గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ అదేశం..!!

|
Google Oneindia TeluguNews

ఆత్మహత్యకు పాల్పడిన మాజీ స్పీకర్..టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ను అదేశించారు. హైదారాబాద్ లోని తన నివాసంలో ఉరి వేసుకొని డాక్టర్ కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన భౌతిక కాయానికి ఉస్మానియాలో పోస్టు మార్టం నిర్వహించిన తరువాత పార్టీ కార్యాలయంలో ఉంచారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం గుంటూరు తరలించారు. సాయంత్రినికి నర్సరావుపేట కు తరలించి..బుధవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కోడెల మరణం పైన రాజకీయంగా దుమారం రేగుతోంది. అధికార పార్టీ వేధింపులే కారణమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను అధికార వైసీపీ నేతలు సైతం తప్పి కొట్టారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా..మరణించిన వ్యక్తి 36 ఏళ్లు రాజకీయ ప్రస్థానంతో పాటుగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. పలు మంత్రిపదవులు నిర్వహించిన వ్యక్తిగా.. రాష్ట్ర విభజన తరువాత తొలి స్పీకర్ గా పని చేసారు. దీంతో..ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటం సరైన విధానమని జగన్ నిర్ణయించారు. దీంతో..దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి సూచించారు. ఆ వెంటనే కోడెల కుటుంబ సభ్యులకు ఈ మేరకు సమాచారం అందించారు.

AP Cm jagan orderd CS Lv Subramanyam to organise Kodela funeral With the formalities of authority

బుధవారం కోడెల అంత్యక్రియలు..
కోడెల అంత్యక్రియలు బుధవారం నర్సరావుపేటలో జరగనున్నాయి. బంధువులు..అనుచరులు..అభిమానులు..పార్టీ శ్రేణులు కడసారి కోడెలను చూసేందుకు వీలుగా గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంతో పాటుగా.. నర్సరావుపేటలో ఆయన భౌతిక కాయం ఉంచనున్నారు. ఈ రోజు మధ్నాహ్నం నుండి సాయంత్రం వరకు గుంటూరులో.. రాత్రికి నర్సరావుపేట తరలిస్తారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో నర్సరావుపేట లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కోడెల మరణం పైన రాజకీయంగా అధికార..ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ నెలకొని ఉంది.

ఈ సమయంలో కోడెల సొంత నియోకవర్గంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. దీని పైన టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. అంతిమ యాత్రను అడ్డుకొనేందుకే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో ఇప్పటికే కోడెల మరణం పట్ల సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులను సానుభూతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇక, ఇప్పుడు కోడెల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు.

English summary
AP Cm jagan orderd CS Lv Subramanyam to organise Kodela funeral With the formalities of authority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X