వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం భావోద్వేగం: స‌భ‌లో జ‌గ‌న్‌..చంద్ర‌బాబు ఎలా ఉన్నారంటే: ప‌్రారంభ‌మైన అసెంబ్లీ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. స‌భ్యులంతా త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి అసెంబ్లీకి త‌ర‌లి వ‌చ్చారు. ప్రొటెం స్పీక‌ర్ స‌భ్యుల‌తో ఎమ్మెల్యేలుగా ప్ర‌మాణ స్వీకారం చేయిస్తున్నారు. అయితే, అంద‌రి దృష్టి మాత్రం స‌భ‌లో వారి ద్ద‌రి మీద‌నే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు. తొలుత ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఆ స‌మ‌యంలో స‌భ్యుల‌తో స‌హా..చంద్ర‌బాబు..టీడీపీ నేత‌లకు అభివాదం చేసారు. ఆ త‌రువాత చంద్ర‌బాబు సైతం ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఇక‌..మంత్రులు..మ‌హిళా స‌భ్యులు..అక్ష‌ర క్ర‌మంలో మిగిలిన స‌భ్యులు సాయంత్రానికి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ముగియ‌నుంది.

పార్ద‌సార‌ధి అసంతృప్తి..విప్ బాధ్య‌త‌ల‌కు స‌సేమిరా: మ‌రో ముగ్గురికి అవ‌కాశం: ఉత్త‌ర్వులు జారీ..!పార్ద‌సార‌ధి అసంతృప్తి..విప్ బాధ్య‌త‌ల‌కు స‌సేమిరా: మ‌రో ముగ్గురికి అవ‌కాశం: ఉత్త‌ర్వులు జారీ..!

Recommended Video

శాసన సభ లో ముఖ్యమంత్రిగా జగన్
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ భావోద్వేగం...

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ భావోద్వేగం...

స‌రిగ్గా 10.55 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రిగా తొలి సారిగా అసెంబ్లీకి జ‌గ‌న్ చేరుకున్నారు. ఆయ‌న‌కు వేద మంత్రాల‌తో పండితులు స్వాగ‌తం ప‌లికారు. ముఖ్య‌మంత్రి ఛాంబ‌ర్‌లో పూజ‌లు చేసారు. ఆ వెంట‌నే ఖ‌చ్చితంగా 11.05 గంట‌ల‌కు అసెంబ్లీ హాల్‌లోకి అడుగు పెట్టారు. ప్రొటెం స్పీక‌ర్ వ‌చ్చిన వెంట‌నే జాతీయ గీతం..ఆ త‌రువాత స్పీక‌ర్ ఎన్నిక నోటిఫి కేష‌న్ జారీ చేసారు. స‌భ్యులుగా ప్ర‌మాణ స్వీకార తీరు తెన్నులు వివ‌రించారు. ఆ వెంట‌నే ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ త‌న సీటు నుండి లేచి స‌భా కార్య‌ద‌ర్శి టేబుల్ వ‌ద్ద‌కు చేరారు. ఆ స‌మ‌యంలో వైసీపీ స‌భ్యులంతా బ‌ల్ల‌లు చ‌రుస్తూ సీఎం కు అభినంద‌న‌లు తెలిపారు. సీఎం అంద‌రికీ అభివాదం చేసుకుంటూ వెళ్లి ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేసారు. స‌భలో ముఖ్య‌మంత్రి సీట్లో ఆశీనులైన స‌మ‌యం నుండి ప్ర‌మాణ స్వీకారం పూర్త‌య్యే వ‌ర‌కూ జ‌గ‌న్‌లో భావోద్వేగం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఒక ర‌క‌మైన సంతోషం తొణికిస‌లాడింది. ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో త‌న పేరు చెప్పే స‌మ‌యంలో జ‌గ‌న్‌లో భావోద్వేగం స్ప‌ష్టంగా క‌నిపించింది.

తొలుత జ‌గ‌న్‌..త‌రువాత చంద్ర‌బాబు..

తొలుత జ‌గ‌న్‌..త‌రువాత చంద్ర‌బాబు..

ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ తొలుత శాస‌న స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఆ వెంట‌నే ప్ర‌తిపక్ష నేత హోదా లో చంద్ర‌బాబు పేరు ప్రొటెం స్పీక‌ర్ పిలిచారు. చంద్ర‌బాబు ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. ప్రొటెం స్పీక‌ర్‌కు అభివాదం చేసి వెళ్లి త‌న సీట్లో కూర్చుండి పోయారు. ఆ త‌రువాత అయిదుగురు ఉప ముఖ్య‌మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేసారు. త‌రువాత వ‌రుస‌గా ఇర‌వై మంది ఎమ్మెల్య‌ల‌తో ప్ర‌మాణం చేసారు. ఇక‌, వీరితో ప్ర‌మాణ స్వీకారం పూర్త‌యిన వెంట‌నే..అధికార‌-ప్ర‌తిప‌క్ష స‌భ్యుల్లో ముందుగా మ‌హిళ‌లు..ఆ త‌రువాత పురుష ఎమ్మెల్యేల‌నున అక్ష‌ర క్ర‌మంలో ప్ర‌మాణ స్వీకారానికి ప్రొటెం స్పీక‌ర్ ఆహ్వానిస్తున్నారు. మొత్తం స‌భ్యుల‌తో తొలి రోజే ప్ర‌మాణ స్వీకారాల‌న్నీ పూర్తి చేయించాల‌ని నిర్ణ‌యించారు.

రోజా..కొడాలి నాని..అవంతి వైపే వారి చూపులు..

టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో స‌భ‌లో వారితో ఛాలెంజ్‌లు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా..నేటి మంత్రి కొడాలి నాని..టీడీపీ నుండి వైసీపీలో చేరి మంత్రి అయిన అవంతి శ్రీనివాస రావు ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో టీడీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు వారి వైపే దృష్టి పెట్టారు. అదే విధంగా.. వైసీపీ స‌భ్యులు వారు ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో టీడీపీ బెంచ్‌ల వైపే ఆస‌క్తిగా గ‌మినిస్తూ క‌నిపించారు. మ‌ధ్నాహ్నం కొత్త స్పీక‌ర్‌గా త‌మ్మినేని సీతారాం నామినేష‌న్ కార్య క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని.. ఏక‌గ్రీవం అయ్యేందుకు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌భుత్వం నుండి ప్ర‌తిప‌క్షానికి స‌మాచారం పంపారు. మ‌ధ్నాహ్నం త‌మ్మినేని సీతారాం స్పీక‌ర్‌గా నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి సీఎం జ‌గ‌న్ హాజ‌రు కానున్నారు. గురువారం స‌భ‌లో ప్రొటెం స్పీక‌ర్ నూత‌న స్పీక‌ర్ ఎన్నిక ప్ర‌క‌టించ‌నున్నారు.

English summary
AP Cm Jagan emotional in taking oath as MLA in Assembly. AP Assembly sessions start to day. After Jagan opposition leader Chandra Babu taken oath as MLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X