• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీ జనం బాట పట్టనున్న జగన్..! పథకాలు క్షేత్రస్థాయి అమలు పై ఫోకస్..!!

|

అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపి రాజకీయాల్లో దూకుడు పెంచబోతున్నారు. పాలన చేపట్టి వంద రోజులు సమీపిస్తున్న వైసీపి ప్రభుత్వం పట్ల క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎలా భావిస్తున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నారు. నవరత్నాల గురించి, వృద్యాప్య పించన్ గురించి, ప్రభుత్వ పథకాల గురించి, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయమైన కరకట్ట భవంతుల కూల్చివేతల గురించి ప్రజల రియాక్షన్ ను నేరుగా తెలుసుకునేందకు నడుంబిగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం అదికారులు తగిన రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్ మళ్లీ జనం బాట..! ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడంపై ఫోకస్..!!

జగన్ మళ్లీ జనం బాట..! ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడంపై ఫోకస్..!!

ఏపి యువ సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ జనం బాట పట్టబోతున్నారు. వచ్చేనెల నుండి ప్రభుత్వ పథకాలు, పాలన, ప్రజా సమస్యలు, అదికారుల పని తీరు తదితర అంశాలు నేరుగా ప్రజలతో మమేకమై వారి స్పందన తెలుసుకునేందుకు పథకం రూపొందిస్తున్నారు. గతంలో పాద యాత్రలో ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టీలో పొందుపరిచిన పథకాల అమలు ఎలా జరుగుతుందో ప్రత్యక్ష్యంగా తెలుసుకోనున్నారు జగన్. కొన్ని సందర్బాల్లో అదికారులు ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నందున అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జగన్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

వంద రోజుల జగన్ పాలన..! ప్రజాభిప్రాయం తెలుసుకోనున్న యువ సీఎం..!!

వంద రోజుల జగన్ పాలన..! ప్రజాభిప్రాయం తెలుసుకోనున్న యువ సీఎం..!!

అందుకోసం పకడ్బందీగా అడుగులు వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాలన పట్ల ప్రజల అభిప్రాయం ఏంతో తెలుసుకునేందుకు మద్యవర్తులపైన ఆధార పడకుండా నేరుగా ప్రజలతోనే తెలుసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అమెరికా పర్యటన మిగిసిన వెంటనే ఈ కార్యక్రమంపై తుది కసరత్తు ఉంటుందని తెలుస్తోంది. అదికారులు ఈ మేరకు ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపిన తర్వాత కార్యక్రమం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మళ్లీ ప్రజలతో మమేకం..! ప్రణాళికలు సిద్దం చేస్తున్న అదికారులు..!!

మళ్లీ ప్రజలతో మమేకం..! ప్రణాళికలు సిద్దం చేస్తున్న అదికారులు..!!

ఏపి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సెప్టెంబర్ నెల నుండి ప్రజలతో మమేకమై మరింత దూకుడు పెంచనున్నారు. వచ్చే నెల నుండి జిల్లా పర్యటనలతో పాటు తమ మేనిఫెస్టోలోని అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అధికార యంత్రాంగంతోపాటు పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇప్పటికే అందాయి. ముఖ్యమంత్రిగా బాధ్య తలు స్వీకరించిన తరువాత జగన్‌ అన్ని శాఖల సమీక్షలు నిర్వహించారు. వాటిలోని లోటు పాట్లను పరిశీలించారు. దాదాపు మూడు నెలల నుండి జగన్‌ తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయం నుండే ఈ సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.

 13జిల్లాల్లో పర్యటనలు..! ప్రజలవద్దకే మళ్లీ ప్రజా నాయకుడు..!!

13జిల్లాల్లో పర్యటనలు..! ప్రజలవద్దకే మళ్లీ ప్రజా నాయకుడు..!!

అయితే, రానున్న సెప్టెంబర్‌ నుండి ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా రు. తన విధనాలను నేరుగా ప్రజలకు వివరించేందుకు సన్నాహాలు చేసుకుంటు న్నారు. సెప్టెంబర్‌లో రచ్చబండ పేరిట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సీఎం జగన్‌ పర్య టించనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు అంది నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కార్యక్రమం సెప్టెంబరు 2న చిత్తూరు జిల్లా నుండి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సీఎం జిల్లాల పర్యటనలకు వెళ్లే లోగా కొన్ని కార్యక్రమాలను అమలు చేసే పనిలో మంత్రులు, అధికార యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
AP Young CM Jagan Mohan Reddy is going to be a people's trail again. From the next month, government schemes, governance, public problems, and the work of the new ysrcp goverment to know directly from the public. Officials of the ap preparing the root map for this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X