వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారిద్దరికి పదవులు ఇచ్చావు..! మరి మా పరిస్తితి ఏంటి జగనన్నా అంటున్న నటీ నటులు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : సినీ పరిశ్రమ నుంచి ఏపి సిఎం జగన్మోహన్,రెడ్డికి సినిమా కష్టాలు తప్పేట్టు కనిపించడం లేదు. ఎన్నికల్లో వారితో పాటూ తామూ కష్టపడ్డామని, ఐనప్పటికి వారిద్దరికే పదవులు కట్టబెట్టారు తప్ప తమ పరిస్థితేంటని నిలదీస్తున్నారు. 'వారిద్దరికీ పదవులు ఇచ్చారు. మరి, మా సంగతేమిటి...? ఇలా క్యూలో ఎన్నాళ్లు నుంచోవాలి..?' అని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో జగన్ కోసం పని చేసిన నటీనటులు ప్రశ్నిస్తున్నారు.

మాంచి మెజార్టీతో ఏపీ గద్దెనెక్కిన జగన్ ను ఇప్పటికీ టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల వేళ టీడీపీతో పోలిస్తే వైసీపీకి మద్దతిచ్చింది చాలా తక్కువ మంది అని స్పష్టమవుతోంది. వైసీపీ తరఫున గట్టిగా నిలబడిన పృథ్వీకి, అలీకి కీలకమైన నామినేటెడ్ పోస్టులను జగన్ కట్టబెట్టారు. వీరితోపాటు జగన్ కు మద్దతుగా నిలిచి పోరాడిన పోసాని, జయసుధ, మోహన్ బాబు, కృష్ణుడు, జోగినాయుడు, వీరంతా ఇప్పుడు వ్యతిరేక గళం విప్పేందుకు రెఢీ అవుతున్నారు. 'వారిద్దరికి ఇచ్చారు... మా సంగతేమిటి...?' అని, జగన్ ను ప్రశ్నిస్తున్నారు. వీరందరినీ జగన్ ఎలా సంతృప్తిపరుస్తారు...? వారికి ఎలాంటి పదవులు ఇస్తారు...? ఇదే అంశం ఇప్పుడు అమరావతిలో చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

ఎమ్మెల్యేకు నామినేటెడ్ పోస్ట్ కట్టబెడుతున్న సీఎం జగన్
AP CM gave them posts.! And what is our status.? actors questioning Jagan.

వైసీపీకి ఎన్నికలకు చాలా రోజుల ముందే జై కొట్టి కీరోల్ పోషించిన నటుడు ఫృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించారు జగన్. ఇక ఎన్నికల ముందరే వైసీపీలో చేరిన అలీకి ఎఫ్.డీ.సీ చైర్మన్ పదవిని ఖాయం చేశారంటున్నారు. మరి మిగిలిన వారి సంగతేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మోహన్ బాబు- పోసాని- జీవితా రాజశేఖర్ లు టీడీపీపై ఉవ్వెత్తున లేచి ఎండగట్టారు. ఇలాంటి ప్రముఖులకు చిన్న పదవులు ఇస్తే నొచ్చుకునే అవకాశాలున్నాయి.

వారికి స్థాయికి తగ్గ పదవులే ఇవ్వాలి. లేదంటే తేడా కొడుతుంది.ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు జగన్ ను సీఎంగా గుర్తించడం లేదు. వైసీపీకి మద్దతుగా నిలిచిన సీనియర్ నటుడు మోహన్ బాబు లాంటి వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. ఇక జీవితారాజశేఖర్- పోసానిలకు కూడా కీలక పదవులతోనే సంతృప్తి పరచాల్సి ఉంటుంది. మరి జగన్ వీరి విషయంలో ఎలా ముందుకెళ్తారు.? ఎలాంటి పదవులు ఇస్తారనే చర్చ అమవరావతిలో ఆసక్తిగా సాగుతున్నట్టు తెలుస్తోంది.

English summary
AP CM Jagan Mohan and Reddy from the film industry do not seem to be suffering. They have struggled with them in the election, but they are still holding their positions except for the incumbents. 'They were given positions. And what about us? How many years in the queue.?' That is why AP CM Jagan Mohan Reddy is questioning the actors who worked for Jagan in the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X