వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సీఎం జగన్ మోహన్‌రెడ్డి లేఖ...

|
Google Oneindia TeluguNews

ఏపి బొగ్గు కొరతను తీర్చేందుకు సింగరేణి సంస్థ నుండి బొగ్గు సరఫరాను పెంచాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు విజ్ఝప్తి చేస్తూ లేఖ రాశారు. మరోవైపు బోగ్గు సరఫరాకు ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడ చేయాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు కూడ సీఎం లేఖ రాశారు.

ఒడిశాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, మరియు కార్మికుల సమ్మెలు ఏపీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ప్రతిరోజు 70వేల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా జరగాల్సి ఉండగా, 45వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో పూర్తిస్థాయి థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 5050 మెగావాట్లు గా ఉంది. కాగా ఇందుకోసం ఒరిస్సాలోని మహనది కోల్ లిమిటెడ్ మరియు సింగరేణి థర్మల్ కేంద్రాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ప్రతి సంవత్సరం సుమారు 18 మిలియన్ టన్నుల బోగ్గును మహానది కోల్ లిమిటెడ్ సరఫరా చేయాల్సి ఉండగా వర్షాలు, సమ్మేల కారణంగా అక్కడ నుండి 57 శాతం మేర బొగ్గు రవాణ తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కోంది.

AP cm jagan mohan reddy has written to telangana cm kcr to allot coal adequate supply

రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడటంతో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణ చర్యలకు ఉపక్రమించారు. సింగరేణి నుంచి వస్తున్న 4 ర్యాకుల బొగ్గును, 9 ర్యాకులకు పెంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. దీంతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడ చేయాలని కేంద్రానికి లేఖ రాశారు.

English summary
AP cm jagan mohan reddy has written to telangana cm kcr along with central coal ministry to allot coal adequate supply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X