వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కు కోర్టులో మినహాయింపు లభిస్తుందా!! పిటీషన్ పై విచారణ..సుప్రీం చెప్పిందేంటి..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కోర్టు హాజరునకు మినహాయింపు కోరనున్న జగన్ || Oneindia Telugu

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో లభిస్తుందా..లేదా ఇప్పుడు రాజకీయంగా సాగుతున్న ఆసక్తి కర చర్చ. అక్రమాస్తుల కేసులో ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సిన జగన్..తాను ముఖ్యమంత్రిగా ఉండటంతో పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉందని..తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన సీబీఐ కోర్టు శుక్రవారం విచారించే అవకాశం ఉంది. గతంలోనూ ఒక సారి ఇదే రకమైన పిటీషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించగా..హైకోర్టు సమర్ధించింది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ అనంతరం కోర్టు ఏ రకమైన మార్గదర్శకాలు జారీ చేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.

సీఎం జగన్ పైన మాజీ జేడీ ప్రశంసలు: పవన్ అభిప్రాయలకు భిన్నంగా..లక్ష్మీ నారాయణ ఇలా..!! సీఎం జగన్ పైన మాజీ జేడీ ప్రశంసలు: పవన్ అభిప్రాయలకు భిన్నంగా..లక్ష్మీ నారాయణ ఇలా..!!

సీబీఐ కోర్టులో జగన్ పిటీషన్..

సీబీఐ కోర్టులో జగన్ పిటీషన్..

ఏపీ సీఎంగా అధికారిక విధుల్లో బిజీగా ఉన్నందున తన వ్యక్తిగత హాజరునకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టును జగన్‌ అభ్యర్దించారు. తన తరఫున న్యాయవాది జి.అశోక్‌ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 కింద హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా తాను అధికారిక వ్యవహారాల్లో పాల్గొనాలల్సి ఉంటుందని ..అదే సమయంల ఎక్కువగా పరిపాలనకు సమాయం కేటాయించాల్సి ఉంటుందని జగన్ తన పిటీషన్ లో వివరించారు. దీంతో పాటుగా తరచుగా హైదరాబాద్‌లో కోర్టు విచారణకు హాజరుకావడం వల్ల పరిపాలన దెబ్బతినే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదని... సీఎం హోదాలో ఉన్నందున కోర్టుకు హాజరుకావాలంటే ప్రొటోకాల్‌తోపాటు భద్రతకు భారీగా వ్యయం అవుతుందని సీఎం జగన్ తన పిటిషన్‌లో వివరించారు. తన వ్యక్తిగత హాజరు అవసరమని భావించి కోర్టు ఆదేశించినప్పుడు తప్పకుండా వస్తానంటూ పిటీషన్ లో చెప్పుకొచ్చారు. ఇక, దీని మీద శుక్రవారం సీబీఐ కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తన హాజరు గురించి చేసిన అభ్యర్ధన పైన ఏ రకంగా స్పందిస్తుందీ.. ముఖ్యమంత్రి విన్నపాన్ని అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

గతంలో తిరస్కరణ..సుప్రీం చెప్పిందేంటి..

గతంలో తిరస్కరణ..సుప్రీం చెప్పిందేంటి..

అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్ ప్రతీ శుక్రవారం కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి కొన్ని సందర్భాల్లో ఆయన దాఖలు చేసిన పిటీషన్లను కోర్టు అనుమతించింది. పాదయాత్ర సమయంలోనూ జగన్ కోర్టుకు పలుమార్లు పిటీషన్ దాఖలు చేసి..గైర్హాజరీకి అనుమతి పొందారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత తాను కోర్టుకు హాజరు కావలంటే ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. పిటీషన్ లో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును జగన్ న్యాయవాది పిటీషన్ లో ప్రస్తావించారు. ప్రతి వాయిదాకు నిందితుల హాజరు అక్కర్లేదని బసవరాజ్‌ ఆర్‌.పాటిల్‌, భాస్కర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం విచారించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను 2014లో ఇదే కోర్టు తిరస్కరించగా హైకోర్టు సమర్థించింది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండటం..జగన్ చెబుతున్న కారణాలు పరిశీలన చేసిన తరువాత కోర్టు తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తి నెలకొని ఉంది.

రాజకీయంగా చర్చకు అవకాశం...

రాజకీయంగా చర్చకు అవకాశం...

ముఖ్యమంత్రి జగన్ కోర్టు హాజరు పైన రాజకీయంగానూ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచార సమయంలోనూ టీడీపీ అధినేత మొదలు అనేక మంది నేతలు ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రచారం చేసారు. ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రతీ శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కుతారా అని ప్రశ్నించారు. జగనజ్ పైన కేసులు క్లియర్ అయిన తరువాత ఆయన సీఎం అయితే తమకు అభ్యంతరం లేదని.. ముందుగా కేసుల్లో తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ చేసారు. అయితే, జగన్ కు ఏపీ ప్రజలు అనూహ్య మెజార్టీ కట్టబెట్టారు. దీని ద్వారా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తాను కోర్టుకు హాజరవ్వాలంటే ఎదురయ్యే సమస్యలను తన పిటీషన్ లో సీఎం జగన్ వివరించారు. మరి..కోర్టు దీని పైన విచారణ తరువాత ఏ నిర్ణయం ప్రకటిస్తుందనేది చూడాలి.

English summary
AP CM Jagan filed petition in CBI court to permit his lawyerin place of him for court. Jagan says as CM he have to concentrate on Administration. With this reason permit his lawyer for court proceedings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X