• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిరుద్యోగులు సిద్దం కండి..జనవరి 1న కొత్త నోటీఫికేషన్లు: వారందరికీ సెల్యూట్..సీఎం జగన్..!

|

ఏపీలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ విస్పష్ట హామీ ఇచ్చారు. ఇక నుండి ప్రతీ జనవరి 1 నుండి 30వ తేదీ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..భర్తీ ప్రక్రియ ఉంటుందని సీఎం జగన ప్రకటించార. గ్రామ..వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి జగన్ అప్పాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చారు. అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయడం లేదు.. సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ గ్రామ, సచివాలయ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇంత పెద్ద మొత్తంగా ఉద్యోగ ప్రక్రియను ఎక్కడా పొరపాట్లకు తావు లేకుంగా పూర్తి చేసిన అధికార యంత్రాగానికి సెల్యూట్ చేసారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించలేకపోయిన వారు భాద పడవద్దని..జనవరిలో వచ్చే నోటిఫికేషన్ కు సిద్దంగా ఉండాలని ఉత్తేజ పరిచారు.

నాడు వైయస్.. నేడు జగన్: తిరుమలలో అరుదైన ఘట్టం: ఆ కుటుంబానికే..!

ప్రతీ జనవరిలో ఉద్యోగాల నోటీఫికేషన్లు..

ప్రతీ జనవరిలో ఉద్యోగాల నోటీఫికేషన్లు..

నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ వరం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతీ ఏటా ఖాళీ అయ్యే ఉద్యోగాలతో పాటుగా కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రతీ ఏటా జనవరి 1న ప్రారంభించి నెలాఖరు వరకు కొనసాగిస్తామని ప్రకటించారు. జనవరి నెలలో అప్పటి వరకూ భర్తీ చేయాల్సిన అన్ని ఉద్యోగాలను నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక కాని వారు అధైర్య పడవద్దని జనవరి కోసం సిద్దం కావాలని సూచించారు. ప్రతీ ఏటా నోటిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసారు. జనవరిలోనే నియామక పరీక్షలు నిర్వహిస్తామని..ప్రభుత్వ ఉద్యోగాలు ఒకే సారి భర్తీ చేస్తామని ప్రకటించారు. ఏపీలో మెరిట్ ఉన్న నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ..జనవరి రాబోతోంది..సిద్దంగా ఉండండి అంటూ వారికి భరోసా ఇచ్చారు.

ఇంత భారీ ఉద్యోగాలు ఒక రికార్డు..

ఇంత భారీ ఉద్యోగాలు ఒక రికార్డు..

ప్రతీ గ్రామంలోని వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఈ సచివాలయ ఉద్యోగాల ద్వారా ఇవ్వగలిగామని..దీంతో పాటుగా వాలంటీర్ ఉద్యోగం ఇచ్చామని..ఇది రికార్డు అని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. తమ పాలన నాలుగు నెలలు పూర్తి కాకుండానే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. మీకు అప్పగించిన బాధ్యతలను ఉద్యోగంలా కాకుండా.. ఉద్యమం లాగా స్వీకరించాలని సూచించారు. అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయడం లేదు.. సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ గ్రామ, సచివాలయ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

 వారందరికీ సెల్యూట్...

వారందరికీ సెల్యూట్...

గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన చెల్లెమ్మలు, తమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జగన్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో.. అత్యంత పారదర్శకంగా ఏకంగా ఇరవై లక్షల మందికి పైగా ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడం, ఎనిమిది రోజుల పాటు పరీక్షలు జరగడం, లక్షా నలభై వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం.. ఇది నిజంగా ఓ రికార్డని జగన్ చెప్పుకొచ్చారు. ప్రతీ రెండు వేల జనాభాకు సచివాలయం పెట్టడం.. తద్వారా పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఉజ్జాయింపుగా ప్రతీ గ్రామానికి పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ప్రతీ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉద్యోగం కూడా ఇచ్చాము. ఉద్యోగాల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు అని పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించిన అధికారులకు సీఎం జగన్ సెల్యూట్ చేసారు.

వివక్ష..రాజకీయాలకు అతీతంగా..

ఇంత పెద్ద మొత్తంలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపికైన మీరంతా సేవలు అందించాలని సూచించారు. పెన్షన్లు..రేషన్ కార్డులు.. ఇల్లు..అన్ని రకాలుగా దాదాపు వంద రకాల సేవలు అందిస్తున్నామని ప్రకటించారు. ఈ సేవలను ప్రతీ ఒక్కరికి అందించేలా చూడాల్సిన బాధ్యత ఎంపికైన వారందరి మీద ఉందన్నారు. అదే విధంగా ప్రభుత్వ సేవలు కులాలు..ప్రాంతాలు..పార్టీలు..రాజకీయాలకు అతీతంగా అందరికీ అందించాలని సూచించారు. వైసీపీకి ఓటు వేయని వారికి సైతం సమ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ధేశించారు. ఎవరైనా గ్రామ సచివాలయంలో తమకు కావాల్సిన అభ్యర్ధన ఇచ్చిన తరువాత 72 గంటల్లోగా పరిష్కారం లభించాలని స్పష్టం చేసారు. త్వరలోనే సొంత భవనాలు..మౌళిక వసతులు అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Cm Jagan Announced in every januaray govt jobs notifications will be issued and filled. From Januray1st to end of hte month total process will be completed. Those who not got chance in village secretariat exams no nned to worry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more