వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ విజయంపై అమెరికాలో ఇలా :రెడ్ టేపిజం ఉండదు : యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశంలో..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశంలో జగన్ || Jagan Requests Global Investors To Invest In Ap

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తొలి రోజు అమెరికా పర్యటనలో కీలక అధికారులతో సమావేశమయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్థన్‌ ష్రింగ్లాతో సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రసంగించారు. పరిశ్రమ పెట్టేందుకు ఒక్క దరఖాస్తు చేసుకుంటే చాలని, వారికి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేలా ముఖ్యమంత్రి కార్యాలయమే దగ్గరుండి పర్యవేక్షిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి వాషింగ్టన్‌ డీసీలో ఘన స్వాగతం లభించింది. తాజా ఎన్నికల్లో జగన్ విజయం సాధించిన విధానం.. ఏపీలో బలమైన ప్రభుత్వం ఏర్పడిన విధానం గురించి యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంతర్జాతీయ వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెశిడెంట్ రాబ్ ష్రోడర్ ప్రస్తావిస్తూ అభినందించారు.

ఒక్క దరఖాస్తు చాలు..

ఒక్క దరఖాస్తు చాలు..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనలో భారత రాయబారి ఆహ్వానం మేరకు ఆయన ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు నెలకొల్పాలనుకునేవారికి తమ ప్రభుత్వంలో రేడ్‌టేపిజం అడ్డంకులేవీ ఉండవని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేసారు. వాషింగ్టన్‌ డీసీలో ముఖ్యమంత్రి జగన్ కు ఘన స్వాగతం లభించింది. అక్కడ జరిగిన యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్థన్‌ ష్రింగ్లాతో సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రసంగించారు. పరిశ్రమ పెట్టేందుకు ఒక్క దరఖాస్తు చేసుకుంటే చాలని.. వారికి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేలా ముఖ్యమంత్రి కార్యాలయమే దగ్గరుండి పర్యవేక్షిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. తాము ఏర్పాటు చేసిన ఇన్వెస్టెమెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ అథారిటీ (ఇప్మా) పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్తు, నీరు సమకూరుస్తుందని చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాలుగా సాయం అందిస్తామని ప్రకటించారు.

మీ భాగస్వామ్యం ఏపీకి అవసరం..

మీ భాగస్వామ్యం ఏపీకి అవసరం..

ముఖ్యమంత్రి జగన్ ఏపీలో పారిశ్రామిక వేత్తలకు ఉన్న అనుకూల వాతావరణం..పరిస్థితుల గురించి వివరించారు. ఏపీలో సుదీర్ఘమైన తీరప్రాంతం ఉందని... కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నామని ప్రకటించారు. వీటిలో భాగస్వాములు కావాలంటూ ఆహ్వానించారు. మెట్రోరైళ్లు..బకింగ్‌హామ్‌ కాలువ పునరుద్ధరణ..విద్యుత్తు బస్సులు..వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం.. వ్యవసాయ రంగంలో పరిశోధనలు.. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ విస్తరణ.. ఆక్వా ఉత్పత్తులకు మార్కెట్‌ విస్తృతిలో అపార అవకాశాలున్నాయంటూ ముఖ్యమంత్రి అంకెలతో సహా విశ్లేషణ చేసారు . నాణ్యత.. అధిక దిగుబడులు సాధించేందుకు తాము చేసే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతోనూ, పొరుగు రాష్ట్రాలతోనూ మాకు సత్సంబంధాలు ఉన్నాయని జగన్‌ వివరించారు. ఏపీలో ఉన్న వనరులు..వాటి సద్వినియోగం ద్వారా అన్ని రకాలుగా ఏపీ వేగంగా పురోగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

జగన్ విజయం గురించి ప్రస్తావిస్తూ..

జగన్ విజయం గురించి ప్రస్తావిస్తూ..

తాజా ఎన్నికల్లో జగన్‌ సాధించిన విజయాన్నియూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాబ్‌ ష్రోడర్‌ ప్రస్తావించారు. ఏపీలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని అభినందించారు. జగన్ నాయకత్వం లోని ప్రభుత్వం అమెరికా-ఆంధ్రప్రదేశ్‌ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలన్న భారత్‌ ఆకాంక్షకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేసారు. కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన పీపీఏల గురించి ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ వివరించారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్షతో విద్యుత్తు పంపిణీ సంస్థలు నిలదొక్కుకుంటాయని తద్వారా పరిశ్రమలపై విద్యుత్తు ఛార్జీల భారం తగ్గుతుందని చెప్పుకొచ్చారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం, కడపలో ఉక్కు కర్మాగారం, కోస్తాతీరంలో రిఫైనరీ ప్రాజెక్టు, బకింగ్‌హామ్‌ కాలవ పునరుద్ధరణ తదితర ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలుగా చేసుకుందన్నారు.

English summary
AP Cm Jagan invited US invetors for investments in AP. Jagan Assured indrustiralists for total co operation from state govt.With single application total permissions will be cleared in single window.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X