హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వార్థం వదిలేయండి: బెజవాడవాసులపై బాబు ఘాటు వ్యాఖ్యలు, నవ్వుతూనే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నవ్వుతూనే విజయవాడ వాసులకు చురకలు అంటించారు. విజయవాడ వాసులు తాత్కాలిక లాభాలు వదులు కోకుంటే నష్టమేనని, ఇక్కడి వారు ప్రపంచమంతా వ్యాపారం చేస్తున్నారని, వారు స్వార్థం వీడాలన్నారు.

హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏపీ ఉద్యోగులను తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, తాము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ విజయవాడలో అద్దెలు హైదరాబాద్‌లో కంటే ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగులు చంద్రబాబుకు చెప్పుకున్నారు.

నీది చూసుకో!: అచ్చెన్నకు బాబు క్లాస్, రామోజీరావుకు జగన్ అభినందననీది చూసుకో!: అచ్చెన్నకు బాబు క్లాస్, రామోజీరావుకు జగన్ అభినందన

దీనిపై ఆయన మంగళవారం నాడు స్పందించారు. గతంలోను చంద్రబాబు విజయవాడలో అద్దెల పైన మాట్లాడారు. తాజాగా మరోసారి నవ్వుతూనే చురకలు అంటించారు. నవ్వుతూనే విజయవాడవాసులకు షాకైన చురకలు అంటించారు.

Photos: నారా లోకేష్ జిహెచ్ఎంసి ప్రచారం

విజయవాడ వాసులు తాత్కాలిక లాభాలు వదులుకోకుంటే నష్టమేనని చెప్పారు. ఇక్కడి వాళ్లు హైదరాబాద్, ఢిల్లీ, అమెరికా వెళ్లి పెట్టుబడులు పెడుతుంటారని, వ్యాపారాలు చేస్తుంటారని, చాలా తెలివిగా ఉంటారని చంద్రబాబు అన్నారు. కానీ అదే విజయవాడకు వస్తే మాత్రం చాలా లాభంగా వ్యవహరిస్తారన్నారు.

AP CM Chandrababu responds on rents in Vijayawada

విజయవాడ చిన్న పల్లెటూరు కాదని, ఇక్కడి వారు చిన్న చిన్న స్వార్థం వదిలి పెట్టాలన్నారు. అప్పుడే అభివృద్ధిలో ముందుకు పోతామన్నారు. హైదరాబాద్ కంటే అద్దెలు ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారన్నారు.

హైదరాబాదులో బోలెడు అవకాశాలున్నాయని, కాబట్టి ప్రపంచంలోని టాప్ నగరాల్లో మనం దీనిని నిలబెట్టవచ్చునన్నారు. దానికి చిన్న చిన్న స్వార్థాలు వదులుకోవాలన్నారు. కొంత నిస్వార్థంగా వ్యవహరించకుంటే నష్టమని అభిప్రాయపడ్డారు.

'కాపు యువతకి 2 లక్షలిస్తాం': బీసీలకు నష్టం లేకుండా.. బాబుకు చిక్కులేనా?'కాపు యువతకి 2 లక్షలిస్తాం': బీసీలకు నష్టం లేకుండా.. బాబుకు చిక్కులేనా?

ఇంజినీరింగ్ కళాశాలలకు చంద్రబాబు హెచ్చరిక

జంబ్లింగ్ విధానం పైన ఇంజినీరింగ్ కళాశాలలు చంద్రబాబును కలిశాయి. దీనిపై ఆయన మండిపడ్డారు. ప్రభు్తవం మంచి ఆలోచన చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. నాణ్యత లేని ఇంజినీరింగ్ కాలేజీలను మూసివేస్తామన్నారు.

ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలు పని చేయడం లేదన్నారు. ధనార్జనే ధ్యేయంగా పని చేయడం బాధాకరమన్నారు. జంబ్లింగ్ విధానం ఉంటుందని వారికి తేల్చి చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యత చదువు పైన కూడా ఆయన స్పందించారు.

English summary
AP CM Chandrababu responds on rents in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X