• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ పంద్రాగష్టు మొదటి ప్రసంగం: ఎందుకీ ఆహాకారాలు, గతిని మార్చే చట్టాలు తెచ్చాం

|

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ఉద్వేగభరితంగా ప్రసంగించారు. గత ప్రభుత్వ తప్పిదాలను గుర్తుచేసిన సీఎం..రైతులు, మహిళలు, యువతకి సంబంధించి ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరించారు. అడ్డగోలుగా పెంచిన టెండర్ ధరలను తగ్గించాలన్నందుకు గగ్గోలు పెడుతున్నారన్నారు. చార్జీలు తగ్గించాలని విద్యుత్ సంస్థలని అడిగినందుకు హాహాకారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా..ముందకే వెళ్తామని స్పష్టం చేసారు. ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామని స్పష్టంగా తేల్చి చెప్పారు. చెప్పారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, రాష్ట్ర విభజన నష్టాలను పూడ్చేందుకు నిర్దిష్ట లక్ష్యాలతో తమ ప్రభుత్వం ముందుకువెళ్తోందని తెలిపారు. తమ ప్రభుత్వ ప్రాధమ్యాలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ వివరించారు.

 హాహాకారాలు..గగ్గోలు..యాగీ ..నేను చేసిన తప్పేంటి..

హాహాకారాలు..గగ్గోలు..యాగీ ..నేను చేసిన తప్పేంటి..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తన ప్రసంగంలో ఉద్వేగానికి లోనయ్యారు. సమాజంలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయనిమచ్చలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విధినిర్వహణలో సాహసోపేతంగా వ్యవహరించిన పలువురు రాష్ట్ర పోలీసులకు మెడల్స్‌ అందించారు. తన ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న అంశాలు..వాటిని ఎంచుకున్న విధానాన్ని ముఖ్యమంత్రి వివరించారు. వరత్నాలు, సామాజిక ప్రగతికి పెద్దపీట వేస్తూ ఇటీవల తీసుకొచ్చిన చట్టాలు..ప్రభుత్వ నిర్ణయాలను తన ప్రంసగంలో ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వ తప్పిదాలను గుర్తుచేసిన సీఎం..రైతులు, మహిళలు, యువతకి సంబంధించి ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరించారు. రైతులకు.. పేదలకు ఉచితంగా కరెంట్ ఇచ్చేందుకు వీలుగా చార్జీలు తగ్గించాలని విద్యుత్ సంస్థలని అడిగినందుకు హాహాకారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కాంట్రాక్టర్లు.. కమిషన్‌ల కోసం అడ్డగోలుగా పెంచిన టెండర్ ధరలను తగ్గించాలన్నందుకు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినందుకు నానా యాగీ చేస్తున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు తప్పా..అసలు ప్రభుత్వం చేసిన తప్పేంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

గ్రామ సచివాలయాలు వినూత్న ప్రక్రియ..

గ్రామ సచివాలయాలు వినూత్న ప్రక్రియ..

గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామ సచివాలయాలు తీసుకొస్తున్నామని సీఎం జగన్ వివరించారు. మద్యపానాన్ని నిషేధించేదిశగా నూతన మద్య విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.

తమ ప్రభుత్వ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్రగతిని మార్చే చట్టాలు తీసుకొచ్చామన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతో పాటుగా ఎస్సీ.. ఎస్టీ.. మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చే చట్టాలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. నామినేటెడ్ పదవులు.. నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ చట్టం తీసుకొచ్చామని.. ఇలాంటి చట్టాలు తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల కరెంట్ ప్రస్తుతం 60 శాతం ఇస్తున్నామని తెలిపారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలించడం ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, రాష్ట్ర విభజన నష్టాలను పూడ్చేందుకు నిర్దిష్ట లక్ష్యాలతో తమ ప్రభుత్వం ముందుకువెళ్తోందని స్పష్టం చేసారు. మద్యనియంత్రణలో భాగంగా బెల్ట్‌ షాపులు మూయించడమే కాకుండా వాటిని శాశ్వతంగా మూయించేందుకు లాభాపేక్ష లేకుండా అక్టోబర్‌ 1నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మేలా నిర్ణయం అమలు చేస్తామన్నారు. భూయాజమానులకు ఎలాంటి నష్టం కలుగకుండా కౌలురైతులకు వైఎస్సార్‌ రైతు భరోసాతోపాటు పంటల బీమా, పంటల పరిహారం అందించేందుకు చట్టం తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నానంటూ జగన్ పేర్కొన్నారు.

 పరిస్థితులను మార్చుకుందామా..వద్దా

పరిస్థితులను మార్చుకుందామా..వద్దా

తన ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అవినీతి, అధికారం పాలు.. నీళ్లలా కలిసిపోయాయని.. అవి అలాగే ఉంటాయని వదిలేద్దామా.. లేక ఈ పరిస్థితులను మారుద్దామా.. అన్నది గుండెలపై చేతులు వేసుకొని ఆలోచించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో మార్పు తీసుకువద్దామనే దృఢ నిశ్చయంతో నవరత్నాలు తీసుకొచ్చాం అని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం లో ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు. కులం..మతం..ప్రాంతం..పార్టీ ఏవీ లేవని..చివరకు తమకు ఓటు వేయని వారికి సైతం సంక్షేమం అందిస్తామన్నారు. మనదే. బీసీ కులాలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదు.. భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాన్‌బోన్‌లుగా వెన్నెముక కులాలుగా చేస్తామన్న మాటకు కట్టుబడి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసామని చెప్పుకొచ్చారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రులను కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. వెయ్యి రూపాయాల ఖర్చు దాటితే ప్రతీ రోగానికి ఆరోగ్యానికి ఉచితంగా వైద్యం అందిస్తామని స్పష్టం చేసారు. జనవరి 1 నుండి 104..108 పూర్థి స్థాయిలో అందుబాటులో వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. నాలుగేళ్లలో ఏపీ స్వరూపం మార్చి వేస్తామని జగన్ ప్రకటించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Cm Jagan asusred people on welfare and development. Jagan once again mentioned about his decision on PPA Review and Re tendering. CM stated that he committed for all sections development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more