వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు సాధ్యం కాదన్నారు..సాధ్యం చేసి చూపిస్తన్న జగన్ : ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసి సిబ్బంది..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని అమలు చేసే దిశగా కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అడుగుల్లో భాగంగా ముఖ్యమైన నిర్ణయం జరిగింది. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు అంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన నియమించిన కమిటీ.. తన నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను ఆమోదిస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యం కాదని..సాధ్యపడే అంశం అయితే తానే విలీనం చేసేవాడినని చంద్రబాబు అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ అది ఆచరణలో చూపిస్తున్నారు. ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వం పైన ఏటా మూడు వేల కోట్ల నుండి 3500 కోట్ల వరకు భారం పడనుంది.

పవన్ కళ్యాణ్ నయా రాజకీయం: జగన్ ఒక వర్గానికే అనుకూలమంటూ : అసలు ఆట మొదలెట్టేసారు...!పవన్ కళ్యాణ్ నయా రాజకీయం: జగన్ ఒక వర్గానికే అనుకూలమంటూ : అసలు ఆట మొదలెట్టేసారు...!

ముఖ్యమంత్రి కీలక నిర్ణయం..

ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ అంగీకారం తెలిపారు. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు అంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు.
సీఎం జగన్‌ రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన నియమించిన కమిటీ.. తన నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి ఆమోదించారు. బుధవారం మంత్రివర్గ సమావేశం లో దీని పైన అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఖజానా మీద ప్రతి సంవత్సరం ఆర్టీసీ మీద ఉన్న జీతభత్యాల భారం సుమారు రూ. 3,300 నుంచి రూ. 3,500 కోట్లు ఉందని, దాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకోబోతుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు కమిటీ సిఫార్సులు చేసింది.

ప్రభుత్వంలో ప్రజా రవాణా వ్యవస్థ

ప్రభుత్వంలో ప్రజా రవాణా వ్యవస్థ

ఏపీ ప్రభుత్వంలో కొత్తగా ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబందించి కేబినెట్ లో ఆమోద ముద్ర వేసారు. దీని ద్వారా ప్రస్తుతం ఆర్టీసిలో గుర్తింపు పొందన ప్రతీ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి గా సమాన హక్కులు..వేతనాలు అందుకుంటారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటం పైన ఆర్టీసీ కార్మికులు, యూనియన్‌ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకరించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు పలిశెట్టి దామోదరరావులుతో పాటుగా . ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు అంగీకరించిన సీఎం జగన్‌కు ఈయూ తరపున కృతజ్ఞతలు తెలిపారు. వీలీనం కమిటీకి ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు ఇచ్చిన అన్ని డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కోరుకున్న విధంగా విలీనం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే అన్ని సౌకర్యాలు ఆర్టీసి ఉద్యోగులకు వర్తించేలా చూడాలని కోరారు.

సాధ్యం కాదన్న చంద్రబాబు..

సాధ్యం కాదన్న చంద్రబాబు..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఓటమి పైన విశ్లేషణ లో భాగంగా చంద్రబాబు నాడు కీలక వ్యాఖ్యలు చేసారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సాధ్యం అయ్యే విషయం అయితే తానే దీనిని అమలు చేసే వాడినని..తనకు తెలియని విషయమా అని వ్యాఖ్యానించారు. అయితే, దీని పైన అప్పట్లో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి కేబినెట్ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుుడు జరుగుతున్న రెండో కేబినెట్ సమావేశంలో కమిటీ సిఫార్సులకు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పైన ప్రతిపక్ష నేత ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీ సర్కార్ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెట్టేలా ఉందని తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటలో భాగంగా నోటీసులు అందించారు.

English summary
AP CM jagan approved committe reccomandations to merge APSRTC with Govt. In Cabinet meeting this will approve officially. With this decision RTC employees become state govt employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X