వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమర్శ.. బాబుకు చేరువైన జయేంద్ర: పుష్కరాల్లో నీటి కొరత, అనంతలోను..

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీలలో కృష్ణా పుష్కరాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పవిత్ర కృష్ణా నదిలో స్నానాలు చేస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద సందడి నెలకొంది.

అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పుష్కరాల నేపథ్యంలో నదీ తీరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని గ్రామాలు పుష్కర శోభను సంతరించుకున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ దుర్గాఘాట్ వద్ద పుష్కర స్నానం ఆచరించారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి పవిత్ర పుష్కర స్నానం ఆచరించారు. జయంద్ర సరస్వతి కూడా పుష్కర స్నానం ఆచరించారు. చంద్రబాబుచే పూజలు చేయించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. కాగా, గతంలో జయేంద్ర సరస్వతి.. టిడిపి ప్రభుత్వంపై ఘాటుగా మాట్లాడారు. ఇప్పుడు ఇరువురు పుష్కరాల్లో కలిశారు.

పవిత్ర సంకల్పం

పవిత్ర సంకల్పం

రాష్ట్రంలో అన్ని నదులు అనుసంధానం కావాలని కృష్ణా పుష్కరాల సందర్భంగా పవిత్ర సంకల్పం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు

విజయవాడ దుర్గాఘాట్‌లో పుష్కర స్నానమాచరించిన అంనతరం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద సీఎం మీడియాతో మాట్లాడారు.

కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు

కృష్ణా-గోదావరి అనుసంధానం కావాలని గోదావరి పుష్కరాల్లో మహాసంకల్పం చేశామని, పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణమ్మకు వచ్చాయన్నారు.

కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు

గోదావరి రాష్ట్రానికి జీవనాడి, కృష్మమ్మ ప్రాణనాడి అన్నారు. గోదావరికి అఖండహారతి, కృష్మమ్మకు పవిత్ర హారతి కొనసాగిస్తున్నామన్నారు.

పవిత్ర హారతి

పవిత్ర హారతి

ప్రతి వ్యక్తి నదులు, ప్రకృతితో అనసంధానం కావాలని చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రం సుభిక్షం కావాలని ని కాంక్షించారు. సాయంత్రం పతి ఒక్కరూ పవిత్ర హారతిని తిలకించాలని కోరారు.

కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు

కాగా, తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది పుష్కరాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద సందడి నెలకొంది.

 కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కరాల నేపథ్యంలో నదీ తీరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని గ్రామాలు పుష్కర శోభ సంతరించుకున్నాయి.

పుష్కరాల సంరంభం

పుష్కరాల సంరంభం

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా పుష్కరాల సంరంభం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. జన్మస్థానమైన మహాబలేశ్వరం నుంచి సాగరంలో కలిసే దివిసీమ వరకు నీదమతల్లి కొత్త కాంతులీనుతోంది.

 చంద్రబాబు పుష్కర స్నానం

చంద్రబాబు పుష్కర స్నానం

తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నదీమతల్లిలో పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరస్నానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ దుర్గాఘాట్‌లో సతీసమేతంగా పుష్కరస్నానం ఆచరించారు. పలువురు మంత్రులు ప్రముఖులు దుర్గాఘాట్‌లో పుణ్యస్నానాలు చేసి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

ఫెర్రీ ఘాట్ వద్ద అధిక భక్తులు

ఫెర్రీ ఘాట్ వద్ద అధిక భక్తులు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రిఘాట్‌ దగ్గర భక్తుల రద్దీ అధికంగా ఉంది. దీంతో తాగునీరులేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దస్తులు మార్చుకునే గదులు తక్కువగా ఉన్నాయని భక్తుల అసంతృప్తి వ్యక్తం చేశారు.

 అధికారులకు ఆదేశం

అధికారులకు ఆదేశం

కృష్ణా పుష్కరాల సందర్బంగా యాత్రికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

 చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్

చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్

శుక్రవారం కృష్ణా పుష్కరాలపై అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి అఖండ హారతి, కృష్ణమ్మకు పవిత్ర హారతి తెలుగు జాతి చరిత్ర ఉన్నంతవరకు నిలిచిపోతాయన్నారు.

 క్లీన్‌గా ఉంచాలి

క్లీన్‌గా ఉంచాలి

విద్యార్థి వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఘాట్ల వద్ద పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. పుష్కర ఘాట్లను స్వయంగా సందర్శిస్తానని చెప్పారు. ఘాట్లలో పిండప్రదానానికి దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలన్న బాబు అన్ని ఘాట్లలోకి యాత్రీకులను అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు.

 పుష్కరాల వద్ద రైలు టిక్కెట్ల అమ్మకం

పుష్కరాల వద్ద రైలు టిక్కెట్ల అమ్మకం

కృష్ణా పుష్కరాల సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ బాబు తెలిపారు. పద్మావతి ఘాట్‌లో క్రిస్ టెక్నాలజీ ద్వారా అన్ని ప్రాంతాలకు రైలు టిక్కెట్లు అమ్మకం ప్రారంభించామని, పుష్కర యాత్రికులు వినియోగించుకోవాలని సూచించారు.

బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను

ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వ‌ర్యంలో ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద భారీ సెట్టింగ్, నమూనా దేవాలయాలు రూపు దిద్దుకున్నాయి.

 బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను

ఫెర్రీ ఘాట్ వద్ద బోయపాటి శ్రీను పుష్క‌ర‌ ఘాట్‌లో పుణ్య‌ స్నాన‌ం ఆచ‌రించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర హారతిని షూట్ చేసే బాధ్యత తనకు రావడం అదృష్టమన్నారు. ప్రభుత్వం త‌న‌పై ఎంతో న‌మ్మ‌కం ఉంచి ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిందన్నారు.

బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను

భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా స‌ర్కారు చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయ‌ని బోయపాటి పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాలు జరిగే 12 రోజులూ పవిత్ర సంగమం వద్దే ఉండి హార‌తి ఏర్పాట్లు చూస్తాన‌ని ఆయ‌న చెప్పారు.

 అనంతపురంలోను పుష్కర స్నానం

అనంతపురంలోను పుష్కర స్నానం

అనంతపురం జిల్లాలోనూ కృష్ణా పుష్కరాల సందడి కనిపిస్తోంది. శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం పెరిగిన అనంతరం హంద్రీనీవా ద్వారా కృష్ణా నీటిని రాయలసీమకు వదలగా, ఆ నీరు జీడిపల్లి రిజర్వాయర్‌కు వచ్చి చేరుతోంది. దీంతో సమీప గ్రామాల్లోని ప్రజలు జీడిపల్లి జలాశయంలోనే కృష్ణమ్మకు పూజలు చేస్తూ, పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు.

English summary
AP CM Chandrababu Naidu takes holy dip in Krishna river in Vijayawada on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X