వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ గుడికెళ్ళారని, మీడియా ప్రచారం చేసిందని చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోడీ.. 45రోజులకు పైగా ప్రచార వేడితో సతమతమై ఎన్నికల ప్రచారం ముగియటంతో సేదతీరడానికి హిమాలయాలకు వెళ్లాడు. అక్కడ కేదారినాథ్ - బద్రినాథ్ ఆలయాలను సందర్శించి ఓ గుహలో ధ్యానం చేసుకుంటూ సేదతీరాడు . కానీ కోడ్ ముగియకముందే మోడీ దేవుళ్ల వద్దకు వెళ్లడం.. మీడియా దాన్ని హైలెట్ చేయడంతో చంద్రబాబు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు.
మోడీ ఏం చేసినా అందులో తప్పులు వెతికే బాబు.. తాజాగా మోడీ గుడికి వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు.. మోడీ ఆధ్యాత్మిక పర్యటనలను సైతం తప్పుపట్టారు.

మోడీ ఆధ్యాత్మికయత్రాలు ప్రచారం కోసమే అన్న చంద్రబాబు

మోడీ ఆధ్యాత్మికయత్రాలు ప్రచారం కోసమే అన్న చంద్రబాబు

ఇంతకీ చంద్రబాబు ఫిర్యాదు ఏమిటంటే ప్రచారం ముగిసిన తర్వాత మోడీ హిందూ దేవాలయాలను సందర్శించారు .కేదారినాథ్ - బద్రినాథ్ ఆలయాలను సందర్శించిన మోడీ మీడియాతో మాట్లాడారు. మోడీ దేవుళ్ల దర్శనాన్ని మీడియా హైలెట్ చేసింది అలాగే మోడీ ఒక గుహలో సేద దీరటంపై కూడా మీడియా ఎక్కువ ప్రచారం సాగించింది. దానికి పలువురు ఓటర్లు ప్రభావితం అవుతారని చంద్రబాబు ఆరోపిస్తూ దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా మోడీ దేవాలయాలకు వెళ్ళారన్నది చంద్రబాబు ప్రధాన ఆరోపణ.

మోడీ, అమిత్ షా కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు

మోడీ, అమిత్ షా కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీపై ఈసీకి లేఖ రాశారు. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. 7వ విడత ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో బెట్టింగ్ ను ప్రోత్సహించేలా మోడీ వ్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రచారం కోసమే.. కేదార్ నాథ్, బద్రీనాథ్ యాత్రలు చేస్తున్నారని అన్నారు. మోడీ, షా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా అభిప్రాయాన్ని ఈసీ పరిగణలోకి తీసుకోకపోవడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోడ్ ఉల్లంఘించిన మోడీ, షా లపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈసీని డిమాండ్ చేశారు.

చంద్రబాబు ఫిర్యాదుపై ఈసీ స్పందిస్తుందా?

చంద్రబాబు ఫిర్యాదుపై ఈసీ స్పందిస్తుందా?

అయినా చంద్రబాబుది వృథా ప్రయాసే అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎన్నికల ప్రచారం వేళ చాలా సందర్భాల్లో పాకిస్తాన్ పై దాడి.. సైనికుల త్యాగాలు - రాజీవ్ గాంధీ - ఇందిరాగాంధీ పై ఇలా ఎన్నో కోడ్ ఉల్లంఘించే మాటలు మాట్లాడిన మోడీపై ఈసీ ఒక్క చర్య తీసుకున్న దాఖలాలు లేవు అని ఒక పక్క ప్రత్యర్ధి పార్టీలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి . మోడీపై ఈసీ అవాజ్య ప్రేమ కురిపిస్తోందని అందరూ దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు బాబు ఫిర్యాదు చేయగానే ఈసీ చర్య తీసుకుంటుందా అంటే కష్టమే కానీ బాబు మాత్రం తన ప్రయత్నం తాను చేస్తున్నారు. చూడాలి ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో మరి.

English summary
Andhra Pradesh Chief Minister, Telugu Desam Party national president N. Chandrababu Naidu wrote a letter to the Election Commission of India complaining that Prime Minister Narendra Modi violated the model code of conduct by visiting Kedarnath and Badrinath temples after the completion of the election campaign. He added that all the private activities of Modi during his Kedarnath trip is continuously telecasting in the media. He said that Modi also addressed the media and public at Kedarnath. Mr Naidu stated that the activities of Modi will directly influence the voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X