వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో న్యాయశాఖా మంత్రితో భేటీ అయిన ఏపీ సీఎం జగన్... ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. మొన్న మోడీని కలిసి మాట్లాడిన జగన్ నిన్న మరోమారు ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఇక నేడు కూడా ఢిల్లీ లోనే ఉన్న జగన్ న్యాయ శాఖామంత్రితో భేటీ అయ్యారు.

జనసేనకు తలనొప్పిగా జగన్ హస్తిన టూర్లు .. రీజన్ ఇదేజనసేనకు తలనొప్పిగా జగన్ హస్తిన టూర్లు .. రీజన్ ఇదే

ఇక తాజాగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవటం , మళ్ళీ వెంటనే రెండు రోజుల వ్యవధిలోనే అమిత్ షాతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది .
ఇక మరోపక్క కేంద్రంలోని ఎన్డీయే తో దోస్తీ చేస్తుందని ప్రచారం జోరందుకుంటున్న వేళ సీఎం జగన్ కేంద్రమంత్రులతో భేటీపై ఆసక్తి నెలకొంది . ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో శనివారం భేటీ అయ్యారు.

 AP CM Jagan met with Minister of Justice Ravi Shankar Prasad in Delhi

ఇక ఆయన ఈ భేటీలో ఏపీలో శాసనమండలి రద్దు వ్యవహారం , కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై సీఎం జగన్‌ కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలుస్తుంది . ఏపీలో శాసనమండలి రద్దు చేసిన తీర్మానాన్ని పార్లమెంట్ కు పంపి త్వరిత గతిన ఆమోదం పొందేలా చెయ్యాలని సీఎం జగన్ అందుకు సంబంధించిన మంత్రులను కలుస్తున్నారు. ఇక శుక్రవారం హోంమంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్‌ జగన్‌ దాదాపు 40 నిముషాలపాటు సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిపారు.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan met Union law and Justice Minister Ravi Shankar Prasad on Saturday during a visit to Delhi. He said that during his visit, CM Jagan had discussed with the Union minister on the issue of abolition of the Legislative Council and the High Court's move to Kurnool. CM Jagan is meeting with the ministers to send a resolution to repeal the legislative session in AP and get it passed in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X