వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రప‌తితో సీఎం జ‌గ‌న్ భేటీ: తొలిసారిగా వెంక‌య్య‌తో ఆత్మీయంగా : స‌హకారం కోరుతూ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాష్ట్రప‌తి రామ్‌నాధ్ కోవింద్‌తో స‌మావేశ‌మయ్యారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్రప‌తిత‌ని సీఎం హోదాలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసారు. అంత‌కు ముందు ఉప రాష్ట్రప‌తి..రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంకయ్య నాయుడుతో జ‌గ‌న్ భేటీ అయ్యారు. వెంక‌య్య నాయుడుతో జ‌గ‌న్ భేటీ అవ‌టం ఇదే తొలి సారి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ. ...టీడీపీ మ‌ద్య పొత్తు కుద‌ర్చ‌టంలో వెంక‌య్య నాయుడు కీల‌క పాత్ర పోషించారు. నాటి ఎన్నిక‌ల ప్ర‌చంలోనూ జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసారు. ఆయ‌న ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది. ఇప్పుడు ముఖ్య‌మంత్రి హోదాలో ఉప‌రాష్ట్రప‌తిని క‌లిసి ఏపి అంశాల పైన చ‌ర్చించారు.

రాష్ట్రప‌తి కోవింద్‌తో జ‌గ‌న్ భేటీ..

రాష్ట్రప‌తి కోవింద్‌తో జ‌గ‌న్ భేటీ..

రాష్ట్రప‌తి రామ్‌నాద్ కోవింద్‌తో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో రాష్ట్రప‌తిని క‌లిసిన జ‌గ‌న్ ఆ స‌మ‌యంలో ఏపీలో అధికార పార్టీ తీరు పైన ఫిర్యాదు చేసారు. ఇక‌, గ‌త నెల‌లో రాష్ట్రప‌తి తిరుమ‌ల‌లో శ్రీవారి ద‌ర్శ‌నం..శ్రీహ‌రికోట‌లో ఇస్రో ప‌రిశోద‌న కోసం ఏపీకి వ‌చ్చిన స‌మ‌యంలొ గ‌వ‌ర్న‌ర్‌తో క‌లిసి సీఎం జ‌గ‌న్ స్వాగ‌తం ప‌లికారు. అయితే, ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత రాష్ట్రప‌తితో అధికారికంగా స‌మావేశం కాలేదు. దీంతో..ఇప్పుడు ఢిల్లీలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం వ‌చ్చిన జ‌గ‌న్ రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో కోవింద్‌తో స‌మావేశ‌మ‌య్యా రు. త‌న ప్ర‌భుత్వంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి వివ‌రించారు. రాష్ట్రప‌తి సైతం ఏపీ అభివృద్ది చెందాల‌ని ఆకాంక్షిం చిన‌ట్లుగా తెలుస్తోంది. పార్టీ ఎంపీల‌తో క‌లిసి ఆయ‌న రాష్ట్రప‌తిని కలిసారు.

వెంకయ్య నాయుడుతో ఆత్మీయంగా..

వెంకయ్య నాయుడుతో ఆత్మీయంగా..

వైయ‌స్ జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నాటి నుండి ఇప్ప‌టి వ‌రకు వెంక‌య్య నాయుడుతో ఎప్పుడూ భేటీ కాలేదు. వైసీపీ పార్టీ ఏర్పాటు నుండి వెంక‌య్య‌ను క‌ల‌వ‌లేదు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో టీడీపీ-బీజేపీ-ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తు లో వెంక‌య్య నాయుడు కీల‌క పాత్ర పోషించారు. ఆ స‌మ‌యంలో ప్రత్య‌ర్ది పార్టీగా వైసీపీ మీద విమర్శ‌లు చేసారు. ఇక‌, గ‌తం లో రాష్ట్రప‌తి..ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్డీఏ నిర్ణ‌యానికి వైసీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఆ స‌మ యంలో తొలి సారి వెంక‌య్య‌..జ‌గ‌న్ క‌లుసుకున్నారు. అయినా..అప్పుడు ప‌ల‌క‌రింపుల‌కే ప‌రిమితం అయ్యారు. ఇక‌, ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌గ‌న్ పార్టీ ఎంపీల‌తో క‌లిసి వెంక‌య్య నాయుడును క‌లిసారు. ఆయ‌న‌తో ఏపీలో త‌మ ప్ర‌భుత్వంలో తీసుకుంటున్న చ‌ర్య‌లు వివ‌రించారు. శాలువా..తిరుమ‌ల శ్రీవారి బొమ్మ‌తో వెంక‌య్య‌ను స‌త్క‌రించారు.

ఏపీ అభివృద్దికి స‌హ‌క‌రించండి..

ఏపీ అభివృద్దికి స‌హ‌క‌రించండి..

ఈ భేటీలో ఏపీ అభివృద్దికి..కేంద్రం నుండి రావాల్సిన సాయం విష‌యంలో చొర‌వ చూపిస్తున్నందుకు ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఏపీకి రెవిన్యూ లోటు భ‌ర్తీ విష‌యంలో ప్ర‌ధానికి నివేదించామ‌ని..త‌న వంతు స‌హ‌కారం అందించాల‌ని వెంక‌య్య‌ను కోరారు. అదే విధంగా క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంట్‌.. పోర్టు ..వాట‌ర్ గ్రిడ్ కోసం కేంద్రం నుండి స‌హ‌కారం అందేలా తోడ్పాటు అందించాల‌ని అభ్య‌ర్దించారు. దీంతో పాటుగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప్ర‌స్తుత స్థితి గ‌తుల‌ను సైతం జ‌గ‌న్ వివ‌రించిన‌ట్లుగా స‌మాచారం. పోల‌వ‌రం నిధుల రీయంబ‌ర్స్ మెంట్‌లో భాగంగా అయిదే వేల కోట్ల వ‌ర‌కు రావాల్సి ఉంద‌ని జ‌గ‌న్ వివ‌రించారు. ఏపీ అభివృద్దికి త‌న వంతు స‌హ‌కా రం ఎప్పుడూ ఉంటుంద‌ని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

English summary
AP Cm Jagan met President Ramnath Kovidn and Vice Pesident Venkaiah Naidu in Delhi. Jagan requested for Venkaih Naidu co operation in Central Assistance for AP in pending assurances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X