వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీలా కాదు.. కెటిఆర్‌లా!: లోకేష్‌పై బాబు ప్లాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఏపీ కేబినెట్లోకి తీసుకుంటారనే ఊహాగానాలు మరోసారి వినిపిస్తున్నాయి. ఆయను ఎమ్మెల్సీగా చేసి కేబినెట్లోకి తీసుకునే విషయమై టిడిపిలో చర్చ సాగుతోందని అంటున్నారు.

దీంతో, ఇప్పటిదాకా పార్టీ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉన్న లోకేశ్ త్వరలో మంత్రిగా కనిపించనున్నారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్‌ను తన కేబినెట్లోకి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తెలుస్తోంది.

జూన్ నెలలో ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ సమయంలో లోకేష్‌ను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో పాలనానుభంతో పాటు రాజ్యాంగేతర శక్తి అన్న విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకుంటేనే బాగుంటుందని సీఎం భావిస్తున్నారు.

రాహుల్ విషయంలో పొరపాటు!

రాహుల్ విషయంలో పొరపాటు!

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ విషయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన తప్పిదాన్ని లోకేష్ విషయంలో జరగకుండా చూడాలని కొందరు పార్టీ సీనియర్లు సీఎం చంద్రబాబుకు సూచించినట్లుగా తెలుస్తోంది.

రాహుల్ విషయంలో పొరపాటు!

రాహుల్ విషయంలో పొరపాటు!

కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు రాహుల్ అధికార పీఠానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ పరమైన బాధ్యతలు చేపట్టారు. అలాకాకుండా ముందు నుంచే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే రాహుల్ రాజకీయ స్థాయి పెరిగి ఉండేదని, ఆ పొరపాటును లోకేష్ విషయంలో చేయవద్దని సూచిస్తున్నారట. అందుకే లోకేష్‌ను ఇప్పుడే ప్రభుత్వంలోకి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది.

రాజ్యాంగేతరశక్తి అనకుండా

రాజ్యాంగేతరశక్తి అనకుండా

చంద్రబాబు అధికార బాధ్యతల్లో ఎక్కువగా నిమగ్నమవుతున్నారు. లోకేష్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. ప్రభుత్వంలో ఏ పదవి లేకపోయినా లోకేష్ ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేథ్యంలో అలాంటి విమర్శలకు తావులేకుండా కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

కెసిఆర్‌‍లా..

కెసిఆర్‌‍లా..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన కొడుకు కెటిఆర్, మేనల్లుడు హరీష్ రావులకు కేబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించారు. కుటుంబ పాలన అని విమర్శలు వచ్చినా.. ప్రజల ఆమోదం లభించింది. ఇప్పుడు లోకేష్ విషయంలోను అదే జరుగుతుందని టిడిపి నేతలు చంద్రబాబుకు చెబుతున్నారని తెలుస్తోంది.

English summary
AP CM Chandrababu Naidu's son Nara Lokesh may get Cabinet berth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X