వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ భేటీలో ఏపీ సీఎం అసహనం..! అవాక్కయిన అదికార గణం, అమాత్యులు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్ ఏక పక్ష నిర్ణయాలపై గుసగుసలాడుకుంటున్న అధికారులు | There Is A Debate In The AP Secretariat

అమరావతి/హైదరాబాద్ : చట్టానికి , నిబందనలకు విరుద్ధంగా వెళ్లి చంద్రబాబు మాజీ సీ ఎం అయ్యారని వై.సీ.పీ ముక్త కంఠంతో అపోజిషన్ పై నిప్పులు చెరుగుతోంది. అయితే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మర్చిపోయి ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఇటు మంత్రులకు, అటు అధికారులకు మింగుడు పడక, ఏం చెబితే ఎలా రియాక్టవుతారో ననే భయంతో వణికిపోతున్నట్టు ఏపి సచివాలయంలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలను పక్కన పెట్టి మరీ జరిపిన క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై అన్ సీన్ ఎపిసోడ్స్ గా అదికారులు చెప్పుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

సీఎం జగన్ మోహన్ రెడ్డి విచిత్రవాదన..! అదిరిపోయిన అధికారులు, మంత్రులు...!!

సీఎం జగన్ మోహన్ రెడ్డి విచిత్రవాదన..! అదిరిపోయిన అధికారులు, మంత్రులు...!!

మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశం లో జరిగిన సంఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది. తొలుత‌ క్యాబినెట్ అజెండాగా ఎనిమిది అంశాలు అనుకోగా తర్వాత వాటిని 22 అంశాలకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతా బాగుంది, తన మానిఫెస్టో లోని సంక్షేమ పథకాలన్నీ ఆచరణలో పెట్టాలంటే, ఆర్థిక పరిపుష్టి లేని ఖజానాను చూసుకోకుండా వాటిని అమలు చేయడం ఎలా అన్న దానిపై అధికారులు, మంత్రులు సందేహాలు వ్యక్తం చేయడంతో వారిపై జగన్ తీవ్ర ఆవేశంతో ఊగిపోయినట్టు సమాచారం. "ముఖ్యమంత్రి ని, నేను చెబుతున్నా కానీ చేయరా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అదికారులు బిక్కమొహాలు వేసుకున్నట్టు చర్చ జరుగుతోంది.

రసాబసగా మంత్రివర్గ భేటీ..! ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వాస్తవాలు..!!

రసాబసగా మంత్రివర్గ భేటీ..! ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వాస్తవాలు..!!

ఇక క్యాబినెట్ అజెండా లో పరిశ్రమల శాఖలో ఉద్యోగ కల్పన అంశం లో ఏకంగా ఆ శాఖ మహిళా అధికారి పై సీఎం జగన్ ప్రవర్తించిన తీరుతో కాబినెట్ సమావేశం అంతా అవాక్కయినట్టు అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. తన పాదయాత్ర హామీల్లో భాగంగా స్థానికులకే 75% ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చారు జగన్. ఆ అంశం తాజా కాబినెట్ సమావేశం లో, అటు అధికారులకు, ఇటు మంత్రుల పాలిట శాపం గా మారింది. గత మూడేళ్లుగా నియమించిన ఉద్యోగాల్లో స్థానికులు కాని వారెవరో చూసి, వారి స్థానం లో అర్హులైన స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా ఓ చట్టాన్ని తయారు చేసి త్వరగా అమలు చేయాలని కాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాలు జారీ చేసారు.

 అదికారులపై ఆగ్రహం..! సలహా ఇవ్వడమే ఆమె చేసిన తప్పు..!!

అదికారులపై ఆగ్రహం..! సలహా ఇవ్వడమే ఆమె చేసిన తప్పు..!!

అయితే ఆ శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి ఇది ఆచరణకు సాధ్యం కాదని, అలా చేస్తే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అమె చెప్పబోయారు. ఇంతలో జగన్ ఒక్కసారిగా ఆగ్రహం తో ఊగిపోతూ అంటే నేను ఇలా ఉద్యోగాలు ఇవ్వడం కుదరదూ, మా ఉదయలక్ష్మి చెప్పే చట్టాలు, నిబంధనల వల్ల మీకు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పాలా అనడం తో ఒక్కసారిగా సమావేశం లో అందరి ముఖాలు తెల్లబోయాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే సీఎం హామీ అమలు చేయడానికి ఇతర మార్గాలున్నాయని చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులు సర్ది చెప్పడానికి ప్రయత్నించే లోగా తన చేతిలో వున్న పేపర్లను టేబుల్ పై విసురుగా పడేసి అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ కాబినెట్ సమావేశం నుండి సీఎం జగన్ బయటకు వెళ్లిపోవడంతో అధికారులు, మంత్రులు షాక్ కు గురైనట్టు ఇకరిద్దరు మంత్రులు చెప్పుకురావడం విశేషం.

 సీఎం ఏకపక్ష నిర్ణయాలు..! గందరగోళానికి గురౌతున్న అదికారులు..!!

సీఎం ఏకపక్ష నిర్ణయాలు..! గందరగోళానికి గురౌతున్న అదికారులు..!!

ఇక అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కాబినెట్ జరపటంలో తప్పులేదు కానీ ఆ విషయాన్ని ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్ కు, ప్రతిపక్షాలకు తెలపకుండా సమావేశం జరిపారు. దీంతో యథా ప్రకారం స్పీకర్ సమావేశాలను అనుకున్న సమయానికే ప్రారంభించేసారు. దీంతో ప్రభుత్వ తీరును ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు అసెంబ్లీ నడిపే తీరుపై మండిపడటం తో ప్రభుత్వ పనితీరు, సీఎం జగన్ ఏక పక్ష నిర్ణయాలతో ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన అధికారుల్లోను, ఇటు మంత్రులు, ఎమ్మెల్యే ల లోను భయం మొదలైందని మంత్రులు కక్కలేక మింగలేక పోతున్నారని అసెంబ్లీ లాబీల్లో చర్చించుకుంటున్నారు.

English summary
There is a debate in the AP Secretariat about how the decisions of AP CM Jagan Mohan Reddy, who has forgotten the state of the deficit in the budget, and the decisions of these ministers and officials are trembling with fear. The cabinet meeting of the party, aside from assembly meetings, is being advertised as unscene episodes by CM Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X