వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సీఎం జగన్ ఒక్కరికే భయపడుతారు.. ఆయన తప్ప ఎవరినీ లెక్కజేయడు, జేసీ సంచలనం...

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన విద్యావంతులకు అర్థమవుతోందని... కూలీలకు అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. జగన్ ఎవరి మాట వినరని.. ఒక్కరి మాట తప్ప అని కామెంట్ చేశారు. సోమవారం అనంతంపురంలో జేసీ మీడియాతో మాట్లాడారు.

మొండిగా ఉండొద్దంటే జగన్ వినడు.!మొండిగా ఉండాలంటే బాబు వినడు.!మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి జేసీ.!మొండిగా ఉండొద్దంటే జగన్ వినడు.!మొండిగా ఉండాలంటే బాబు వినడు.!మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి జేసీ.!

అహంతో మెలగడం..

అహంతో మెలగడం..

151 మంది ఎమ్మెల్యేల మెజార్టీ ఉంది అని జగన్ వీర్రవీగిపోతున్నారని జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ఉంటే అహం ఉండటం సరికాదన్నారు. అందరూ రాజ్యాంగానికి లోబడి నడచుకోవాలని సూచించారు. నేనే రాజు నేనే మంత్రి, చట్ం లేదు అన్నట్టు వ్యవహరించడం మంచిది కాదన్నారు. నేను చెప్పిందే జరగాలి, ప్రతిపక్షం లేదు, వారి వ్యాఖ్యలకు విలువనివ్వకపోవడం మంచి పద్ధతి కాదన్నారు.

మోడీకే భయపడతారు..

మోడీకే భయపడతారు..

సీఎం జగన్ ఒక్క ప్రధాని మోడీకి మాత్రం భయపడుతారని జేసీ పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన ఏమైనా చేస్తారనే భయంతో మెలుగుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా ఎవరన్నా లెక్కచేయరని తెలిపారు. అక్రమాస్తుల కేసుల నేపథ్యాన్ని ఉద్దేశించి జేసీ కామెంట్ చేశారని అర్థమవుతోంది. గతంలో జరిగిన ఘటనను ఉదహరించారు. బస్సుల జాతీయం చేసిన సమయంలో అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి కోర్టు సలహామేరకు రాజీనామా చేశారని తెలిపారు.

Recommended Video

AP CM Jagan To Hold Cabinet Meetings Here After In Vizag
ప్రజలు ఏమనుకుంటున్నారో..

ప్రజలు ఏమనుకుంటున్నారో..

జగన్ సీఎంగా పదవీ చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ప్రజలు ఏమనుకుంటున్నారో క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూడాలని కోరారు. ఇబ్బందులపై ప్రజలను ఒప్పించాలన్నారు. అమరావతి రాజధాని కోసం అక్కడి ప్రజలు దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. దీక్ష స్థలికి సీఎం వెళ్లకుంటే మంత్రులను పంపించాలని సూచించారు. కానీ ఆ సమస్యను మాత్రం పట్టించుకోకుండా ఉండటం సరికాదన్నారు.

English summary
andhra pradesh chief minister ys jagan mohan reddy afraid by prime minister narendra modi only tdp leader jc diwakar reddy alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X