వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వుల పందేరం: నామినేటెడ్ పోస్టుల‌కు పోటీ లేకుండా..పేర్లు ఖ‌రారు చేసిన జ‌గ‌న్‌

|
Google Oneindia TeluguNews

ఏపీ అధికార పార్టీలో ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వుల పందేరం మొద‌లైంది. మ‌రో వారం రోజుల్లో ఏపీ శాస‌న‌స‌భా స‌మావేశాలు ముగియ‌నున్నాయి. ఈ లోగానే ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వులు ఇచ్చేలా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి వీటి మీద ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అనేక మంది సీనియ‌ర్ల‌కు కేబినెట్‌లో స్థానం ద‌క్క‌లేదు. అదే విధంగా ప‌లువురు జ‌గ‌న్ త‌మ‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం లేద‌నే ఆవేద‌న అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో.. కొత్త‌గా ఇవ్వ‌నున్న ప‌ద‌వుల్లో సామాజిక ..ప్రాంతీయ స‌మీక‌ర‌ణాల‌తో పాటుగా 50 శాతం బీసీ..ఎస్సీ...ఎస్టీ..మైనార్టీల‌కు ఇచ్చేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ అందులో 50 శాతం మ‌హిళ‌ల‌కు కేటాయించేలా ప‌ద‌వుల ప్ర‌క‌ట‌న ఉండ‌నుంది.

జ‌గ‌న్ ప్రభుత్వానికి మ‌రో బ్యాంకు షాక్‌: అమ‌రావ‌తి కోసం నిధులు ఇవ్వ‌లేం: తేల్చేసిన ఏఐఐబీ...!జ‌గ‌న్ ప్రభుత్వానికి మ‌రో బ్యాంకు షాక్‌: అమ‌రావ‌తి కోసం నిధులు ఇవ్వ‌లేం: తేల్చేసిన ఏఐఐబీ...!

ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వులు పండుగ‌..

ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వులు పండుగ‌..

కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వులు..నామినేటెడ్ పోస్టుల‌కు ఎమ్మెల్యేలు పోటీ కాకుండా వారికి ఇత‌ర మార్గంలో ప‌ద‌వులు క‌ట్ట బెట్ట‌టానికి ముఖ్య‌మంత్రి జ‌గన్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇది తుది ద‌శ‌కు చేరిన‌ట్లు స‌మాచారం. ఏపీలో కొత్త అసెంబ్లీ ఏ ర్పాటై దాదాపు రెండు నెల‌లు పూర్తి అవుతోంది. కొత్త అసెంబ్లీలో కొత్త‌గా క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీ ని కోసం ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. అందులో భాగంగా కీల‌క‌మైన ప‌బ్లిక్ ఎకౌంట్స్ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ని ప్ర‌తిప‌క్షాల‌కు కేటాయించ‌టం ఆన‌వాయితీ. దీని ప్ర‌కారం ఈ ప‌ద‌వి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి వెళ్ల‌నుంది. ఇందులో అధికార పార్టీ వైసీపీ నుండి ఎనిమిది మంది స‌భ్యులుగా ఉంటారు. ప్ర‌భుత్వం చేసే ప్ర‌తీ ఖ‌ర్చును ఈ క‌మిటీ ప‌ర్య‌వేక్షి స్తుంది. టీడీపీ నుండి ఛైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకొనేందుకు పోటీ నెల‌కొని ఉంది. ఇది నామినేటెడ్ పోస్టు కావ‌టంతో దీనిని బిసి వ‌ర్గాల‌కు కేటాయించే అవకాశం క‌నిపిస్తోంది. అచ్చెన్నాయుడు పేరును ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ప‌రిశీల న చేస్తున్న‌ట్లుగా టీడీపీలో చ‌ర్చ సాగుతోంది.

వైసీపీ స‌భ్యుల‌కు కీల‌క బాధ్య‌త‌లు..

వైసీపీ స‌భ్యుల‌కు కీల‌క బాధ్య‌త‌లు..

ఇక‌..శాస‌న‌స‌భ‌లో ప‌లు క‌మిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అసెంబ్లీలో మొత్తం ప‌ది క‌మిటీలు ఉంటాయి. ఇప్ప‌టికే ఈ క‌మిటీల్లో ఎవ‌రికి స్థానం క‌ల్పించాల‌నే దాని పైన ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల మేర‌కు పార్టీ నేత‌లు ఒక్కో ప‌ద‌వికి ఇద్ద రు ఎమ్మెల్యేల పేర్ల‌ను ప్ర‌తిపాదించారు. క‌మిటీ ఛైర్మ‌న్ పద‌వుల‌కు సైతం పేర్ల‌తో జాబితాను అధినేత ముందుంచారు. దీని పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం క‌స‌ర‌త్తు పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి ఖ‌రారు చేసిన ఈ పేర్ల‌ను అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అయితే, ఈ పోస్టుల్లో ప్ర‌ధానంగా సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. అందునా..సామాజిక‌-ప్రాంతీయ స‌మీక‌ర‌ణాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌దు. బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ వ‌ర్గాల‌కు అందునా 50 శాతం మ‌హిళా ఎమ్మెల్యేల‌కు చాన్స్ ద‌క్కుతుంద‌ని చెబుతున్నారు.ఇప్ప‌టికే కొన్ని పేర్ల పైన ముఖ్య‌మంత్రి ఎమ్మెల్యేల‌తో సైతం చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

ప‌ద‌వులు వీరికి ఖరారైన‌ట్లేనా..

ప‌ద‌వులు వీరికి ఖరారైన‌ట్లేనా..

అసెంబ్లీలో వివిధ కమిటీలలో ఛైర్మన్లను ఎంపిక చేసేందుకు ముఖ్య‌మంత్రి క‌స‌ర‌త్తు పూర్త‌యింది. మొత్తం 10 కమిటీ లకు పేర్ల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. అందులో కీల‌క‌మైన ప‌బ్లిక్ అండర్ టేకింగ్ క‌మిటీ ఛైర్మ‌న‌గా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజ‌న్న‌దొర పేరు ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. అదే విధంగా కొత్త‌పేట ఎమ్మెల్యే చిల్ల జ‌గ్గిరెడ్డి పేరును జ‌గ‌న్ ప‌రిశీల‌న చేస్తున్నారు. ఇక‌..పాల‌కొండ ఎమ్మెల్యే వి క‌ళావ‌తిని సాంఘిక మ‌హిళా సంక్షేమ క‌మిటీకి ఛైర్మ‌న్‌గా ఖ‌రా రు చేసారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు కూడా ఛైర్మన్‌ పదవి ఖరారయిం ది. ఇక‌..సీనియ‌ర్ నేత‌లు కొల‌గొట్ల వీర‌భ‌ద్ర స్వామి..భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి.. బాల‌రాజు..గొల్ల బాబూరావు..అనంత వెంక‌ట రామిరెడ్డి.. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. మ‌హీధ‌ర్ రెడ్డి..ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డితో పాటుగా ప‌లువురు మ‌హిళా ఎమ్మెల్యేల‌కు అవ‌కాశం ద‌క్క‌నుంది.

English summary
AP CM Jagan Concentrated on constitute Assembly committees with party senior leaders. Totally 10 Assembly committees to be constitute ins coming two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X