వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేసీ బ్ర‌ద‌ర్స్ స్పీడ్‌కు జ‌గ‌న్ బ్రేకులు: ఆ పోస్టు ఏరికోరి ఆ అధికారికే : సీఎం ల‌క్ష్యం అదేనా..!

|
Google Oneindia TeluguNews

జ‌గ‌న్ మా వాడే అంటూనే..క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పిన జేసీ దివాక‌ర్‌రెడ్డి కి రెండు రోజుల్లో జ‌గ‌న్ జ‌ల‌క్ ఇచ్చారు. వారి స్పీడ్‌కు బ్రేకులు వేయాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగా.. 2017, ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన ఉదంత‌మే దీనికి కార‌ణంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ అవమానం ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే జ‌గ‌న్ సీఎం హోదాలో పూర్తి ప్ర‌క్షాళ‌న‌కు శ్రీకారం చుట్టారు. ప‌రోక్షంగా జేసీ బ్ర‌ద‌ర్స్‌కు ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీ చేసారు. అందులో భాగంగానే..ఆ ఐపీఎస్‌కే ఆ పోస్టు క‌ట్ట‌బెట్టారు.

నాడు ఏం జ‌రిగింది..
నాడు విప‌క్ష నేత‌గా జ‌గ‌న్. 2017, ఫిబ్ర‌వ‌రి 27. విజ‌య‌వాడ స‌మీపంలో దివాక‌ర్ ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు వేగంతో వెళ్లిన కార‌ణంగా అదుపు త‌ప్పి ప్ర‌మాదానికి గురైంది. ఆ ప్ర‌మాదంలో 11 మంది మ‌ర‌ణించ‌గా..మ‌రో 30 మందికి గాయాల య్యాయి. ఆ ప్ర‌మాదం తెలుసుకున్న జ‌గ‌న్ ఘ‌ట‌నా స్థ‌లికి వెళ్లారు. బస్సును ప‌రిశీలించారు. అదే విధంగా బాధితులు చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి వెళ్లి పరామ‌ర్శించారు.

AP CM Jagan appointed senior IPS Seeta Ramanjaneyulu as Transport commissioner

ఆ స‌మ‌యంలో కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న అహ్మ‌ద్ బాబు..జ‌గ‌న్ మ‌ద్య స్వ‌ల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ చేసిన కామెంట్ల పైన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌డ‌న్‌గా దీక్ష‌కు దిగారు. అనుచిత వ్యాఖ్య‌లు చేసారు. ఆ త‌రువాత త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల చింతిస్తున్న‌ట్లు చెప్పారు. అయితే, జ‌గ‌న్ సైతం నాడు ప్ర‌భాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల మీద స్పందించారు. రోడ్డు మీద ఏనుగు వెళ్తుంటే ఎన్నో మొరుగుతూ ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఏం జ‌రుగుతోంది..
అది గ‌తం. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. దివాక‌ర్ ట్రావెల్స్ మాత్ర‌మే కాదు. ప్ర‌తీ ప్ర‌యివేటు ట్రావెల్స్ ను కంట్రోల్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గుర్తించారు. దీనికి అనుగుణంగా టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కొంద‌రు నేత లు నాటి ర‌వాణా క‌మిష‌న‌ర్ పైన దౌర్జ‌న్యానికి దిగిన సంఘ‌ట‌న గుర్తు చేసుకున్నారు. ప్ర‌యివేటు ట్రావెల్స్ కార‌ణంగా ఆర్టీసికి న‌ష్టం జ‌రుగుతుంద‌ని గుర్తించారు. ప్ర‌యివేటు ట్రావెల్స్ ఆగ‌డాల‌ను..ప్ర‌మాదాల‌ను నివారించ‌టానికి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

దీంతో..ఏరీ కోరి విధుల్లో ఎవ‌రి మాట విన‌డ‌నే పేరున్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును ఏపీ ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పోస్టులో ఉన్న బాల సుబ్ర‌మ‌ణ్యంను బ‌దిలీ చేసారు. ఇక‌, సీతారామంజ‌నేయులుకు తొలుత ఇంట‌లిజెన్స్ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావించినా..ర‌వాణా శాఖ‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి..త‌న లక్ష్యం చేరుకోవాలంటే సీతారామాంజ‌నేయులును ఎంచుకు న్నారు. దీంతో..ఇప్పుడు సీఎంగా జ‌గ‌న్...సీతారామాంజ‌నేయులు ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

English summary
AP CM Jagan appointed senior IPS Seeta Ramanjaneyulu as Transport commissioner. To control private travels cm taken this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X