వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెస్ట్ సీఎంలలో జగన్ దూకుడు.. అదే ఆయన సీక్రెట్.. కేసీఆర్ ర్యాంక్ ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఓ ప్రముఖ జాతీయ న్యూస్‌ ఛానెల్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఈ సారి కూడా ఉత్తర్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో నిలిచారు. పాలనా పరంగా, పనితీరు పరంగా యోగీ ఆదిత్యనాథ్‌కు గతంలో కంటే ఈ సారి మరింత మెరుగయ్యారని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది.

అగ్రస్థానంలో యోగీ

అగ్రస్థానంలో యోగీ


ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మరోసారి ఉత్తమ సీఎంగా నిలిచారు. ఓ ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో యోగీ ఆదిత్యనాథ్ గతంలోకంటే ఆరు పర్సంటేజ్‌ పాయింట్లు మెరుగు చేసుకుని 24శాతం ఓట్లు దక్కించుకున్నారు. దీంతో బెస్ట్ సీఎంగా యోగీ వరుసగా మూడోసారి తొలిస్థానంలో నిలిచారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ మధ్య జరిగిన కిడ్నాప్ మరియు మర్డర్ కేసు ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. అయినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం యోగీకే ఓటు వేయడం విశేషం. ఇక తాజా సర్వేలో మొత్తం ఏడు మంది ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఆరుమంది ముఖ్యమంత్రులు బీజేపీ కాంగ్రెస్ పార్టీయేతర వారు ఉండటం మరో విశేషం.

ఏపీ సీఎం జగన్ దూకుడు

ఏపీ సీఎం జగన్ దూకుడు

ఇక తొలిస్థానంలో యోగీ ఉండగా.. రెండో స్థానంలో కేజ్రీవాల్ ఉన్నారు. మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఆయనకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడినట్లు సర్వే వెల్లడించింది. కరోనా కాలంలో అత్యధిక టెస్టులు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ ప్రభుత్వం రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు కరోనావైరస్‌ పోరుపై ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై కూడా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే వెల్లడించింది. ఇక ఆరోగ్యరంగానికి జగన్ సర్కార్ పెద్ద పీట వేశారని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. గత నెల జూలై 1న వెయ్యికిపైగా అంబులెన్స్‌లను సీఎం జగన్ ప్రారంభించారు. అయితే అభివృద్ధి పరంగా చూస్తే సీఎం జగన్‌కు మార్కులు పడాల్సిన స్థాయిలో పడలేదు. మరోవైపు జగన్ సర్కార్ తీసుకొచ్చిన నాడు నేడు పథకంపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం స్కూళ్లు హాస్పిటల్స్‌కు కొత్త రూపును తీసుకొస్తున్నారు.

జగన్ పనితీరు మరోసారి రుజువైంది

ఉత్తమ ముఖ్యమంత్రుల్లో దేశంలోనే ఏపీ సీఎం జగన్ మూడో స్థానంలో నిలిచారని తప్పకుండా ఒకరోజున అగ్రస్థానంలో జగన్ నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజల ప్రేమను అభిమానాన్ని జగన్ చూరగొన్నారని చెప్పేందుకు ఆయన ఎన్నికల్లో సాధించిన ఘనవిజయమే అని ఇప్పుడు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ముఖ్యమంత్రుల్లో మూడవ స్థానంలో నిలిచారని చెప్పేందుకు ఈ జాతీయ పత్రిక బయటపెట్టిన సర్వేనే నిదర్శనమని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Recommended Video

టార్గెట్ కర్ణాటక, కేరళ.. United Nations హెచ్చరిక || Oneindia Telugu
కేసీఆర్ ర్యాంకు ఎంతో తెలుసా..

కేసీఆర్ ర్యాంకు ఎంతో తెలుసా..

ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 3శాతం ఓట్లను మాత్రమే దక్కించుకున్నట్లు ఆ జాతీయ పత్రిక సర్వేలో వెల్లడించింది. కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, మరికొన్ని విధానాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో వెల్లడైంది. ఇక ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ మాత్రం అట్టడుగు స్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి నిలువగా ఒకప్పుడు వరుసగా మూడుసార్లు బెస్ట్ సీఎంగా నిలిచిన బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ 9శాతం ఓట్లతో నాలుగో స్థానానికి పడిపోయారు. ఈ ఏడాది జనవరిలో మమతా బెనర్జీ మరియు అరవింద్ కేజ్రీవాల్‌లు తొలిస్థానంలో నిలువగా వారిని బీట్ చేస్తూ యోగీ తొలిస్థానంకు ఎగబాకారు.

English summary
UP CM Yogi Adityanath occupied the top rank in best CM's conducted by Mood of the nation survey, while AP CM Jagan stood in the third position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X