వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీలతో బాబు కీలక భేటీ: ఎంపీలు కేశినేని నాని, టీజీ, అవంతి ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

అమరావతి: బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఎంపీలతో భేటీ అవుతున్నారు. బీజేపీతో కలిసి ఉండాలా లేదా అనే నిర్ణయం ఆయన తీసుకోనున్నారు. బీజేపీకి కటీఫ్ చెబితే పోలవరం ప్రాజెక్టు, నవ్యాంధ్ర రాజధాని పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

బాబును తిడుతున్నారు: పరిటాల సునీత, పురంధేశ్వరి సహా అమిత్ షా వార్నింగ్బాబును తిడుతున్నారు: పరిటాల సునీత, పురంధేశ్వరి సహా అమిత్ షా వార్నింగ్

ఎంపీలతో జరిగే భేటీలో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ భేటీకి మంత్రి యనమల రామకృష్ణుడు హాజరవుతున్నారు. భేటీ నేపథ్యంలో ఎంపీలు టీజీ వెంకటేష్, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.

బడ్జెట్ పైన తీవ్ర అసంతృప్తి ఉందని, ఏం చెయ్యాలో ఇవాళ్టి సమావేశంలో నిర్ణయిస్తారని టీజీ వెంకటేష్ చెప్పారు. దేశమంతా బడ్జెట్ బాగుండవచ్చునని, రాష్ట్రానికి మాత్రం అన్యాయం జరిగిందని కేశినేని నాని అన్నారు. రాష్ట్రం నిలదొక్కుకోవాడనికి అవకాశం ఇవ్వాల్సిన అవసరముందని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలు చేసేందుకు సిద్ధమని ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు. చంద్రబాబులాంటి సీనియర్ నేత 42సార్లుఢిల్లీకి వెళ్లి కలిస్తే పట్టించుకోలేదని వాపోయారు. గత ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు.

English summary
AP Chief Minister Nara Chandrababu Naidu review meeting with MPs today on Central budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X