వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రుల‌కు జ‌గ‌న్ కొత్త బాధ్య‌త‌లు: ఆ జిల్లాల‌ను మీరే చూడాలి: నిర్ల‌క్ష్యం చేస్తే ఇక అంతే..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న కేబినోట్ స‌హ‌చ‌రుల‌కు కొత్త బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 25 మంది మంత్రుల్లో 13 మందికి జిల్లాల బాధ్య‌త‌ల‌ను కేటాయించారు. ఏపీలోని మొత్తం 13 జిల్లాల‌కు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి సంబంధించి మ‌రో సారి మంత్రుల‌తో చ‌ర్చించి అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్నారు. దీని ద్వారా ఇక త‌మ సొంత జిల్లాల‌తో పాటుగా ఇన్‌ఛార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించిన జిల్లాలో ప్ర‌భుత్వం..పార్టీ వ్య‌వ‌హారాల‌ను వీరే చ‌క్క‌దిద్దాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మంత్రుల‌కు స్ప‌ష్ట‌మైన మార్గ‌నిర్ధేశకాల‌ను నిర్ధేశించారు.

13 జిల్లాల‌కు ఇన్‌ఛార్జ్ మంత్రులు..

13 జిల్లాల‌కు ఇన్‌ఛార్జ్ మంత్రులు..

జ‌గ‌న్ త‌న కేబినెట్‌లోని 25 మంది మంత్రుల్లో 13 మందికి ఇన్‌ఛార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మంత్రుల‌కు జిల్లాల‌ను కేటాయించే అంశాలోనూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ జిల్లాలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకొని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రులుగా కీల‌క బాధ్య‌త‌లు ఉండ‌టంతో..ఇలా ఎంపిక చేసారు.

శ్రీకాకుళం - వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం - చేరుకువాడ శ్రీరంగనాధరాజు
విశాఖపట్నం - మోపిదేవి వెంకటరమణ
తూర్పుగోదావరి - ఆళ్ల నాని
పశ్చిమగోదావరి - పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణా - కన్నబాబు
గుంటూరు - పేర్ని నాని
ప్రకాశం - అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు - సుచరిత
కర్నూలు - బొత్స సత్యనారాయణ
కడప - బుగ్గన రాజేంద్రనాధ్
అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి

అదికారులకు జగన్ ఛీర్స్..! సీఎం నిర్ణయంతో రెట్టింపైన హుషారు..!! <br /> అదికారులకు జగన్ ఛీర్స్..! సీఎం నిర్ణయంతో రెట్టింపైన హుషారు..!!

గోదావ‌రి జిల్లాల‌కు ఆ నేత‌ల‌కే..

గోదావ‌రి జిల్లాల‌కు ఆ నేత‌ల‌కే..

ఇన్‌ఛార్జ్ మంత్రులుగా నిర్ణ‌యం తీసుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉభ‌య గోదావరి జిల్లాల్లో మాత్రం భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు అదే జిల్లాకు చెందిన వారిని..ఇద్ద‌రినీ ఉప ముఖ్య‌మంత్రుల‌కే ఇన్‌ఛార్జ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. తూర్పుగోదావ‌రి జిల్లాకు కాపు నేత ఆళ్ల నాని..ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు సీనియ‌ర్ బీసీ నేత పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌ను నియ‌మించారు. ఇక‌, కృష్ణా జిల్లాకు తూర్పు గోదావ‌రికి చెందిన కురుసాల క‌న్న‌బాబుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు సీఎం జ‌గ‌న్‌. గుంటూరు జిల్లా బాధ్య‌త‌ల‌ను కాపు నేత పేర్ని నానికి కేటాయించారు. కీల‌క‌మైన అనంత‌పురం జిల్లాకు సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్ప‌గించారు. త‌న సొంత జిల్లా బాధ్య‌త‌ల‌ను ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాధ్‌కు కేటాయించిన సీఎం జ‌గ‌న్..క‌ర్నూలు జిల్లాకు బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌కు బాధ్య‌త‌లను అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

అభివృద్ది..పాల‌న‌..పార్టీ వ్య‌వ‌హారాల కోసం..

అభివృద్ది..పాల‌న‌..పార్టీ వ్య‌వ‌హారాల కోసం..

ఇన్‌ఛార్జ్ మంత్రులుగా వారు జిల్లాల్లో అభివృద్ది కార్య‌క్ర‌మాలు..పాల‌నా తీరు తెన్నులు..పార్టీ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించాల్సి ఉంటుంది. జిల్లా ప‌రిష‌త్ స‌మావేశాల‌తో పాటు జిల్లాల‌కు సంబంధించిన నిర్ణ‌యాల్లో జిల్లాల‌కు చెందిన స్థానిక మంత్రుల‌తో పాటుగా ఇన్‌ఛార్జ్‌ల‌కు కీల‌క బాధ్య‌త‌లు ఉంటాయి. ప్ర‌భుత్వం-పార్టీ వ్య‌వ‌హారాల‌ను రెండు క‌ళ్లుగా చూడాల‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ మంత్రుల‌కు స్ప‌ష్టం చేసారు. ఎమ్మెల్యేలకు సైతం ఇన్‌ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉండాల‌ని..వారి సూచ‌న‌ల మేర‌కు జిల్లాల స్థాయిలో నామినేటెడ్ పోస్టుల క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు. దీనికి సంబ‌ధించిన అధికారిక ఉత్త‌ర్వ‌లు ఒక‌టి రెండు రోజుల్లో విడుద‌ల కానున్నాయి.

English summary
AP CM jagan Appointed District Incharge Minister for 13 dists. jagan given directions that every Minister should feel Govt and Party as two eyes in responsibilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X