వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిరెడ్డికి సీఎం జగన్ షాకిచ్చారా?.. వైసీపీలో ఎంపీ బాధ్యతలకు భారీ కోత.. సజ్జలకు పెద్ద పీట..

|
Google Oneindia TeluguNews

''పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను నేనే చూసుకుంటున్నాను. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం నుంచి సోషల్ మీడియా వింగ్ వరకు నా ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. భవిష్యత్తులోనూ అన్నీ నేనే చూసుకుంటాను. కానీ ఈ మధ్య నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. మా అధినేత నన్నేదో దూరం పెట్టేశారని కొన్ని చానెళ్లలో చూపించారు. అందులో నిజంలేదు. వైఎస్ కుటుంబంతో నాది గాఢానుబంధం. చనిపోయేదాకా నేను జగన్ తోనే ఉంటాను''.. సరిగ్గా నెల రోజుల కిందట(జూన్ 1న) విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లివి. సీన్ కట్ చేస్తే.. పార్టీకి సంబందించి సీఎం జగన్ తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో సాయిరెడ్డి పరిధికి భారీ కోతపడింది.

సీఎం జగన్ కు కలిసిరాని 3 అంకె.. మాడు పగిలేందుకేనన్న టీడీపీ.. డీజీపీకి చంద్రబాబు లేఖ..సీఎం జగన్ కు కలిసిరాని 3 అంకె.. మాడు పగిలేందుకేనన్న టీడీపీ.. డీజీపీకి చంద్రబాబు లేఖ..

పార్టీపై జగన్ ఫోకస్..

పార్టీపై జగన్ ఫోకస్..

ఏడాది కాలంగా వివిధ రూపాల్లో అవాంతరాలు ఎదురవుతున్నా.. వినూత్నపథకాలతో పాలనను పరుగులు పెట్టించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అయితే, కొంతకాలంగా వైసీపీలో అంతర్గత విబేధాలు పెరిగిపోవడం, నేతలు మీడియా ముందుకొచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఎంపీ రఘురామ కృష్ణంరాజు లాంటివాళ్లు ఏకంగా ‘‘సీఎంను కలవలేకపోతున్నాం''అంటూ రచ్చచేయం లాంటి పరిణామాలు ఒకింత ఇబ్బందికరంగా మారాయి. వీటి నేపథ్యంలో పార్టీపై సీఎం జగన్ మళ్లీ ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే..

ఫిర్యాదు కోసం స్టేషన్‌కు తల్లీకూతుళ్లు.. వాళ్లను చూస్తూ ఎస్ఐ హస్తప్రయోగం.. రూ.25వేల రివార్డు..ఫిర్యాదు కోసం స్టేషన్‌కు తల్లీకూతుళ్లు.. వాళ్లను చూస్తూ ఎస్ఐ హస్తప్రయోగం.. రూ.25వేల రివార్డు..

ఆ ముగ్గురికీ కీలక బాధ్యతలు..

ఆ ముగ్గురికీ కీలక బాధ్యతలు..

రాష్ట్రంలో ఇప్పటికే బలంగా ఉన్న వైసీపీని ఇంకాస్త బలోపేతం చేసి, తిరుగులేని శక్తిగా తీర్చి దిద్దే దిశగా సీఎం జగన్ వ్యూహాలు సిద్ధం చేశారు. అందులో భాగంగా జిల్లాల వారీగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ నేతలకు అప్పగిస్తూ బుధవారం కీలక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. ఆ ముగ్గురిలో పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, సీఎం బాబాయి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఇప్పటిదాకా అన్ని జిల్లాల వ్యవహారాలను తానే చూసుకుంటున్నానన్న సాయిరెడ్డిని ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే పరిమితం చేయడం గమనార్హం. దీంతో సాయిరెడ్డికి సీఎం జగన్ షాకిచ్చారనే గుసగుసలు మళ్లీ మొదలయ్యాయి.

ఏ జిల్లా ఎవరికంటే..

ఏ జిల్లా ఎవరికంటే..

వైసీపీ వర్గాలు వెల్లడించిన వివరాలను బట్టి ఆయా జిల్లాల్లో పార్టీ బలోపేతానికి సంబంధించిన వ్యవహారాలను ముగ్గురు నాయకులకు కేటాయించారు. విజయసాయిరెడ్డికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల బాధ్యతను, వైవీ సుబ్బారెడ్డికి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలు, అలాగే, సజ్జల రామకృష్ణారెడ్డికి నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల బాధ్యతను సీఎం కట్టబెట్టినట్లు సమాచారం. జగన్ తో, వైసీపీతో గాఢానుబంధం ఉన్నప్పటికీ, చాలా కాలం పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సజ్జల.. ప్రభుత్వ సలహాదారు హోదాలో పనిచేస్తున్నారు. ఇప్పుడాయనకు పార్టీలో బాధ్యతల పరంగానూ పెద్ద పీట లభించినట్లు వెల్లడైంది.

Recommended Video

YS Jagan Inaugurates New Ambulance Services In AP | 104,108 సేవ‌లలో కొత్త శ‌కం || Oneindia Telugu
సెంట్రల్ ఆఫీసూ సజ్జలకే..

సెంట్రల్ ఆఫీసూ సజ్జలకే..

రాష్ట్ర విభజన తర్వాత కూడా చాలా కాలంపాటు వైసీపీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే కొనసాగింది. గత ఎన్నికలకు చాన్నాళ్ల ముందే జగన్ నివాసంతోపాటు తాడేపల్లిలోనే పార్టీ కేంద్ర కార్యాలయాన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అధికార పార్టీ కావడంతో వైసీపీ సెంట్రల్ ఆఫీసు వ్యవహారాలు కూడా కీలకంగా మారాయి. ఇప్పుడా కార్యాలయ సమన్వయ బాధ్యతలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డికే కట్టబెట్టారు అధినేత జగన్. ఈ మార్పులకు సంబంధించి వైసీపీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

English summary
while ap cm ys jagan focuses on strengthening ysrcp party, he allocates district wise responsibilities to three key leaders on wednesday. mp vijaya sai reddy restricted to north andhra districts only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X