వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీపీఏల అస‌లు గుట్టు విప్పేసారు : స‌భ‌లోని పిలిచి..ఆధారాలతో స‌హా : స‌భ‌లో లెక్క‌ల చిట్టా విప్పిన జ‌గ

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తొలి నుండి చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఆధారాల‌ను జోడించారు. శాస‌న‌స‌భా వేదిక‌గా స్క్రీన్ పైన లెక్క ల‌ను వివ‌రిస్తూ విద్యుత్‌ కొనుగోళ్లుపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. విద్యుత్‌ కొనుగోలు ఒ ప్పందాల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ... గత ప్రభుత్వం అవసరం లేకున్నా అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసింద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌తీ ఏటా రూ.2766కోట్లు అదనంగా చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేసారంటూ ఫైర్ అ య్యారు. అంతుకు ముందు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు త‌మ పైన బుర‌ద చ‌ల్ల‌టం కోసం బుర‌ద‌లో కూరుకుపోతున్నార ని ఆరోపించారు.

 ప్ర‌భుత్వం త‌ప్పుడు స‌మాచారం ఇస్తోంది..

ప్ర‌భుత్వం త‌ప్పుడు స‌మాచారం ఇస్తోంది..

వాయిదా అనంత‌రం స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పీపీఏల అంశం లేవనెత్తారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా ఉంటే బాగుండేదీ..స‌భ‌లో లేకుండా బ‌య‌ట మాత్రం వీటి గురించి మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యా నించారు. ఆ వెంట‌నే చంద్ర‌బాబు స‌భ‌లోకి వ‌చ్చారు. వెంట‌నే పీపీఏల గురించి చంద్ర‌బాబు మాట్లాడారు. తాము విద్యు త్ సంస్క‌ర‌ణ‌కు బాట వేసామ‌ని..ఈఆర్సీని ఏర్పాటు చేసింది తామేన‌ని వివ‌రించారు. పీపీఏ ల‌పై వాస్త‌వాల‌ను వక్రీక రించార‌ని ఆరోపించారు. వీటి పైన ప్ర‌భుత్వం త‌ప్పుడు స‌మాచారం ఇస్తోంద‌ని విమ‌ర్శించారు. తాము ఎటువంటి అవి నీతి చేయ‌లేద‌ని..త‌మ పైన బుర‌ద చ‌ల్లాల‌నే ఉద్దేశంతో బుర‌ద‌లో కూరుకుపోతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. భవిష్యత్‌లో కరెంట్‌ చార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 22.5 మిలియన్‌ యూనిట్ల కొరత ఉంటే.. ఆ కొరత లేకుండా చేశామని, ఇప్పుడు రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని చంద్రబాబు ఆరోపించారు.

 ఒప్పందాల వెనుక అస‌లు క‌ధ ఇదీ..

ఒప్పందాల వెనుక అస‌లు క‌ధ ఇదీ..

పీపీఏల్లో చోటుచేసుకున్న అవినీతి పైన క‌మిటీ వేసామ‌ని..ఇంకా నివేదిక రాకుండానే చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేస్తు న్నారంటూ ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. చంద్ర‌బాబు చేసిన వాద‌న‌కు జ‌గ‌న్ స‌మాధానం ఇచ్చారు. ఏపీఈ ఆర్సీ మన రాష్ట్రానికి ఆర్పీవోలను నిర్దేశిస్తోందని చెబుతూ... 2015-16లో ఆర్పీఓ 5 శాతం నిర్ణయిస్తే అప్పటి రాష్ట్ర ప్రభు త్వం 5.5 శాతం కొనుగోలు చేసిందన్నారు.2016-17లో ఆర్పీఓ అయిదు శాతం నిర్ణయించగా, 8.6 శాతం కొనుగోలు చేసిం ద‌ని వివ‌రించారు. ఇక 2017-18లో ఆర్పీఓ 11శాతం నిర్ణయిస్తే 23.4శాతం కొనుగోలు చేసియ‌గా.. దీంతో 2016-17లో రూ. 430 కోట్లు, 2017-18లో రూ.924.9 కోట్లు, 2018-19లో రూ.1292.8 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడింది. ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తున్నామని తెలిసి... కొన్ని కంపెనీలకు లాభం చేకూరేలా ఈ ఒప్పందాలు జరిగాయని ఆరోపించా రు. టీడీపీ ప్రభుత్వం రూ.2654 కోట్లకు విద్యుత్‌ కొనుగోలు చేసిందని జ‌గ‌న్ లెక్క‌లు వివ‌రించారు.

స‌భ‌లో..స్క్రీన్ పైన ఆధారాల‌ను చూపుతూ..

స‌భ‌లో..స్క్రీన్ పైన ఆధారాల‌ను చూపుతూ..

చంద్ర‌బాబు హాయంలో జ‌రిగిన ఒప్పందాలు..ధ‌రలు ఏర‌కంగా చెల్లించిందీ జ‌గ‌న్ స‌భ‌లోనే ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా వివ‌రించారు. మొత్తం ఒప్పందాల్లో దాదాపు 64 శాతం మూడు సంస్థ‌ల అధిప‌త్య‌మే క‌నిపించింద‌ని లెక్క‌లు బ‌య‌ట‌కు తీసారు. ఇక‌, చంద్ర‌బాబు తాను అధికారంలోకి వ‌చ్చిన కావాల్సిన వ్య‌క్తికి ఈఆర్సీ ఛైర్మ‌న్ ప‌ద‌వి అప్ప‌గించ టానికి వీలుగా దీనికి సంబందించిన చ‌ట్ట స‌వ‌ర‌ణ సైతం చేసార‌ని కాపీని బ‌య‌ట పెట్టారు. ఇక‌, చంద్ర‌బాబు చెబుతు న్న‌ట్లుగా ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించే స‌మ‌యానికి ఏపీలో విద్యుత్ కొర‌త లేద‌ని..ప్ర‌తీ ఏటా డిమాండ్ కంటే ఉప్ప‌త్తి ఎక్కువ‌గా ఉందంటూ ఈఆర్సీ నివేదిక‌ను బ‌హిర్గతం చేసారు. ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రించిన కార‌ణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా సబ్సిడీ భారం పెరుగుతోందని..అయిదేళ్లలో రెవెన్యూ లోటు రూ.66,361కి చేరిందని గుర్తు చేసారు. ఈ భారా న్ని రాష్ట్ర ప్రజలపై వేయడం సమంజసమేనా అని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. ఇంత దారుణంగా టీడీపీ స్కామ్‌లు చేసిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

English summary
AP CM Jagan reveal PPA's details which taken place in Chandra babu tenure. Jagan cornered babu on displaying figures of PPA's and Power supply and demand details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X