఫలితాలను చూసి బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు టిడిపి నేతలకు ఆగ్రహన్ని కల్గించాయి.

టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం

టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం

గుజరాత్ రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు టిడిపి నేతలకు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో అధికార పార్టీని డిసైడ్ చేసేది తామేనని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.అంతేకాదు పరోక్షంగా టిడిపిపై వ్యాఖ్యలు చేశారని అధికార పార్టీ నేతలు భావించారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. సోము వీర్రాజుపై బాబుకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. వీర్రాజు వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మంటను పుట్టించాయి.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై బాబు ఆగ్రహం

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై బాబు ఆగ్రహం

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారని సమాచారం. పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేయడాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం. బీజేపీ నాయకుడు సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీపై వ్యాఖ్యలు చేశారు.

వీర్రాజు విచక్షణకు వదిలేయాలి

వీర్రాజు విచక్షణకు వదిలేయాలి

టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడినట్టు సమాచారం..సోము వీర్రాజు వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలివేయాలని, పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై ఎవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. కాగా... భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రాజేంద్రప్రసాద్‌కు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.

టిడిపి, బిజెపి నేతల మధ్య గ్యాప్

టిడిపి, బిజెపి నేతల మధ్య గ్యాప్

పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే పైకి మాత్రం రెండు పార్టీల నేతలు మాత్రం తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కొందరు బిజెపి నేతలు బహిరంగంగానే ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఈ పరిణామాలు టిడిపిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి.అయితే అదే సమయంలో రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం కోసం టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై రెండు పార్టీల నేతలు సమన్వయంతో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ సమావేశం జరిగిన వారం రోజులకే సోము వీర్రాజు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

English summary
Ap chief minister Chandrababu naidu warned to TDP MLC Rajendraprasad on Monday. Tdp MLC Rajedndraprasad responded on Bjp MLC veerraju comments. without party permission why Rajendraprasad comment on veerraju asked babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X