వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ టీంలోకి రోహిణీ సింధూరీ: ఏరి కోరి తెచ్చుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి: "స‌్పంద‌న" బాధ్య‌త‌లు అమెకే...

|
Google Oneindia TeluguNews

రోహిణీ సింధూరి. ఓ మ‌హిళా ఐఏయ‌స్ అధికారి. కొద్ది కాలం క్రితం ఈ పేరు ఓ సంచ‌ల‌నం. క‌ర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రుల‌కే చెమ‌ట‌లు ప‌ట్టించారు. ప్ర‌భుత్వ మీదే న్యాయ పోరాటం చేసారు. చ‌ట్టానికి చుట్టాలుండ‌ర‌ని న‌మ్మ ట‌మే కాదు..ఆచ‌ర‌ణలో చూపించిన అధికారి. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ మేర‌కు క‌ర్నాట‌క‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు. వాళ్లు అంగీక‌రించారు. మ‌రో నాలుగైదు రోజుల్లో నే ఈ డైన‌మిక్ అధికారి ఏపీ ముఖ్య‌మంత్రి టీంలో అధికారిగా చేర‌బోతున్నారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే ఈ అధికారి కి ముఖ్య‌మంత్రి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న "స‌్పంద‌న" ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు.

Recommended Video

నాకు వేదికపై కేటాయించిన సీట్ లో అధికారులు ఎలా కూర్చుంటారు- రెడ్డి సుబ్రహ్మణ్యం
ఏపీకి రోహిణి ..జ‌గ‌న్ నిర్ణ‌యం..

ఏపీకి రోహిణి ..జ‌గ‌న్ నిర్ణ‌యం..

కొద్ది కాలం క్రితం ఈ పేరు అంద‌రికీ బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చిన పేరు. క‌ర్నాట‌క‌లో అధికార పార్టీ నేత‌ల‌కే నిబంధ‌న ల‌ను విస్మ‌రిస్తే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. దీంతో..ప‌దేళ్ల ఐఏయ‌స్ స‌ర్వీసులో అనేక బ‌దిలీలు ఎదుర్కొన్నారు. త‌మ కోసం ప‌ని చేసే అధికారిని బ‌దిలీ చేయ‌వ‌ద్దంటూ ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. రోహిణి సింధూరి తెలుగమ్మాయి. ఖమ్మం జిల్లాలో పుట్టి...హైదరాబాద్‌లో పెరిగారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్‌ తీసుకున్నారు. కర్ణాటకలో పోస్టింగ్‌ అందుకు న్నారు. క‌ర్నాట‌క‌లో వివిధ ప్రాంతాల్లో ప‌ని చేసిన స‌మ‌యంలో క‌రువు రైతులకు ప‌రిహారం విష‌యంలోనూ.. కొబ్బ‌రి నీటితో కార్పోరేట్ వ్యాపారం చేయ‌ట ఎలాగో రైతుల‌కు నేర్పించి వారి మ‌న‌స్సుల్లో స్థానం సంపాదించారు. 2009 ఐఏ య‌స్ బ్యాచ్‌కు చెందిన దాస‌రి రోహిణీ సింధూరి నెల్లూరుకు చెందిన సుధీర్ రెడ్డిని వివాహమాడారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల మీద నిక్క‌చ్చిగా పోరాడే రోహిణీ సింధూరిని ఏపీకి రావాల‌ని జ‌గ‌న్ క‌బురు చేయ‌గా వెంట‌నే అంగీకరించారు. రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ప్ర‌క్రియ పూర్త‌యింది. ఇక‌, ఏపీలో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌ట‌మే మిగిలింది.

స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో గ‌ర్తింపు..అందుకే ఇక్క‌డ‌కు

స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో గ‌ర్తింపు..అందుకే ఇక్క‌డ‌కు

రోహిణీ సింధూరి వ్య‌క్తిత్వం ఎలాటిందో ఆమె క‌ర్నాట‌క‌లోని తుముకూరు, మండ్య, హసన్‌ జిల్లాల్లో ఆమె నిర్వర్తించిన విధులే ఆమె ఎంత కచ్చితమో చెప్తాయి. ఆమెలోని ఆ కచ్చితమే మంత్రి అధికార దుర్వినియోగానికి తాళం పెట్టించిం ది. గోమఠేశ్వరుని సాక్షిగా మస్తకాభిషేకాన్ని పరిపూర్ణం చేసింది. త‌న‌ను ప‌దే ప‌దే బ‌దిలీ చేయ‌టం పైన కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసారు. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి రోహిణీకి తిరిగి హ‌స‌న్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ ఇవ్వాల్సి వ‌చ్చింది.
త‌మ‌కు ఇబ్బందులు తెచ్చి పెట్టిన రోహిణిని త‌మకు పంపాలంటూ ఏపీ ముఖ్య‌మంత్రి కోర‌గానే క‌ర్నాట‌క ప్ర‌భుత్వం వెంట‌నే స‌మ్మ‌తించింది. ఏపీ ప్ర‌భుత్వం అధికారికంగా పంపిన నోట్ ను ఆమోదిస్తూ కేంద్ర సిబ్బంది..వ్య‌వ‌హారాల శాఖ కు నివేదించింది. అయితే..సివిల్ స‌ర్వీసు అధికారి అయినా జూనియ‌ర్ కావ‌టంతో అక్క‌డ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానే రోహిణి ఏపికి కేటాయింపు ప్ర‌క్రియ పూర్తి కానుంది.

రోహిణికి జ‌గ‌న్ అప్ప‌గించే బాధ్య‌త‌లు..

రోహిణికి జ‌గ‌న్ అప్ప‌గించే బాధ్య‌త‌లు..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌వంతులైన అధికారులు ఎక్క‌డ ఉన్న ఏపీకి తెచ్చుకొనేందుకు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టికే అజ‌య్ క‌ళ్లాం..పీవి ర‌మేష్..శ్యామ్యూల్‌ వంటి వారికి ప్రాధాన్య‌త ఇచ్చారు. ఇక‌, స్టీఫెన్ ర‌వీంద్ర‌.. శ్రీ ల‌క్ష్మిని ఏపికి కేటాయించే ప్ర‌క్రియ కేంద్రంలో కొన‌సాగుతూ ఉంది. ఇప్పుడు రోహిణీ సింధూరిని ఏపికి తీసుకువ‌చ్చిన త‌రువాత కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అందులో భాగంగా మండ‌ల స్థాయి నుండి జిల్లాల్లోని క‌లెక్ట‌ర్లు..ఎస్పీల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌తీ సోమ‌వారం "స‌్పంద‌న" నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ప్ర‌తీ మంగ‌ళ వారం జిల్లాల వారీగా స‌మ‌స్య‌లు..ప‌రిష్కారాల పైన ఆరా తీస్తున్నారు. దీనిని స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించ‌టం ద్వారా క్షేత్ర స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం మీద న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. దీనిని నిత్యం మానిట‌ర్ చేయ‌టం..త‌గిన నిర్ణ‌యాలు తీసుకోవ‌టంతో పాటుగా త‌న కార్యాల‌యంలోనూ "స‌్పంద‌న" ఏర్పాటు చేయ‌టం కోసం నిర్ణ‌యించారు. రాష్ట్ర స్థాయిలో ఈ మొత్తం వ్య‌వ‌హారం ప‌ర్య‌వేక్ష‌ణ‌..ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను రోహిణీ సింధూరికి అప్ప‌గించాల‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

English summary
AP Cm Jagan decided to take IAS Rohini Sindhuri in to his team form Karnataka. AP Govt already completed process with Karnataka Govt and she may be relieve shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X