వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ : ముందుగా అక్క‌డే ప్ర‌వాసాంధ్రుల‌తో: ముహూర్తం ఖ‌రారు..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత తొలి సారి జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్తున్నారు. గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న డిప్లొ మేటిక్ పాస్ పోర్టును స‌రెండ‌ర చేసారు. రెండు రోజుల క్రితం సీఎం జ‌గ‌న్ పాస్ పోర్టు కార్యాల‌యానికి వెళ్లి ముఖ్య‌మం త్రి హోదాలో డిప్లొమేటిక్ పాస్ పోర్టు స్వీక‌రించారు. అసెంబ్లీ స‌మావేశాలు పూర్త‌యిన త‌రువాత కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విదేశాల‌కు వెళ్ల‌నున్నారు. ఆ ప‌ర్య‌ట‌న‌లో తొలి సారిగా ముఖ్య‌మంత్రి హోదాలో ప్ర‌వాసాంధ్రుల‌తో పాటుగా.. పార్టీ ఎన్నారైల‌తో స‌మావేశం ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా అక్క‌డి వ్యాపార‌..వాణిజ్య‌..పారిశ్రామిక వేత్త‌ల‌తో సీఎం జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం ఖ‌రారైంది.

Recommended Video

సీఎం హోదాలో జగన్ తొలి విదేశీ పర్యటన ఖరారు

ఆగ‌స్టులో జ‌గ‌న్ అమెరికా ప‌ర్య‌ట‌న‌
ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ ఆగ‌స్టు 15 త‌రువాత అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సీఎం వెళ్ళ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆక్క‌డ ప్ర‌వాసాంధ్రులు..వైసీపీ ఎన్నారై విభాగం ఆహ్వానం మేర‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. తొలుత ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో వెళ్లాల‌ని భావించారు. అయితే, ముఖ్య‌మంత్రి రాక తెలుసుకున్న వైసీపీ ఎన్నారై విభాగం దీని పైన ముఖ్య‌మంత్రితో చ‌ర్చించారు. త‌మ విభాగం ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసామ‌ని..అందులో పాల్గొనాల‌ని ఆహ్వానించారు. దీనికి ముఖ్య‌మంత్రి అంగీక‌రించారు. ఇదే స‌మ‌యంలో ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ అమెరికాలోని వాణిజ్య వేత్త‌లు..పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసే ప్ర‌తిపాద‌న సీఎం కార్యాల‌యం వ‌ద్ద ప్ర‌తిపాదించిట్లు స‌మాచారం. దీని పైన ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి తో సైతం సంప్ర‌దింపులు కొన‌సాగుతున్నాయి. ఈ ప‌ర్య‌ట‌న‌లోనే పెట్టుబ‌డి దారుల‌తో క‌లిసి స‌మావేశంలో పాల్గొనేలా షెడ్యూల్ ఖ‌రారు చేస్తున్నారు. దీని పైన ముఖ్య‌మంత్రి తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

AP CM Jagan Planning to tour in USA in coming August second half along with family members

ఇక‌..పెట్టుబ‌డుల అన్వేష‌ణ కోసం..
జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే ఏపీలో పెట్టుబ‌డులు ఎవ‌రు పెడ‌తార‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే ఎద్దేవా చేసారు. దీంతో, ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం జ‌గ‌న్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది. ఖ‌చ్చింగా ఏపీలో పెట్టుబ‌డుల కోసం ప్ర‌త్యేకంగా పారిశ్రా మిక పాల‌సీ తీసుకొచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇక‌, కేంద్రం నుండి ప్ర‌త్యేక హోదా పైన అమ‌లు దిశ‌గా కార్యాచ ర‌ణ లేక‌పోవ‌టంతో ..దాని కోసం పోరాడుతూనే రాష్ట్ర స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనిలో భాగం గా ..ఉత్తమ‌మైన పారిశ్రామిక పాల‌సీని తీసుకొస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌రువాత పెట్టుబ‌డునుల ఆక‌ర్షించేందుకు కొత్త పాల‌సీనీ ఖ‌రారు చేయ‌నున్నారు. దీని ఆధారంగా పెట్టుబ‌డ‌ల అన్వేష‌ణ కోసం ముఖ్య‌మంత్రి విదేశీ ప‌ర్య‌ట‌న‌లకు స‌మాయత్తం అవుతున్నారు. దీని కోసం గ‌తంలో నిర్వ‌హించిన పార్ట‌న‌ర్ షిప్ స‌మ్మిట్ లా కాకుండా.. పూర్తి పార‌దర్శ‌కంగా నిర్వ‌హిస్తామ‌ని చెబుతున్నారు.

English summary
AP CM Jagan Planning to tour in USA in coming August second half along with family members. In this tour Jagan may meet with NRI's and also YCP NRI's wing. CM also planning to visit other countries to attract investments to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X