• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీకి చంద్ర‌బాబు అవినీతి చిట్టా..ప‌్ర‌క్షాళ‌న కోస‌మే: క‌ష్టాల్లో ఉన్నాం..ఆదుకోండి: ప‌్ర‌ధానికి జ‌గ‌

|

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. పార్ల‌మెంట్‌లోని ప్ర‌ధాని కార్యాల‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 40 నిమిషాల సేపు భేటీ జ‌రిగింది. తొలుత పార్టీ ఎంపీలు..అధికారుల‌తో క‌లిసి సీఎం ప్ర‌ధానిని క‌లిసారు. ఆ త‌రువాత అధికారుల‌తో క‌లిసి విన‌తి పత్రం స‌మ‌ర్పించారు. అధికారులు వివ‌ర‌ణ త‌రువాత‌.. ముఖ్య‌మంత్రి - ప్ర‌ధాని మ‌ధ్య ఏకాంత సమావేశం జ‌రిగింది. ఆ భేటీలో తాను ఈ మ‌ధ్య కాలంలో తీసుకున్న నిర్ణ‌యాలు..అందుకు దారి తీసిన ప‌రిస్థితుల‌ను జ‌గ‌న్ వివ‌రించిన‌ట్లు స‌మాచారం. చంద్ర‌బాబు హయాంలో జిరిగిన అవినీతి నివేదిక అందించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో..ఏపీ చాలా క‌ష్టాల్లో ఉంద‌ని ఆదుకోవాలంటూ జ‌గ‌న్ ప్ర‌ధానిని అభ్య‌ర్దించారు.

ప్ర‌దానితో జ‌గ‌న్ ఏకాంత స‌మావేశం..

ప్ర‌దానితో జ‌గ‌న్ ఏకాంత స‌మావేశం..

పార్లమెంట్‌లో ప్ర‌ధాని కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మావేశ‌య్యారు. పార్టీ ఎంపీలు..అధికారుల‌తో క‌లిసి ఆయ‌న ప్ర‌ధాని వ‌ద్ద‌కు వెళ్లారు. పార్టీ ఎంపీల‌తో ప‌రిచ‌యం ముగిసిన త‌రువాత వారు బ‌య‌ట కూర్చోన్నారు. ఏపీ ఆర్దిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రావ‌త్‌తో పాటుగా పీవీ ర‌మేష్..శ్రీలక్ష్మీ సైతం సీఎంతో క‌లిసి ప్ర‌ధాని వ‌ద్ద‌కు వ‌చ్చారు. అధికారు లు త‌యారు చేసిన రాష్ట్ర అర్దిక ప‌రిస్థితి..పెండింగ్ హామీల అమ‌లు గురించి నివేదిక అందించారు. ఇక‌..ప్ర‌ధాని మోదీ .. సీఎం జ‌గ‌న్ మ‌ధ్య దాదాపు 30 నిమిషాల సేపు ఏకాంత స‌మావేశం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో రాష్ట్రంలో ప‌రిస్థితుల గురించి జ‌గ‌న్ ఓపెన్‌గా ప్ర‌ధానికి వివ‌రించిన‌ట్లు స‌మాచారం. ఏపీ ఆర్దికంగా క‌ష్టాల్లో ఉంద‌ని..ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేంద్రం ఆదుకోకుంటే చాలా ఇబ్బందులు ప‌డుతామంటూ రాష్ట్ర అర్దిక ప‌రిస్థితిని జ‌గ‌న్ ఏక‌రువు పెట్టిన‌ట్లు తెలిసింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం రాష్ట్ర అప్పులు మొత్తం రెండున్నార ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింద‌ని..కేంద్ర సాయం మీద‌నే ఆశ లు పెట్టుకున్నామంటూ జ‌గ‌న్ అభ్య‌ర్దించార‌ని స‌మాచారం.

ఆ నిర్ణ‌యాలు ఎందుకంటే..

ఆ నిర్ణ‌యాలు ఎందుకంటే..

తాను తీసుకుంటున్న నిర్ణ‌యాల పైన కేంద్ర మంత్రులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్త‌న్న స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ నేరుగా ప్ర‌ధానికి వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. పీపీఏల విష‌యంలో ఏ ర‌కంగా అవినీతి జ‌రిగింద‌నే దాని పైన జ‌గ‌న్ ఆధారా ల‌తో స‌హా లెక్క‌లు స‌మ‌ర్పించార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. అదే విధంగారాజ‌ధాని అమ‌రావ‌తి.. పోల‌వ‌రం నిర్మా ణంలో నిపుణ‌లు క‌మి టీ వేసిన అంచ‌నాల ప్ర‌కారం రెండు వేల కోట్ల‌కు పైగా అవినీతి జ‌రిగింద‌నే విష‌యాన్ని ప్ర‌ధానికి వివ‌రించారు. ఇక‌, ఆ ప్రాజెక్టు నిర్మాణం ప‌నులు.. న‌వ‌యుగ‌ను త‌ప్పించ‌టం..భ‌విష్య‌త్‌లో రివ‌ర్స్ టెండ‌రింగ్ గురించి ప్ర‌ధానికి చెప్పిన‌ట్లు గా స‌మాచారం. అవినీతి జరిగిన‌ట్లు రుజువు అయితే చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ప్ర‌ధాని వ్యా ఖ్యానించిన‌ట్లుగా చెబు తున్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల గురించి స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని..త‌ప్ప‌కుండా అండ‌గా నిలుస్తామ‌ని ప్ర‌ధాని హామీ ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం.

పీఎంఓ అధికారుల‌తో సుదీర్ఘ స‌మావేశం..

పీఎంఓ అధికారుల‌తో సుదీర్ఘ స‌మావేశం..

ప్ర‌ధానితో భేటీకి ముందు సీఎం జ‌గ‌న్ పీఎంఓ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. కేంద్రం నుండి రావాల్సిన పెండింగ్ నిధుల గురించి వారితో చ‌ర్చించారు. మోదీ సూచ‌న మేర‌కు ముందుగా వారికి ఏపీ అవ‌స‌రాల గురించి నివేదించారు. అందులో రెవిన్యూ లోటుగా ఉన్న 22వేల కోట్ల‌ను విడుద‌ల చేయాల‌ని అభ్య‌ర్దించారు. పోల‌వ‌రం నిధుల రీయంబ‌ర్స్ మెంట్ కింద రావాల్సిన రూ. 5,103 కోట్ల విడుద‌ల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఏపీ అవ‌స‌రాలు ఏంటి..ఇప్పుడు కేంద్రం నుండి ఏం ఆశిస్తుందీ పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వివ‌రించారు. ఒక నివేదిక‌ను అందించారు.

English summary
AP Cm Jagan met PM Modi in Parliament request for central assistance for AP. He submitted representation with state needs in all sectors. At the same time Modi and Jagan one to one meet taken place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X