వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిపై రగడ..! సంచలన నిర్ణయం దిశగా సీఎం జగన్ అడుగులు...!!?

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏపి రాజధాని నిర్మాణంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపి ప్రలతో పాటు రాజధాని నిర్మాణంకోసం భూములు ఇచ్చిన రైతుల మోహాల్లో మాత్రం తెలయని ఆందోళన కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి మొహంలో రాజధాని అమరావతిలో ఉంటుందా..? తరలిపోతుందా అనే ప్రశ్నార్ధకమే కనిపిస్తోంది. అందుకు ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్టు పరిణమించాయి.

రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో కూడా అందరికి తెలిసిందే. అమరావతిలో రాజధాని నిర్మాణం సురక్షితం కాదంటూ ఆయన చేసిన కామెంట్స్ ను టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో దోనకొండను ఏపీ రాజధానిగా చేస్తుందనే ప్రచారం తారా స్థాయిలో నడుస్తోంది. అయితే ఇదే అంశంపై సంచలన నిర్ణయం దిశగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఇలాంటి క్లిష్ట సమస్యలు వస్తే రెఫరెండం (ప్రజల అభిప్రాయం) తీసుకునే సంప్రదాయం ఉంది.

 AP cm Jagan move towards a sensational decision In capitalcity dispute..!?

ఇప్పుడు అదే రెఫరెండాన్ని రాజధానిపై నిర్వహించడానికి ఏపీ సీఎం జగన్ సిద్దపడిపోతున్నట్టు సమాచారం. ఒకే దెబ్బకు రెండు పిట్టల వలే అటు టీడీపీ విష ప్రచారాన్ని ఎండగట్టడంతోపాటు ఇటు ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజధానిని నిర్మించడానికి జగన్ ఈ భారీ ఎత్తుగడ వేసినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు భారీ గోల్ మాల్ చేసినట్టు ఆరోపణలున్నాయి.

ల్యాండ్ పుల్లింగ్ అక్రమాలు సహా ఏ రైతు నుంచి ఎంత భూమి తీసుకున్నారు? స్వచ్ఛందంగా ఇచ్చారా? లాక్కున్నారా? ఏ ప్రైవేటు సంస్థలకు ఎంత కేటాయించారు అన్న విషయంపై సీఎం జగన్ అమరావతి సీఆర్డీఏ కమిషనర్ ను నివేదిక కోరారు. ఈ నివేదిక వచ్చాక జగన్ రెఫరెండం కోరి రాజధానిపై ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

English summary
CM Jagan Mohan Reddy has taken a key decision on the capital of Andhra Pradesh. There is a tradition of taking a referendum (people's opinion) if there are such difficult issues in abroad. Now the AP cm Jagan is going to be ready to handle the same reshuffle on the capital in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X