వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ మీద ప్రేమ‌లేదు..మంచివాడు: ఏపీ ప్ర‌యోజ‌నాల‌ కోస‌మే: చ‌ంద్ర‌బాబు చెప్పినా..జ‌గ‌న్ క్లారిటీ...!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ‌తో సంబంధాలు..కేసీఆర్‌తో స‌ఖ్య‌త‌..నీటి పంప‌కాల పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శాస‌న‌స‌భ‌లో క్లారిటీ ఇచ్చారు.
కేసీఆర్ అంటే త‌న‌కు ప్ర‌త్యేకంగా ప్రేమ లేద‌ని..ఆయ‌న మంచివాడ‌ని..మంచి మ‌న‌సుతో ముందుకు వ‌చ్చిన‌ప్పుడు స్వాగ‌తించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఏపీ-తెలంగాణ ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాల కోస‌మే ఇద్ద‌రం చర్చిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసారు. ఏపీకి మేలు జ‌రుగుతుందంట‌నే ఏ నిర్ణ‌యంలో అయినా ముందుకు వెళ్తామ‌ని..లేకుంటే నిలిపివేస్తామ ని తేల్చి చెప్పారు. తెలంగాణ‌తో క‌లిసి నీటి వినియోగం అంశంలో చంద్ర‌బాబు చేసే సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసు కుంటామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శాస‌న‌స‌భ‌లో స్ప‌ష్టం చేసారు.

కేసీఆర్‌తో స‌త్సంబంధాలు అవ‌స‌రం..

కేసీఆర్‌తో స‌త్సంబంధాలు అవ‌స‌రం..

పొరుగు రాష్ట్రంతో స‌త్సంబందాలు అవ‌స‌ర‌మ‌ని..ఇచ్చి పుచ్చుకొనే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించార‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శాస‌న‌స‌భ‌లో పేర్కొన్నారు. గోదావరి జలాల వినియోగంపై అసెంబ్లీలో చర్చ జ‌రిగింది. కేవలం 12 శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే మన ఆధీనం లో ఉంటాయని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి పూర్తి చేశారన్నారు. ప్రాజెక్ట్ కడుతుం టే ఇక్కడ చంద్రబాబు ఉండి ఏం చేయగలిగారని నిలదీశారు. మనది దిగువ రాష్ట్రం.. ఎగువ రాష్ట్రం వదిలితేనే మన కు నీళ్లు వస్తాయని చెప్పారు. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని తెలిపారు. గుట్టల మధ్య డ్యాములు కట్టే కాలం పోయిందన్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ బ్యారేజీలు కడుతున్నారని వివరించారు. కాళేశ్వరం దిగువన 17 బ్యారేజీలు కట్టారని గుర్తు చేసారు. ఏపీకి ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటేనే ముందుకు వెళ్తామ‌ని..అదే స‌మ‌యంలో ఏపీకి న‌ష్టం జ‌రిగేలా ఉంటే అడుగు ముంద‌కేయ‌మ‌ని తేల్చి చెప్పారు.

జగన్ మాటలకు చేతలకు పొంతన లేదు.. ప్రభుత్వ వైఖరి వల్లే జగన్ మాటలకు చేతలకు పొంతన లేదు.. ప్రభుత్వ వైఖరి వల్లే

చంద్ర‌బాబు సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి..

చంద్ర‌బాబు సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి..

తెలుగు వాళ్లమంతా ఒకటిగా ఉండాలని కోరారు. ఇరు రాష్ట్రాల్లోని రైతాంగం, ప్రజలు సాగునీరు, తాగునీటికి ఇబ్బం దిపడకూడదన్నారు. స‌దుద్దేశంతో ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నామ‌న్నారు. ఐదేళ్ల తర్వాత మన పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం లేదంటూ మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా లాభం లేదని విమర్శించారు. సాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లు రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి అని పేర్కొన్నారు. కలిసి కట్టుగా అడుగులు వేస్తే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని వివ‌రించారు. కరవుతో జిల్లాలు అల్లాడుతుంటే.. రాజకీయాలే కావాలి అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తుందని ఆరోపించా రు. ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు కొన్ని అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేసార‌ని..అస‌లు నీరు మ‌న‌కు రాదు అనుకుంటే చ‌ర్చ‌లు ఎందుకు చేస్తామ‌ని ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో తాము మాత్రం ప్రతిపక్షం సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

Recommended Video

చంద్రబాబు మీకు బుద్ధి జ్ఞానం లేవు - జగన్
వృధా నీటిని కాపాడుకుంటేనే ప్ర‌యోజ‌నం..

వృధా నీటిని కాపాడుకుంటేనే ప్ర‌యోజ‌నం..

ఇదే అంశం పైన టీడీపీ నుండి తొలుత ప‌య్యావుల కేశ‌వ్ మాట్లాడారు. స్పీక‌ర్ చంద్రబాబును సైతం మాట్లాడాలంటూ సూచించారు. దీంతో..వైసీపీ ప్ర‌భుత్వానికి త‌మ మీద చాలా ప్రేమ ఉంద‌ని..తాను అడ‌గ‌కుండానే మైక్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంలో నీటి ఒప్పందాలు చేసుకొనే స‌మ‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స రం ఉంటుంద‌న్నారు. నీటి సమస్య చాలా సున్నితమైన అంశమన్నారు. నీళ్లన్ని పోలవరానికి వచ్చి సముద్రంలో కలుస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వృథా నీటిని కాపాడుకోవాలన్నదే తమ తపన అని స్పష్టం చేశారు. నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్ర‌స్తుతం సంబంధాలు బాగానే ఉన్న‌ప్పుడు అంతా బాగుంటుంద‌ని..భ‌విష్య‌త్‌ల ఈ ఒప్పందాలు అమ‌లు పైనే కొన్ని అనుమానాలు ఉంటాయ‌ని చెప్పుకొచ్చారు.

English summary
AP CM Jagan given clarity on Relations with Telangana Cm KCr and usage of Godavari Water for both states. In Assembly Cm Jagan stated that only for AP benefit this proposal in on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X