అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముస్లిం మత పెద్దలకు ఏపీ సీఎం దిశానిర్ధేశం..! రంజాన్ పర్వదినం గురించి కీలక సూచనలు చేసిన జగన్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతోంది. తగ్గినట్టే కనిపిస్తున్నా పాజిటీవ్ కేసుల సంఖ్యం గణనీయంగా పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో రంజాన్ పర్వదినం కూడా సమీపిస్తోంది. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగే కాకుండా సామూహిక ప్రార్ధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ముస్లిం సోదరులు. అలాంటి వారి కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని మార్గదర్శకాలు విడుదుల చేసారు. రంజాన్ నెల ప్రత్యేక ప్రార్థనలపై ముస్లిం మత పెద్దలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫనెన్స్ నిర్వహించారు.

ముస్లిం మత పెద్దలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్... రంజాన్ పర్వదినం పై సీఎం మార్గదర్శకాలు..

ముస్లిం మత పెద్దలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్... రంజాన్ పర్వదినం పై సీఎం మార్గదర్శకాలు..

కరోనా ప్రభావం పెరుగుతుండడంతో లాక్ డౌన్ ఆంక్షల ప్రాముఖ్యత గురించి ముస్లిం పెద్దలకు మరోసారి వివరించారు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో రంజాన్ నెల ప్రత్యేక ప్రార్థనలపై జగన్ ముస్లిం మత పెద్దలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫనెన్స్ తో భేటీ అయ్యారు. వచ్చే నెల రంజాన్ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి, స్వీయ నియంత్రణ ఎలా పాటించాలనే అంశం పై లోతుగా చర్చించారు. ఈ సందర్బంగా జరగబోవు సామూహిక ప్రార్థనల గురించి దిశానిర్ధేశం చేసారు జగన్ మోహన్ రెడ్డి.

సామూహిక ప్రార్థనలు వద్దు.. స్వీయ నియంత్రణ పాటించాలన్ని సీఎం..

సామూహిక ప్రార్థనలు వద్దు.. స్వీయ నియంత్రణ పాటించాలన్ని సీఎం..

ముస్లిం మత పెద్దలతో నిర్విహించిన వీడియోకాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ముస్టిం సోదరులు పరమ పవిత్రంగా ఆ పర్వదినాన్ని నిర్వహించుకుంటారని, కానీ ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ఈసారి రంజాన్ ప్రార్థనలను ఎవరి ఇళ్ళలో వారు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్న సందర్బంలో జాగ్రత్తగా ఉండాలని జగన్ సూచించారు. అంతే కాకుండా కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు.

రంజాన్ పర్వదినాన్ని ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలి.. ముస్లిం పెద్దలకు జగన్ విజ్ఞప్తి..

రంజాన్ పర్వదినాన్ని ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలి.. ముస్లిం పెద్దలకు జగన్ విజ్ఞప్తి..

ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పండుగలన్నీ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, ఇప్పుడు రంజాన్‌ పర్వదినాన్ని కూడా అలాగే నిర్వహించుకోవాలని జగన్ వివరించారు. ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రంజాన్‌ మాసంలో ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలందరినీ అభ్యర్థిస్తున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండంటూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి అని సీఎం దిశానిర్థేశం చేసారు.

పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. మరింత అప్రమత్తమైన ఏపి ప్రభుత్వం..

పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. మరింత అప్రమత్తమైన ఏపి ప్రభుత్వం..

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తికి ముస్లిం మత పెద్దలు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కరోనా వైపస్ ను తరిమికొట్టడంలో తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మహమ్మారి కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో పండగలకు పర్వదినాలకు దూరంగా ఉంటామని, గతంలో హిందువులు కూడా శ్రీరామనవమి పండుగను ఇళ్లల్లోనే జరుపుకున్న అంశాంన్ని గుర్తు చేసుకున్నారు. కాగా రంజాన్ పవిత్ర మాసంలో ఎలంటి సామూహిక ప్రార్థనలకు అవకాశం పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని, రంజాన్ పవిత్ర మాసంలో సున్నితమైన అంశాలపట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు, పోలీసులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Recommended Video

AP CM YS Jagan To Relaunch Zero Interest Scheme

English summary
AP CM Jagan Mohan Reddy has released some guidelines for Muslims on the occation of ramzan. Muslim religious elders have been given key directions on special prayers during the month of Ramzan. The Chief Minister held a video conference with Muslim elders on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X